Health Tips in HindiHealth Tips

తామరవ్యాధిని తగ్గించే ఇంట్లో ఉండే సహజ ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 24, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

తామర అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ల వలన కలిగే సాధారణ వ్యాధి మరియు చాలా సంక్లిష్టతలకు గురి చేస్తుంది. తామరవ్యాధిని తగ్గించే శక్తివతమైన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    తామరవ్యాధి

    తామర అనేది చర్మం యొక్క బాహ్యపొరపై ఫంగస్ ఇన్ఫెక్షన్ ల వలన కలిగే సాధారణ చర్మ వ్యాధిగా చెప్పవచ్చు. చర్మంపై ఎర్రగా, వృత్తాకారంలో ఏర్పడి, చర్మ మధ్యలో దురదలను కలుగచేస్తుంది. సాధారణంగా బాహ్యమూలాలలో, కాళ్ళలో ఏర్పడుతుంది మరియు శరీర ఇతర భాగాలలో కూడా ఏర్పడవచ్చు.  తామరవ్యాధిని శక్తివంతంగా తగ్గించే ఔషదాల గురించి ఇక్కడ తెలుపనడింది. Image Courtesy: Getty Images

  • 2

    వెల్లుల్లి

    వెల్లుల్లి 'ఎజోయేన్' అనే యాంటీ ఫంగల్ కారకాలను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం చాలా రకాల ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని దంచి నేరుగా తామర ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. దీనికి తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలపటం వలన వెల్లుల్లి మరింత శక్తివంతంగా పని చేస్తుంది. కనీసం రెండు వారాల వరకు రోజులో 2 నుండి 3 సార్లు ఈ విధంగా చేయటం వలన మంచి తామరవ్యాధి నుండి ఉపశమనం పొందుతారు. Image Courtesy: Getty Images

  • 3

    పచ్చిబొప్పాయి పండు

    తాజా బొప్పాయి పండు, గాయాలపై నూతన కణాలను ప్రభావిత పరచకుండా, నిర్జీవ కణాలను తొలగిస్తుంది. తామర సోకటం వలన ఏర్పడే నిర్జీవ కణాలు చర్మ ఉపరితలంపై ఉంటాయి. బొప్పాయి పండులో ఉండే పపాయిన్ మరియు కైమోపపాయిన్ ఎంజైమ్ లు వైరస్, ఈస్ట్ మరియు ఫంగస్ వంటి వాటి కణత్వచాలను నాశనం చేసి, ఇన్ఫ్లమేషన్ మరియు కాలిన గాయాల నుండి ఉపశమనం కలిస్తుంది. తాజా బొప్పాయి పండు ముక్కను తీసుకొని, ప్రభావిత ప్రాంతాలలో రాయటం వలన ఉపశమనం పొందుతారు.   Image Courtesy: Getty Images

  • 4

    కొబ్బరి నూనె

    తామరను తగ్గించుటలో శక్తివంతంగా పని చేసే మరొక సహజ ఔషదం కొబ్బరి నూనె. ఇది ఫంగస్ ల యొక్క అతిధేయులను తొలగిస్తుంది. కొబ్బరు నూనె 'లౌరిక్ ఆసిడ్' ను కలిగి ఉండి, తామరను కలుగచేసే ఫంగస్ ను వినాశనం చెందిస్తుంది. అంతేకాకుండా, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండే లౌరిక్ ఆసిడ్ అన్ని రకాల సుక్ష్మజీవులను చంపి చర్మాని కాపాడుతుంది. కొన్ని నిమిషాల పాటు కొబ్బరి నూనెను తామర ప్రభావిత ప్రాంతాలలో మసాజ్ లేదా మర్దన చేయండి. Image Courtesy: Getty Images

  • 5

    ఉప్పు నీరు

    ఉప్పునీరు అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా మరియు గాయాలను తగ్గించే ఔషదంగా పని చేస్తుంది. ఉప్పు నీరు ప్రభావిత ప్రాంతాలలో ఇన్ఫెక్షన్ లను తొలగించే గుణాలను కలిగి ఉంటుంది. ప్రభావిత ప్రాంతాన్ని ఉప్పు నీటిలో ఉంచండి లేదా సముద్రపు ఉప్పు నీటి పేస్ట్ ను ఇంఫెక్ష్సన్ లకు గురైన ప్రాంతంలో అప్లై చేయండి.Image Courtesy: Getty Images

  • 6

    కలబంద

    కలబంద యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలను కలిగి ఉంటుంది. చర్మ సమస్యలను తగ్గించుటలో కలబంద శక్తివంతంగా పని చేస్తుంది ముఖ్యంగా తామర వ్యాధికి సమర్థవంతంగా పని చేస్తుంది. కలబంద గుజ్జును తామర ఏర్పడిన ప్రాంతంలో పూసి, 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఎండిన తరువాత నీటితో కడిగి వేయండి. త్వరిత ఉపశమనం పొందటానికి గానూ, రోజులో రెండు లేదా మూడు సార్లు ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి.Image Courtesy: Getty Images

    Tags:
  • తామరవ్యాధికి ఇంట్లో ఉండే ఔషదాలు
  • తామరవ్యాధికి సహజ చికిత్స
  • Thamaranu Tagginche oushadalu
  • home remedies for ringworm in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం