Health Tips in HindiHealth Tips

కట్టుడు పళ్ళు లేదా పళ్ళ సెట్ వలన కలిగే నొప్పిని తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jul 15, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కట్టుడు పళ్ళు లేదా పళ్ళ సెట్ వలన నిజంగానే అసౌకర్యానికి గురవుతుంటాము. ఈ నొప్పిని తగ్గించుకోటానికి ఖరీదైన మందుల వాడకానికి బదులు ఇక్కడ తెలిపిన సహజ ఔషదాలను వాడండి.
  • 1

    కట్టుడు పళ్ళ నొప్పికి ఉప్పు

    ఉప్పు దంతాలకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా చిగుళ్ళ వాపు మరియు నొప్పిని తగ్గించుటకు ఉప్పును వాడతారు. ఉప్పు నోట్లో బాక్టీరియా పెరుగుదలను నియంత్రించటమేకాకుండా, పొడిగా ఉండే నోరు లేదా నోట్లో ఉండే గాయలను తగ్గిస్తుంది. కట్టుడు పళ్ళ సెట్ ను తీసి, ఉప్పుతో చిగుళ్ళపై రాసి, నీటితో కడగటం వలన పంటి నొప్పి తగ్గుతుంది. ఇలా రోజు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.  Image source:Gettyimages.in

  • 2

    లవంగాలు

    దంతాలలో కలిగే నొప్పిని తగ్గించే మరొక ఔషదం లవంగాలు. లవంగాలలో ఉండే 'యూజినాల్' యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) గుణాలను కలిగి ఉండి, నొప్పిని నివారిస్తుంది. కొన్ని లవంగాలను తీసుకొని వాటిని గ్రైండ్ చేయండి, ఇందులోనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని కూడా కలపండి. ఈ పేస్ట్ ను నొప్పిగా ఉండే చిగుళ్ళకు అప్లై చేసి 5 నిమిషాల పాటూ వేచి ఉండండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందుటకు రోజులో రెండు సార్లు ఈ పద్దతిని అనుసరించండి. Image source:Gettyimages.in

  • 3

    బ్లాక్ టీ బాగ్స్

    బ్లాక్ టీ కూడా దంతాలలో కలిగే నొప్పుని తగ్గిస్తుంది. బ్లాక్ టీ 'టానిక్ ఆసిడ్'లతో నిండి ఉండి, చిగుళ్ళలో కలిగే నొప్పి, వాపులను తగ్గితుంది. బ్లాక్ టీ బ్యాగ్ ను 5 నిమిషాల్ పాటూ వేడి నీటిలో ఉంచండి. టీ బ్యాగ్ ను తొలగించి చాల్లారే వరకు వేచి ఉండండి. ఇపుడు ఈ టీ బ్యాగ్ ను ప్రభావిత ప్రాంతాలలో 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచండి. తరువాత నోటిని నీటితో కడిగి వేసి, మంచి ఫలితాలను పొందుటకు రోజులో రెండు సార్లు ఈ పద్దతిని అనుసరించండి.  Image source:Gettyimages.in

  • 4

    పసుపు

    పసుపులో ఉండే 'కర్కుమిన్' యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చిగుళ్ళలో కలిగే వాపులు, నొప్పి మరియు నోట్లో ఉండే హానికర బాక్టీరియాను తొలగిస్తుంది. ¼ చెంచా పసుపు పొడిని తీసుకొని, కొన్ని నీటి చుక్కలతో కలిపి, పేస్ట్ వలే తయారు చేయండి. ఈ పేస్ట్ ను ప్రాభావిత ప్రాంతాలలో అప్లై చేసి, 5 నిమిషాల పాటూ అలాగే వేచి ఉండండి. తరువాత కొన్ని నిమిషాల పాటూ మసాజ్ చేయండి. ఇలా రోజు రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. Image source:Gettyimages.in

  • 5

    కలబంద

    కలబంద యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది, కావున నోట్లో ఉండే హనికర బాక్టీరియాను తొలగించుటకు కలబందను వాడండి. కలబంద ఆకు నుండి చాకు సహాయంతో గుజ్జును సేకరించి నేరుగా నొప్పిగా ఉండే పండ్లకు అప్లై చేయండి. ఇలా 10 నిమిషాల పాటూ వేచి ఉన్న తరువాత నీటితో కడిగి వేయండి. ఇలా చేసిన ఒక గంట వరకు ఏమ్ తినకండి. నొప్పి తగ్గే వారకు రోజు 2 నుండి 3 సార్లు ఈ పద్దతిని అనుసరించండి. Image source:Gettyimages.in

    Tags:
  • కట్టుడు పళ్ళ నొప్పిని తగ్గించే ఔషదాలు
  • పళ్ళ సెట్ వలన కలిగే నొప్పిని తగ్గించే సహజ పద్దతులు
  • Kattudu palla noppnni tagginch oushadalu
  • Home remedies for denture pain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ