Health Tips in HindiHealth Tips

అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 01, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అక్రోటుకాయలు శరీరానికి కావలసియన పోషకాలను అందించటమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల పెరుగుదలను నియంత్రిస్తాయి. అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    అక్రోటుకాయలు (వాల్నట్)

    అక్రోటుకాయలు అనేవి సాధారణంగా అందరికి తెలిసిన పోషక విలువలు కలిగిన ఎండిన పండ్లు. అంతేకాకుండా, ఆరోగ్యాన్ని చాలా రకాలుగా పెంపొందిస్తుంది. అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ కొన్ని తెలుపబడ్డాయి.Image Courtesy:Getty Images

  • 2

    రోగనిరోధక శక్తిని

    అక్రోటుకాయలు రోగ నిరోధక వ్యవస్థకు చాలా మంచివి. ఇవి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన, శరీర నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచి వ్యాధులకు దూరంగా ఉండేలా సహాయం చేస్తుంది. మీ భోజనంలో వీటిని కలుపుకోవటం వలన నిరోధక వ్యవస్థకు చాలా మంచిది.Image Courtesy:Getty Images

  • 3

    రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ

    రక్తంలోని చక్కెర స్థాయిలకు సంబంధించిన సమస్యలను తగ్గించటంలో ఇవి సహయం చేస్తాయి. మీరు తినే భోజనంలో వీటిని కలుపటం వలన హృదయ నాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతుంది అని పరిశోధనలలో వెల్లడయింది.Image Courtesy:Getty Images

  • 4

    రొమ్ము క్యాన్సర్

    విత్తనాలలో ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిలో ఇది ముఖ్యమైనది మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తాయి. రొమ్ము క్యాన్సర్ కలిగి ఉన్న ఆడవారు మరియు దీనికి చికిత్స చేపించుకునే వారు రోజు ఒక కప్పు అక్రోటుకాయలు తినటం వలన, ఇవి శక్తివంతంగా రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి.Image Courtesy:Getty Images

  • 5

    గుండె ఆరోగ్యం

    అక్రోటుకాయలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను పుష్కలంగా కలిగి ఉండి, హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతాయి. అక్రోటుకాయలు, రోజు తినటం వలన, రక్త పీడనం అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'ల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడి, గుండెను ఆరోగ్యకరంగా ఉంచే మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెంచుతుంది.Image Courtesy:Getty Images

  • 6

    గర్భం

    గర్భ సమయంలో ప్రతి త్రైమాసిక దశలో పోషకాలు తప్పని సరిగా అవసరం. గర్భంతో ఉన్న స్త్రీలు రోజు తీసుకునే ఆహరంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు అధికంగా ఉండేలా చూసుకోండి. అక్రోటుకాయలు పుష్కలమైన ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉంటాయి ఇవి పిండ పెరుగుదలకు మరియు శిశువు ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, ప్రసవం ముందుగా అవకుండా, సరరైన సమయంలో ప్రసవం జరిగేలా చేస్తుంది. Image Courtesy:Getty Images

  • 7

    జీవక్రియ

    జీవక్రియకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా మితిమీరిన రక్తంలోని ఫాట్, అధిక రక్త పీడనం, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు మరియు స్థూలకాయత్వం వంటి వాటిని నియంత్రిస్తుంది. నూతన పరిశోధనల వెల్లడి ప్రకారం రోజు ఒక ఔన్స్ అక్రోటుకాయలను 2 నుండి 3 నెలల పాటు తినటం వలన జీవక్రియ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.Image Courtesy:Getty Images

  • 8

    పిత్తాశయ రాళ్ళు

    'హావర్డ్' అనే బృందం ప్రచురించిన దాని ప్రకారం, ఎవరైతే వారం పాటూ 1 ఔన్స్ అక్రోటుకాయలను తినటం వలన వారిలో పిత్తాశంలో రాళ్ళు ఏర్పడటం 25 శాతం తగ్గుతుంది అని తెలిపారు. వారంలో కొన్ని అక్రోటుకాయలను తినటం వలన పిత్తాశంలో రాళ్ళు ఏర్పడటం నుండి రక్షణ పొందవచ్చు.Image Courtesy:Getty Images

  • 9

    బరువు తగ్గుదల

    సాధారణంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు విత్తనాలను తినరు కారణం-అందులో ఉండే క్యాలోరీలు, నూతన పరిశోధనల ప్రకారం వారంలో రెండు సార్లు విత్తనాలను తినటం వలన 31 శాతం వరకు బరువు పెరుగుదలను నియంత్రిస్తాయి అని తెలిపారు.Image Courtesy:Getty Images

  • 10

    క్యాన్సర్ నియంత్రణ

    అక్రోటుకాయలు 'ఫైటోన్యూట్రీఎంట్స్'లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తాయి. ఒక కప్పు అక్రోటుకాయలను తినటం వలన చాలా రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. Image Courtesy:Getty Images

    Tags:
  • వాల్నట్స్ ఉపయోగాలు
  • ఆక్రోటుకాయల ప్రయోజనాలు
  • ఔషదాల ప్రయోజనాలు
  • Benefits of Walnuts in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • v.L.NARAYANA14 Jul 2015
    Since 5 years i am using walnuts, it kept my body in good condition.

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ