Health Tips in HindiHealth Tips

ఆరోగ్యకర విధానాలలో డిసెంబర్ 31 ను జరుపుకునే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 26, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చూస్తుండగానే 2016 డిసెంబర్ 31 రానే వచ్చింది. ఇప్పటికీ, ఎలా జరుపుకోవాలో అందరి ప్లాన్ సిద్దం అయ్యే ఉంటాయి, కానీ ఆరోగ్యకర పద్దతిలో జరుపుకొని, అందరికి ఆదర్శ ప్రాయంగా నిలవండి.
  • 1

    డిసెంబర్ 31

    ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధురానుభూతులు కలిగిన 2016 సంవత్సరం ముగుస్తూనే ఉంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన 2016 వీడుకోలు పార్టీ ఇతరులకు కనువిప్పు కలగాలి. అనగా సిగరెట్, ఆల్కహాల్ తాగటం వంటి అనారోగ్యకర పద్దతుల వలన మన ఆరోగ్యమే కాదు చుట్టూ ఉండే వారి ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కావున డిసెంబర్ 31 వేడుకలను ఆరోగ్యకర పద్దతిలో జరుపుకొని ఇతరులకు ఆదర్శప్రాయులుగా నిలవండి.

  • 2

    మిడ్ నైట్ యోగ క్లాసులు

    డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ప్రాంతంలో మన శరీరాన్ని వంచుతూ యోగ చేయండి. ఇలా చేయటం వలన వచ్చే 2017 సంవత్సరం మనకు ఆరోగ్యకమైనదని ఒక సూచికగా చెప్పవచ్చు. యోగ వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

  • 3

    రేస్ లో పాల్గొనండి

    2016 డిసెంబర్ 31 రాత్రి రోజు పరిగెత్తండి. స్నేహితులతో కలిసి రన్నింగ్ పోటీలు నిర్వహించండి. వచ్చే నూతన సంవత్సరం (2017)లో సమస్యలకు దూరంగా పరిగేడుతున్నాం అనే సూచికగా చెప్పవచ్చు. రన్నింగ్ వలన అన్ని రకాలుగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు దీనిని రోజు మీ దిన చర్యలో ఒక భాగంగా మార్చుకోండి.

  • 4

    వాలంటీర్ గా పని చేయండి

    మన చుట్టూ రోజు వైద్యశాలలు లేదా వృద్దులకు లేదా అంధులకు క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈ సారి డిసెంబర్ 31 న ఈ క్యాంపులలో వాలంటీర్ లుగా పని చేయండి. ఇలా చేయటం వలన మీ ఇతరులకు సహాయపడినట్టే కాదు, వచ్చే నూతన సంవత్సరంలో మీ వల్ల ఇతరులకు ప్రయోజనాలు కలగవచ్చు.

  • 5

    ఆ రాత్రి పట్ల ఆరోగ్యకర ఆలోచనలతో ఉండండి

    మీ ప్లాన్ ఏదైనప్పటికీ, మీ పై ఒత్తిడి ఉండకుండా చూసుకోండి. 2016 ముగిసే చివరి రాత్రి మరియు 2017 కు ప్రారంభమయ్యే మొదటి రాత్రి మీకు మంచి అనుభూతిని ఇవ్వలే కానీ, ఎలాంటి నిరాశకు లోనూ చేయకూడదు. కావున మీకు నచ్చిన ఆరోగ్యకర పద్దతిని ఎంచుకొని వేడుకను నిర్వహించండి మరియు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా మారండి.  Image source: Getty Images

    Tags:
  • ఆరోగ్యకర పద్దతిలో డిసెంబర్ 31 వేడుకలు
  • కొత్త సంవత్సరం వేడుకలు
  • Arogyakara paddathilo Dec 31 nu jarupukondi
  • Healthy ways to celebrate 31 Dec in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు