Health Tips in HindiHealth Tips

దోమకాటు వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 30, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

దోమకాటుల వలన నిరంతరాయంగా దురదలు, చర్మం ఎర్రగా మారటం, చర్మ వాపులు మరియు నొప్పి కలుగుతాయి. దోమకాటు వలన ఇలాంటి సమస్యలను తగ్గించి నొప్పి మరియు దురదలను సమర్థవంతంగా తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    కీటకాల కాటుకు ఔషదాలు

    దోమలు మరియు బగ్ (కీటకాల) కుట్టడం వలన నిరంతరాయంగా దురదలు, వాపులు, చర్మం ఎర్రగా మారటం లేదా నొప్పి కలుగుతాయి. ఈ సమస్యలు ఒకటి లేదా రెండు రోజుల వరకు ఇబ్బందులు కలుగచేస్తాయి. వీటి వలన కలిగే నొప్పి మరియు దురదాలను నుండి త్వరగా ఉపశమనం అందించే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image Courtesy: Getty Images

  • 2

    నిమ్మ

    యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే నిమ్మ దోమ కాటుల వలన కలిగే సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. త్వరగా ఉపశమనం పొందుటకు ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కత్తిరించి దోమకాటుకు గురైన ప్రాంతంలో నిమ్మరసాన్ని అప్లై చేయండి.  Image Courtesy: Getty Images

  • 3

    ఉల్లిపాయ లేదా వెల్లుల్లి ముక్కలు

    దోమ లేదా కీటకాల కాటు వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగించటానికి గానూ ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ముక్కలు వాడతారు. ప్రభావిత ప్రాంతంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ముక్కను నేరుగా అప్లై చేయండి, ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచి, నీటితో కడిగి వేయండి.  Image Courtesy: Getty Images

  • 4

    బేకింగ్ సోడా

    బేకింగ్ సోడా అల్కలైన్ గుణాలను కలిగి ఉంటుంది, కావున దురదలుగా ఉన్న చర్మం యొక్క pH ను తటస్థీకరిస్తుంది. ఒక కప్పు నిండా ఉన్న నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడాను కలపండి. శుభ్రమైన బట్ట సహాయంతో, 10 నుండి 20 నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి.  Image Courtesy: Getty Images

  • 5

    కలబంద

    కలబంద, సహజ యాంటీ సెప్టిక్ ఏజెంట్ గా పని చేస్తుంది మరియు దోమ కాటు వలన కలిగే సమస్యల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలబంద నుండి తీసిన గుజ్జును ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయటం వలన దురదలు, చర్మ వాపులు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మీ ఇంట్లో కలబంద చెట్టు లేని ఎడల, మార్కెట్లో లేదా షాపులలో కలబంద గుజ్జు సులభంగా లభిస్తుంది. Image Courtesy: Getty Images

  • 6

    ఐస్

    ప్రభావిత ప్రాంతాలలో 10 నుండి 15 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ ను ఉంచటం ద్వారా దోమ లేదా ఇతర కీటకాల కాటు వలన కలిగే సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ప్రభావిత ప్రాంతాలలో ఉష్ణోగ్రత తగ్గించటం వలన కాటుకు గురైన ప్రాంతం నుండి ఇన్ఫ్లమేషన్ దూరం చేస్తుంది. Image Courtesy: Getty Images

  • 7

    ఉప్పు

    ఉప్పు కలిగి ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాల వలన దోమ లేదా కీటకాల కాటు వలన కలిగే సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. కొద్దిగా ఉప్పును మరియు మరియు నీటిలో కలిపి ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయటం వలన దోమ కాటు వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. Image Courtesy: Getty Images

  • 8

    తేనె

    దోమకాటు వలన కలిగే సమస్యలను తేనె శక్తివంతంగా తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్నందు వలన అని చెప్పవచ్చు. అంతేకాకుండా, దోమకాటు వలన కలిగే ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. Image Courtesy: Getty Images

  • 9

    టూత్ పేస్ట్

    దోమకాటు వలన కలిగే ఇబ్బందులు మరియు తీవ్రత అధికం అవుతున్నట్లయితే, సాధారణంగా రోజు ఉదయాన వాడేటూత్ పేస్ట్ దోమకాటుకు గురైన ప్రాంతంలో అప్లై చేయటం వలన అన్ని విధాలుగా ఉపశమనం పొందుతారు.  Image Courtesy: Getty Images

  • 10

    ఆస్పిరిన్

    యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఆస్పిరిన్ దోమ కాటు వలన కలిగే దురదలను త్వరగా తగ్గించి వేస్తుంది. ఆస్పిరిన్ ను ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయటం వలన చర్మ వాపులను తగ్గించి మరియు దురదల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. Image Courtesy: Getty Images

    Tags:
  • దోమకాటు నుండి ఉపశమనం కలిగించే ఔషదాలు
  • దోమకాట్లకు చికిత్స
  • Domakatuku Sahaja chikitsa
  • Remedies for Mosquito Bites in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • sandeep05 Aug 2015
    very help full article. Thank you for site...

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

    మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

    మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన