Health Tips in HindiHealth Tips

ఆరోగ్యకరమైన జుట్టు: జుట్టు రాలుటను నియంత్రించే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 28, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పోషకాహార లోపాల వలన వెంట్రుకలు బలహీనంగా, పొలుసులుగా మారి జుట్టు తెగిపోతుంటుంది. ఫలితంగా కొత్తగా వచ్చే జుట్టు కూడా ఆగిపోతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
  • 1

    ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఆహారాలు

    మన శరీర మొత్తంలో, జుట్టు ప్రత్యేక పెరుగుదల చక్రాన్ని కలిగి ఉంటుంది. ఈ పెరుగుదల చక్రం నెమ్మదిగా మారటం వలన, మీ జుట్టు రాలే ప్రక్రియ అధికం అవుతుంది. పోషకాహ లోపం వలన వెంట్రుకలు బలహీనంగా, పొలుసులుగా మారి మరియు పెరుగుదల ప్రక్రియ నిలిచిపోయి, వెంట్రుకలు రాలే ప్రక్రియ అధికం అవుతుంది. కొన్ని రకాల ఆహారాల సేకరణ వలన పోషకాలు అందించబడి, జుట్టు ఆరోగ్యంగా, వాటి పెరుగుదల కొనసాగుతుంది.(Image source:Thinkstockphotos)

  • 2

    పాలకూర

    అధిక మొత్తంలో ఐరన్, విటమిన్ 'A', 'C' మరియు ప్రోటీన్ లను కలిగి ఉండే పాలకూర, ఐరన్ లోపాన్ని అరికడుతుంది. చాలా మందిలో జుట్టు రాలటానికి ముఖ్య కారణం- ఐరన్ లోపం. అంతేకాకుండా, పాలకూర సీబం వలే పని చేసి, సహజ కండిషనర్ లా పని చేస్తుంది. పాలకూరలో ఉండే, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి మూలకాలు జుట్టు మరియు తలపై చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.(Image source:Thinkstockphotos)

  • 3

    కాయధాన్యాలు

    ప్రోటీన్, ఐరన్, జింక్ మరియు బయోటిన్ లను కలిగి ఉండే కాయధాన్యాలను తినటం వలన జుట్టు రాలే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా, జుట్టు మరమ్మత్తులకు కావలసిన ఆక్సిజన్ ను అందించే ఎర్ర రక్తకణాల ఆరోగ్యానికి మరియు తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి అవసరమైన ఫోలిక ఆసిడ్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి.(Image source:Thinkstockphotos)

  • 4

    గుడ్లు & పాల ఉత్పత్తులు

    జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలిన ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, జింక్ మరియు ఒమేగా-6 ఫాటీ ఆసిడ్ వంటి ముఖ్య పోషకాలను గుడ్లు & పాల ఉత్పత్తులు ద్వారా పొందవచ్చు. పాల ఉత్పత్తులు వీటితో పాటూగా, బయోటిన్ (విటమిన్ B7) కలిగి ఉంటాయి, ఇవి జుట్టు రాలటాన్ని దాదాపు నియంత్రిస్తాయి.(Image source:Thinkstockphotos)

  • 5

    చికెన్

    జుట్టు బలహీనంగా మారి, తెగిపోయే ప్రక్రియను అరికట్టటానికి నాణ్యత గల ప్రోటీన్ లు అవసరం. ఈ నాణ్యత గల ప్రోటీన్ లను చికెన్ నుండి పొందవచ్చు. నిజానికి జుట్టు యొక్క మొదలు ప్రోటీన్ లతో తయారు చేయబడుతుంది. కావున వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ భోజనంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉండాల్సిందే.(Image source:Thinkstockphotos)

  • 6

    క్యారెట్ & చిలకడదుంప

    క్యారెట్ లతో పాటూగా, చిలకడదుంపను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోవటం వలన, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే విటమిన్ 'A' క్యారెట్ లలో పుష్కలంగా ఉంటాయి. చిలకడదుంపలో బీటా-కెరోటిన్, విటమిన్ 'A' లను పుష్కలంగా కలిగి ఉండి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  (Image source:Thinkstockphotos)

  • 7

    ఓట్స్

    ఓట్మీల్, కేవలం భోజనంలాగా మాత్రమే కాకుండా, రోజులో ఏ సమయంలోనైన తినవచ్చు. ఇవి జుట్టు రాలే ప్రక్రియను అరికడతాయి. ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-6 ఫాటీ ఆసిడ్ మరియు పాలీఅన్ సాచురేటేడ్ ఫాటీ ఆసిడ్ (PUFAs) వంటి ముఖ్య పోషకాలన్ని ఓట్స్ లో ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటమే కాకుండా, వెంట్రుకల మందాన్ని పెంచుతాయి.(Image source:Thinkstockphotos)

  • 8

    స్ట్రాబెర్రీ

    స్ట్రాబెర్రీ, సిలికాతో నిండిఉంటాయి, ఈ ఖనిజ పోషకం, బలమైన జుట్టు మరియు పొడవైన జుట్టు కోసం తప్పక అవసరం. ఈ మూలకాన్ని కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాలు- రైస్, ఓట్స్, క్యాబేజీ, దోసాకాయ మరియు క్యాలీఫ్లవర్. (Image source:Thinkstockphotos)

  • 9

    ఆక్రోటుకాయలు

    ఒక పిడికెడు ఆక్రోటుకాయలు, బయోటిన్, సంక్లిష్ట 'B' విటమిన్ ('B1', 'B6', మరియు 'B9'), విటమిన్ 'E' అధిక మొత్తంలో ప్రోటీన్ మరియు మెగ్నీషియంలను కలిగి ఉంటాయి. ఈ పోషకాలు వెంట్రుకలు రాలటాన్ని తగ్గించి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు మూలాలకు బలం చేకూర్చటానికి మరియు తలపై చర్మానికి పోషకాలను అందించటానికి ప్రతి రోజు కొన్ని ఆక్రోటుకాయలను తతినండి.(Image source:Thinkstockphotos)

  • 10

    యోఘర్ట్

    విటమిన్ 'B5', విటమిన్ 'D'లను యోఘర్ట్ పుష్కలంగా కలిగి ఉండి, జుట్టు ఫాలికిల్ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, యోఘర్ట్ నుండి తయారుచేసిన, మాస్క్ లను వాడండి.(Image source:Thinkstockphotos)

    Tags:
  • జుట్టు రాలటాన్ని తగ్గించే మార్గాలు
  • ఆరోగ్యకరమైన జుట్టు కోసం చిట్కాలు
  • జుట్టు రాలటాన్ని నియంత్రించే ఆహారాలు
  • Ways to Prevent Hair Loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ