Health Tips in HindiHealth Tips

కలబంద వలన చర్మానికి మరియు కలిగే ఇతర లాభాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కలబంద వలన అనేక ప్రయోజనాలు ఉన్నందు వలన దీనిని ఒక అద్భుత ఔషదంగా పేర్కొంటారు. దీనిని ఆహారాలలో మరియు ఎనర్జీ డ్రింక్స్ లలో విరివిగా వాడుతుంటారు. కలబంద చెట్టులోని ఒక్కో భాగం ఒక్కో ప్రయోజానాన్ని చేకూర్చి, శరీరంపై వివిధ రకాలుగా ప్రభావాలను చూపిస్తుంది.
  • 1

    విటమిన్ & మినరల్ లు అధికంగా ఉంటాయి

    కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. విటమిన్ 'A', 'C', 'E', 'B1', 'B2', 'B3', 'B6', ఫోలిక్ ఆసిడ్ మరియు కోలీన్ వంటి ముఖ్యమైన విటమిన్ లన్నిటిని కలిగి ఉంటుంది. విటమిన్ 'B12' కలిగి ఉండే కొన్ని చెట్లలో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది.

  • 2

    జీర్ణక్రియలో సహాయం

    కలబంద జీర్ణక్రియను పెంచుటలో సహాయపడుతుంది. భోజనానికి ముందు కలబంద రసాన్ని తాగటం వలన జీర్ణప్రక్రియ మెరుగ్గా జరిగి, ఆహార పదార్థాలను సులువుగా విచ్ఛిన్న పరుస్తుంది. అంతేకాకుండా, గ్యాస్, పొట్ట ఉబ్బినట్టుగా అనిపించటం, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆసిడ్ రిఫ్లేక్స్ మరియు ఇరిటబుల్ బోవేల్ సిండ్రోం లను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా దీనిని పేర్కొనవచ్చు.

  • 3

    త్వరగా పునరుద్దరణ

    వివధ గుణాలను కలిగి ఉండే కలబంద గాయాల నుండి త్వరగా కోలుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మచ్చలు, కాలిన గాయాలు మరియు చర్మ తెగుళ్ళను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా కలబందను పేర్కొనవచ్చు.

  • 4

    రక్షణ

    కలబంద ఒక ఆరోగ్యవంతమైన సహజ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు. ఇది సెల్యులార్ రీజెనరేటర్ గా పని చేయటమేకాకుండా, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడి శరీరాన్ని కాపాడుతుంది.

  • 5

    యాంటీ ఇన్ఫ్లమేటరీ

    కలబంద ఇన్ఫ్లమేషన్ ను నెమ్మదిపరిచే లేదా నివారించే ఫాటీ ఆసిడ్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. గాయాలు లేదా ఇతరేతర వాటి వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నెమ్మది పరచటం లేదా పూర్తిగా నివారిస్తుంది. Image source:Gettyimages.in

    Tags:
  • కలబంద రసం వలన కలిగే ప్రయోజనాలు
  • చర్మానికి కలబంద వలన కలిగే ప్రయోజనాలు
  • జీర్ణాశయానికి కలబంద వలన కలిగే ప్రయోజనాలు
  • Kalabanda valana kalige prayojanalu
  • Health Benfits of aloe vere in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు