Health Tips in HindiHealth Tips

బంతిపువ్వు వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 01, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బంతిపువ్వులను సాధారణంగా భారతదేశ సాంప్రదాయంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా, బంతిపువ్వుల వలన ఆరోగ్యానికి వివిధ రకాలుగా ప్రయోజనాలున్నాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ విశదీకరించబడింది.
  • 1

    బంతిపువ్వు

    ప్రకాశవంతమైన రంగును కలిగి ఉండే బంతిపువ్వు చెట్టు మరియు పువ్వుల గురించి సాధారణంగా అందరికి తెలిసిందే. అంతేకాకుండా, దీని వలన చాలా ఆరోగ్యకర ప్రయోజాలు కూడా ఉన్నాయి. దీని వలన మన ఆరోగ్యానికి కలిగే, మీకు తెలియని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.  Image Source : Getty Images

  • 2

    గాయాలను తగ్గిస్తుంది

    బంతిపువ్వు గాయాలను త్వరగా తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. బంతిపువ్వు నుండి సేకరించిన ఉత్పత్తులు చిన్న చిన్న గాయాలు, దెబ్బలు మరియు చర్మ చికాకు సమస్యల నుండి త్వరితంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. 'బ్రెజిల్'లో జరిపిన పరిశోధనల ప్రకారం, బంతిపువ్వు నూతన కణాల మరియు రక్తనాళాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కనుగొన్నారు. దీని వలన గాయాలను తగ్గించి, వాటి స్థానంలో నూతన కణాల పెరుగుదలను అధికం చేస్తుంది.   Image Source : Getty Images

  • 3

    క్యాన్సర్ నివారణ

    "జర్నల్స్ ఆఫ్ నుట్రీషియన్" వారు ప్రచురించిన దాని ప్రకారం, బంతిపువ్వు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ పెరుగుదలను ఆలస్యం లేదా నివారిస్తుంది. బంతిపువ్వులలో ఉండే 'ల్యూటీన్' అనే యాంటీ ఆక్సిడెంట్ లు రొమ్ము క్యాన్సర్ ను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి. ఇది క్యాన్సర్ కణాలను మాత్రమేకాకుండా, క్యాన్సర్ వ్యాధికి నూతన గురవకుండా కూడా చూస్తాయి.Image Source : Getty Images

  • 4

    అల్సర్ కు చికిత్స

    బంతిపువ్వుల నుండి తయారు చేయబడిన ఉత్పత్తులను నీటిలో కలుపుకొని తాగటం వలన నోటి అల్సర్ మరియు పొట్టలో కలిగే అల్సర్ లు తగ్గుతాయి. బంతిపువ్వుల నుండి తయారు చేయబడిన ఉత్పత్తులు అల్సర్ లను కలుగచేసే హానికర కారకాలను శరీరం నుండి భయటకు పంపిస్తాయి.Image Source : Getty Images

  • 5

    వ్యాధుల నివారణ

    బంతిపువ్వులలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసే విటమిన్ 'C' లను పుష్కలంగా కలిగి ఉంటాయి. బంతిపువ్వులు క్యాన్సర్ వ్యాధిని ఆలస్యం లేదా నివారించి, గుండె సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా తగ్గిస్తాయి.Image Source : Getty Images

  • 6

    ఆర్థరైటిస్

    బంతిపువ్వు కలిగి ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, కీళ్ళ నొప్పులను మరియు ఆర్థరైటిస్ వ్యాధిని తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. బంతిపువ్వు నుండి తయారు చేసిన నూనెలను కీళ్ళనొప్పులను మరియు ఆర్థరైటిస్ వంటి వాటిని తగ్గించుటకు సాధారణంగా వాడుతున్నారు.Image Source : Getty Images

  • 7

    యోని ఇన్ఫెక్షన్ లు

    బంతిపువ్వు రేకులను నీటిలో కలిపి వేడిచేసి ఈ మిశ్రమాన్ని స్నానం చేసే వేడి నీటిలో కలిపి స్నానం చేయండి. ఇలా చేయటం వలన యోనిలో కలిగే ఇన్ఫెక్షన్ లు మరియు మూత్రశయ ఇన్ఫెక్షన్ లను శక్తివంతంగా తగ్గిస్తుంది.  Image Source : Getty Images

  • 8

    జిడ్డు చర్మానికి చికిత్స

    బంతిపువ్వు వలన కలిగే మరొక ప్రయోజనం- జిడ్డు చర్మాన్ని శక్తివంతంగా తగ్గిస్తుంది. తాజా బంతిపువ్వు ఆకులను తీసుకొని, వేడి నీటిలో వేడి చేసి, ఈ మిశ్రమాన్ని రోజులో ఒకసారి ముఖ చర్మానికి అప్లై చేయండి. ఇలా 10 నుండి 15 నిమిషాల వరకు వేచి ఉండి తరువాత నీటితో కడిగి వేయటం వలన జిడ్డు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.  Image Source : Getty Images

    Tags:
  • బంతిపువ్వుల వలన కలిగే ప్రయోజనాలు
  • బంతిపువ్వుల వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు
  • Banthi puvvula valan kalige prayojanalu
  • benefits of marigold in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నిమ్మరస వాడకం వలన కలిగే ప్రయోజనాలు

    పురాతన కాలం నుండి నిమ్మరసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. విటమిన్ 'C' సిట్రిక్ ఆసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పెక్టిన్ వంటి
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నిమ్మరస వాడకం వలన కలిగే ప్రయోజనాలు

    పురాతన కాలం నుండి నిమ్మరసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. విటమిన్ 'C' సిట్రిక్ ఆసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పెక్టిన్ వంటి