Health Tips in HindiHealth Tips

చలికాలంలో పిల్లలలో కలిగే జలుబు తగ్గించే గృహ నివారణలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పిల్లల ముక్కు బ్లాక్ అయినపుడు వారు పడే ఇబ్బంది మనం చూడలేము, ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా జలుబు తగ్గించుకోవచ్చు. పిల్లలలో కలిగే జలుబును తగ్గించే గృహ నివారణల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.
  • 1

    జలుబు తగ్గించే గృహ నివారణలు

    జలుబు, పిల్లలను ఆడుకొనివ్వకుండా, అలసిపోయేలా చేసి అనేక ఇబ్బందులకు కలిగిస్తుంది అవునా! జలుబు తగ్గించే మాత్రలు లేదా మందులు వాడే సమయం కూడా కాదు. ఇలాంటి సమయంలో సహజ పద్దతులను అనుసరించటం ద్వారా పిల్లలలో జలుబు తగ్గించవచ్చు. మీ పిల్లలాలూ జలుబు లేదా దగ్గు వంటి సమస్యలతో బాధపడితే ఇక్కడ తెలిపిన ఔషదాలను వాడి, జలుబు సమస్య నుండి ఉపశమనం అందించండి.

  • 2

    ఎక్కువ సమయం విశ్రాంతి

    ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలసిపోయేలా మరియు చికాకులకు గురి చేస్తుంది. కానీ, పిల్లలు నిశబ్దంగా ఉన్నపుడు లేదా పడుకున్నపుడు జలుబు నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున, మీ పిల్లలు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేలా చూడండి. సరైన సమయం పాటూ విశ్ర్రాంతి జలుబును తగ్గిస్తుంది.

  • 3

    వేడి ఆవిరులు

    వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వలన జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. మీ పిల్లల గదిలో తేమభరిత వాతావరణం అధికంగా ఉండేలా చూడండి. అంతేకాకుండా, ఇతర ఆరోగ్య లాభాల కోసం గానూ, వేడి నీటితో స్నానం చేపించటం మంచిది.

  • 4

    జలుబు లక్షణాలను తగ్గించే సెలైన్ డ్రాప్స్

    మీ బాబు లేదా పాప వయసు ఎక్కువగా ఉంటే సలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కును శుభ్రపరచవచ్చు. పిల్లలలో ముక్కులో ఉన్న వాటిని శుభ్రపరచటానికి సిరంజ్ లేదా పాలు పట్టే డబ్బా కూడా సహాయపడుతుంది. సిరంజ్ ద్వారా పిల్లల ముక్కులో ఉన్న అన్ని రకాల వాటిని శుభ్రపరచటం ద్వారా జలుబు లక్షణాలను తగ్గించవచ్చు.

  • 5

    జలుబు తగ్గించే అదనపు ద్రవాలు

    మీ బాబు లేదా పాప 6 నెలల లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే, అధిక ద్రావణాలను తాగించటం ద్వారా శరీరం డీ హైడ్రేషన్ కు సుముఖంగా ఉంటుంది మరియు ముక్కు నుండి కారే ద్రవాలు బయటకు పంపబడతాయి. ఫ్రూట్ స్మూతీస్ మరియు ఆరోగ్యకర ద్రావణాలు పిల్లలు ఆస్వాదించటమే కాదు, వారి జలుబు కూడా తగ్గిపోతుంది. Image source: Getty Images

    Tags:
  • పిల్లలలో జలుబు తగ్గించే ఔషదాలు
  • పిల్లలలో జలుబు తగ్గించే సహజ పద్దతులు
  • పిల్లల జలుబు ఇంట్లోనే తగ్గించవచ్చు
  • Pillalalo jaliubu tagginche gruha nivaranalu
  • Home remedies for cold in babies in Telugu.
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు