Health Tips in HindiHealth Tips

ఈ సమస్యలు గమనించారా? అయితే థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లే...

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 17, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని సార్లు థైరాయిడ్ సమస్యలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల ద్వారా బహిర్గతం అవుతుంటాయి. ఇక్కడ తెలిపిన దాగి ఉండే లక్షణాలు థైరాయిడ్ సమస్యలకు సూచికలు, కావున వీటి పైన అవగాహన ఉండటం మంచిది.
  • 1

    థైరాయిడ్ కావచ్చు

    జీర్ణశయ సమస్యలు, ఆకలిగా అనిపించకపోవటం, బరువులో వ్యత్యాసాలు వంటివి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుగా పరిగనిస్తుంటాము. కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మన శరీరంలో కలిగే బలమైన అనారోగ్యానికి సూచికలు కావచ్చు. చాలా మంది థైరాయిడ్ సమస్యలకు గురయ్యామన్న విషయం కూడా తెలియదు. థైరాయిడ్ గ్రంధి సమస్యలు కలిగినపుడు బహిర్గతమయ్యే లేదా దాగి ఉండే బహిర్గత లక్షణాల గురించి కింద పేర్కొనబడింది.

  • 2

    జీర్ణాశయ సమస్యలు

    మీరు కొంత కాలంగా మలబద్దకం లేదా విరేచనాలతో భాదపడుతున్నారా? అయితే థైరాయిడ్ ఉందని అర్థం. గ్యాస్, అపానవాయువు (పిత్తు) మరియు పొట్ట ఉబ్బరంగా అనిపించటం వంటి సమస్యకు థైరాయిడ్ వలన కలుగుతాయి. థైరాయిడ్ గ్రంధి స్రవించే హార్మోన్ లో వ్యత్యాసం జీర్ణాశయ వ్యవస్థను ప్రభావిత పరచి ఈ సమస్యలకు దారి తీస్తుంది.

  • 3

    శరీర బరువులో మార్పులు

    థైరాయిడ్ గ్రంధి శరీర జీవక్రియలను నియంత్రిస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే శరీర బరువు తగ్గటం లేదా పెరగటం వంటి సమస్యలు గమనించినట్లయితే, మీరు థైరాయిడ్ సమస్యలతో భాదపడుతున్నారని అర్థం. హైపర్ థైరాయిడిజం కలిగి ఉన్నవారిలో జీవక్రియ రేటు పెరగటం వలన శరీర బరువు తగ్గుతారు.

  • 4

    శ్వాస సమస్యలు

    కొన్ని రకాల పదార్థాలు ముఖ్యంగా సోయా, నట్స్ మరియు క్యాబేజీ వంటి ఆహార పదార్థాలు థైరాయిడ్ విధిలో ఆటంకాలను ఏర్పరచి, శ్వాస సమస్యలను కలిగిస్తాయి. ఈ ఆహార పదార్థాలను తిన్నపుడు శ్వాసలో సమస్యలు ఏర్పడినట్లయితే, వెంటనే వైద్యుడిని కలవండి.

  • 5

    గాయిటర్

    థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగటాన్ని గాయిటర్ గా పేర్కొంటారు. థైరాయిడ్ గ్రంధి సమస్యలు అధికం అవటం వలన గ్రంధి ఉబ్బటం, గడ్డలుగా ఏర్పడటం లేదా మెడ ప్రాంతంలో అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితి హైపర్ థైరాయిడిజం మరియు హైపో థైరాయిడిజం రెండింటిలోను కలుగుతుంది. మెడ ప్రాంతంలో గడ్డలు ఏర్పడటం లేదా వాపులను గమనించినట్లయితే, అశ్రద్ధ వహించకుండా వెంటనే వైద్యుడిని కలవండి.

  • 6

    హృదయ స్పందన రేటు

    మీరు ఉత్తేజానికి గురి కాకున్నను హృదయ స్పందన రేటు పెరుగుదల అనేది థైరాయిడ్ సమస్యలకు లోనయ్యారు అని తెలిపే మరొక సూచన. థైరాయిడ్ యొక్క తక్కువ స్థాయిల వలన సాధారణ సమయంలో ఉండే హృదయ స్పందన రేటు తగ్గుతుంది.

  • 7

    ఆకలి లేకపోవటం

    థైరాయిడ్ కలిగిందని తెలిపే మరొక సూచిక- ఆకలి లేకపోవటం. థైరాయిడ్ వ్యాధి కలిగి ఉన్నవారు ఆహార సేకరణకు విముకతను కలిగి ఉంటారు మరియు కారణం లేకుండా శరీర బరువు పెరగుగుతుంది. Image Source: Getty

    Tags:
  • థైరాయిడ్ సమస్యలు
  • థైరాయిడ్ సమస్యలను సూచించే చిహ్నాలు
  • థైరాయిడ్ సమస్యల బహిర్గత లక్షణాలు
  • Thyroid grandhi samasyalu
  • Signs You Might Have a Thyroid Disorder in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ