Health Tips in HindiHealth Tips

కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    కాళ్ళ నొప్పి

    కాళ్ళ నొప్పి అనేది చాలా సాధారణ సమస్యగా చెప్పవచ్చు. కాలి వేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలో అయిన రావచ్చు. వృద్దాప్యం, అసౌకర్యంగా ఉండే షూ, ఎక్కువ సమయం పాటూ నడవటం లేదా నిలబడటం, మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల గృహ నివారణలు  మరియు సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి. వాటిలో కొన్నిటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    వెనిగర్

    బెణుకులు మరియు గాయాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ల వలన కలిగే అసౌకర్యాల నుండి వెనిగర్ ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని, రెండు చెంచాల వెనిగర్ ను అందులో కలపండి. దీనితో పాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్ ను కూడా కలపండి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టండి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

  • 3

    ఎప్సం సాల్ట్

    నయం చేసే గుణాలను కలిగి ఉండే ఎప్సం సాల్ట్ కాళ్ళలో కలిగే నొప్పుల నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపండి. తరువాత దీనిలో 10 నుండి 15 నిమిషాల పాటూ మీ కాళ్ళను అందులో ఉంచండి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను పాదాలకు పూయండి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్ళను పొడిగా మారుస్తుంది.

  • 4

    ఐస్

    కాళ్ళలో కలిగే నొప్పి మరియు వాపులను తగ్గించే శక్తివంతమైన పద్దతిగా ఐస్ థెరపీ పేర్కొనవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఐస్ ముక్కలను ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి, దానితో నొప్పిగా ఉన్న ప్రాంతాలలో వలయాకార రూపంలో మసాజ్ చేయండి. ఇలా ఐస్ బ్యాగ్ తో 10 నిమిషాల కంటే ఎక్కువగా చేయకూడదు ఎందుకంటే అధిక సమయం పాటూ చేయటం వలన చర్మం మరియు నరాలు ప్రమాదానికి గురవవచ్చు.

  • 5

    లవంగాల నూనె

    తలనొప్పి, కీళ్ళనొప్పులు, అథ్లెట్ లలో కలిగే కాళ్ళ నొప్పులు, గోళ్లలో కలిగే ఇన్ఫెక్షన్ మరియు కాళ్ళలో కలిగే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లావంగాల నూనెను అప్లై చేయటం వలన తక్షణ ఉపశమనం పొందుతారు. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతికి గురవుతాయి. మంచి ఫలితాల కోసం, రోజులో కొన్ని సార్లు లవంగాల నూనెను అప్లై చేయండి. Image source: Getty Images

    Tags:
  • కాళ్ళలో నొప్పి తగ్గించే ఔషదాలు
  • పాదాల నొప్పిని తగ్గించే గృహ నివారణలు
  • కాళ్ళలో అసౌకర్యాలను తగ్గించే సహజ పద్దతులు
  • Kallalo noppini thagginche oushadalu
  • Home remedies for foot pain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ