Health Tips in HindiHealth Tips

మిమ్మల్ని అందంగా కనపడేలా చేసే ఆరోగ్యకర మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 04, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మేకప్, రసాయనిక ఉత్పత్తులు, క్రీమ్'లు మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్యకర అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అవును నిజమే, చర్మానికి కావాల్సిన పోషకాలు, ఇతర అన్ని రకాల కారకాలు వీటి నుండి అందించబడతాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
 • 1

  అందం

  ప్రతి ఒక్కరు అందంగా కనపడాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరు అందంగా పెంచుకోటానికి మరియు కనపడటానికి చాలా రకాల పనులను నిర్వహిస్తుంటారు. అందంగా కనపడటానికి గానూ చాలా రకాల రసాయనాలను కూడా వాడుతుంటారు, కానీ, వీటి ద్వారా మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన విధానాలను పాటించటం ద్వారా అందం పెంపొందించుకోవచ్చు.

 • 2

  అధికంగా నీటిని తాగండి

  నీటిని ఎక్కువగా తాగటం వలన, చర్మాన్ని హైడ్రేటెడ్'గా ఉంచటమే కాకుండా, ప్రసరణలను మెరుగుపరచి, కణాలలో కలిగిన ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తుంది. చాలా కాలం పాటూ మీ చర్మం ప్రకాశవంతంగా, మీరు అందంగా కనపడటానికి ఉన్న ఏకైక మార్గం ఎక్కువ నీరు తాగటం.

 • 3

  సూర్యరశ్మి నుండి స్వతహాగా కాపాడుకోండి

  ఎక్కువ సమయం పాటూ సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన మచ్చలు, ముడతలు, మరియు చర్మం పొడిగా మారుతుంది. సూర్యకాంతికి బహిర్గతం అయ్యే ముందు చర్మాన్ని కప్పి ఉంచే దుస్తువులను లేదా సన్ స్ర్కీన్ లోషన్'లను వాడండి.

 • 4

  తేనె

  ఆరోగ్యకర మరియు అందమైన చర్మాన్ని పొందాలి అనుకుంటున్నారా! తేనె వలన ఇది సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. రెండు చెంచాల తేనెను మీ ముఖానికి పూసి, 8 నుండి 15 నిమిషాల పాటూ అలానే వదిలేయండి. తేనెలో ఉన్న ప్రత్యేక గుణాలు, చర్మానికి తేమను చేకూర్చి, మచ్చలను వలయాలను కలుగచేసే బ్యాక్టీరియాలను తొలగిస్తుంది.

 • 5

  దోసకాయ

  దోసాకాయ, కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను, వాపులను తొలగించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అందరికి తెలిసిందే. దోసకాయ ముక్కలు, సహజ ఐ ప్యాడ్'లుగా పని చేస్తాయి. దోసకాయ ముక్కలను కత్తిరించి, కాళ్ళపై ఉంచి కనీసం 20 నిమిషాల పాటు ఉంచండి.

 • 6

  సరైన సమయం పాటూ నిద్ర

  నిద్ర అనేది పూర్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మన రూపును కూడా ప్రభావిత పరుస్తుంది. అందంగా కనబడాలి అనుకుంటే, రోజు సరైన సమయం పాటూ పడుకోండి. కనీసం రోజు 8 గంటల పాటూ పడుకోవటం వలన ఆరోగ్యం మాత్రమె కాకుండా, అందం కూడా మెరుగుపడుతుంది.

 • 7

  బొప్పాయి పండు

  బొప్పాయి పండు నుండి విటమిన్ 'A' పుష్కలంగా కలిగి ఉండి, ''పపాయిన్'' అనే ఎంజైమ్'ను కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ చర్మంలోని నిర్జీవ కణాలను తొలగించటమే కాకుండా, చర్మంలో ఉన్న మలిన పదార్థాలను కూడా తొలగిస్తుంది. ఒక గ్లాసు బొప్పాయి పండు పాలను, మీ చర్మానికి అద్ది, చర్మంలో కలిగే అద్భుతాలను గమనించండి.

 • 8

  వ్యాయామాలు

  అందంగా అనపడటానికి సహాయపడే మరొక ప్రక్రియ వ్యాయామాలు చేయటం. వ్యాయామాలను రోజు చేయటం వలన చెమట రూపంలో మలినాలు భయటకి పంపబడి, ఫిట్'గా కనపడతారు. వ్యాయామాలు మాత్రమె కాకుండా, మీకు ఇష్టమైన ఆటలలో కూడా పాల్గొనటం వలన శరీరం ఫిట్'గా మార్చబడుతుంది.

 • 9

  కాఫీ

  చాలా మంది వారి రోజును కాఫీతో పారంభించటానికి ఇష్టపడుతుంటారు, అవునా! కాఫీ, ఎక్సోఫోలేట్ గుణాలను కలిగి ఉన్నందు వలన అలసట వలన నిస్తేజంగా కనపడే చర్మాన్ని, సాధారణంగా కనపడేలా చేస్తుంది. కాఫీ పౌడర్'ను మీకు నచ్చిన ఫేష్ వాష్ క్రీమ్'లో కలిపి, ముఖానికి వాడండి.

  Tags:
 • అందంగా కనపడుటకు చిట్కాలు
 • అందాన్ని మెరుగుపరిచే చిట్కాలు
 • ఆరోగ్యకర మార్గాలు
 • Healthy Ways to Be Beautiful in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

  లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

  లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ