Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధి గ్రస్తులు మంచి జీవితం కోసం పాటించాల్సిన ఆరోగ్య తీర్మానాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Apr 10, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులు మీ ఆరోగ్యం పట్ల తీర్మానాలను పాటించటం మరిచారా! ఆరోగ్యంగా జీవించటానికి ఆరోగ్య తీర్మానాలను పాటించటం తప్పని సరి అని చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎక్కువ కాలం జీవించటానికి పాటించాల్సిన తీర్మానాల గురించి తెలుపబడింది.
  • 1

    ఇంకా ఆలస్యం అవలేదు

    ఆరోగ్య తీర్మానాలలో మార్పులు చేయటం ఈ నెలలో కుదరట్లేదా! అయితే, వచ్చే నెలలో అయిన మీ ఆహార, ఆరోగ్య తీర్మానలలో మార్పులను అనుసరించండి. ఇలాంటివి మధుమేహవ్యాధి గ్రస్తులకు చాలా ముఖ్యమని చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి జీవితాన్ని సంతోషంగా, ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా గడాపాలి అనుకుంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన వాటిని అనుసరించండి.Image Source : Getty Images

  • 2

    క్రమంగా షుగర్ లెవెల్స్ ల తనికీ

    మధుమేహావ్యాధి గ్రస్తులు ఆరోగ్యంగా జీవించాలంటే, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గటాన్ని 'హైపోగ్లైసిమియా' అని చక్కెర స్థాయిలు అధికం అవటాన్ని 'హైపర్ గ్లైసిమియా' అంటారు. ఇవి రెండు ప్రమాదకరమే. కావున క్రమంగా చక్కెర స్థాయిలను చెక్ చేపించుకోవటం వలన ఎంతవరకు నిర్వహిస్తున్నామో మరియు తరువాత ఎంత మొత్తంలో నిర్వహించాలో తెలుస్తుంది. Image Source : Getty Images

  • 3

    హిమోగ్లోబిన్ స్థాయిల తనికీ

    హిమోగ్లోబిన్ A1c (HbA1c) అనేది సాధారణ రక్త పరీక్ష మరియు ఇది మధుమేహ వ్యాధిని నిర్వహించాలో తెలుపుతుంది. ఈ పరీక్ష ద్వారా రక్తంలోని సగటు చక్కెర స్థాయిలు తెలుస్తాయి, ఫలితంగా చక్కెర స్థాయిలు ఎంత వరకు ఉన్నాయో, మరెంత వరకు నిర్వహించాలో తెలుస్తుంది. కావున మధుమేహ వ్యాధి గ్రస్తులు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారైన చెక్ చేపించుకోవటం మంచిది. ఈ పరీక్ష కోసం ఉపవాసం ఉండాల్సిన అవసరం కూడా లేదు.Image Source : Getty Images

  • 4

    మూత్రపిండాల సంరక్షణ

    మీరు మధుమేహాన్ని కలిగి ఉన్నారా! రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించని ఎడల, మూత్రపిండాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా మూత్రపిండాల ముఖ్య విధి అయినట్టి, పోషకాల సంగ్రహణ సరిగా నిర్వహించలేదు. ఈ సమస్యల భారిన పడకుండా ఉండటానికి, నీటిని ఎక్కువగా తాగండి, ఫైబర్ ఆహారాలను ఎక్కువగా తినండి, పోషకాలున్న ఆహారాలను తినండి. Image Source : Getty Images

  • 5

    కొవ్వు పదార్థాల స్థాయిలను చెక్ చేపించుకోండి

    మధుమేహ వ్యాధి గ్రస్తులు, శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు అధికంగా కలిగి ఉండటం వలన గుండె వ్యాధులు లేదా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగటం వలన, సాధారణ మరియు ప్రమాదకర సమస్యలు కలుగుతాయి. వీటి వలన ధమనులలో అడ్డంకులు ఏర్పడటం వలన కరోనరీ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. కావున క్రమంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు వీటి స్థాయిలను చెక్ చేపించుకోండి.Image Source : Getty Images

  • 6

    సరైనవి తినండి

    మీరు తినే ఆహార పదార్థాలు, శరీర బరువు మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావిత పరుస్తాయి. రోజులో 3 సార్లు అధిక ఆహారాన్ని తీసుకోవటం కన్నా, ప్రతి మూడు గంటలకు ఒకసారి తక్కువ ఆహారాన్ని తీసుకోవటం శ్రేయస్కరం. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. ఫ్రైడ్, నూడుల్స్, వంటి అనారోగ్యకర ఆహారాలకు దూరంగా ఉండండి. మీరు తినే ప్రతి ఆహరం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వీటి వలన రక్తంలోని చక్కెర స్థాయిలు అధికం అవవచ్చు. Image Source : Getty Images

  • 7

    రోజు వ్యాయామాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలి అనుకుంటే వ్యాయామాలు తప్పని సరి అని చెప్పవచ్చు. వ్యాయామాల వలన రక్త ప్రసరణ మెరుగుపడి, కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడతాయి. వ్యాయామాల ముందు, తరువాత బ్లడ్ షుగర్ లను చెక్ చేపించుకోండి. మధుమేహ వ్యాధి గ్రస్తుల చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలనుకుంటే వారంలో 5 సార్లు వ్యాయామాలను అనుసరించండి.Image Source : Getty Images

  • 8

    బరువు తగ్గించుకోండి

    స్థూలకాయత్వం వలన, శరీరంలో హార్మోన్ స్థాయిలలో మార్పులు కలగవచ్చు. నడుము చుట్టూ ఉండే కొవ్వు పదార్థాల వలన పొట్టపై ఒత్తిడి ఏర్పడి, పోషకాల లోపం ఏర్పడటం వలన, రక్తపీడనం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిల వలన గుండె వ్యాధులు కూడా కలుగవచ్చు. కావున మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్పక శరీర బరువు తగ్గించుకోవాలి మరియు జంక్ ఫుడ్, అనారోగ్యకర ఆహారాలకు దూరంగా ఉండాలి.  Image Source : Getty Images

    Tags:
  • ఆరోగ్య తీర్మానాలు
  • మధుమేహులకు ఆరోగ్యకర సూచనలు
  • సంతోషకరమైన జీవనం కోసం సూచనలు
  • Healthy Resolutions Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • R.venkateswarlu17 Apr 2015
    Please tell me Diabetic patient Diet plan.

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా