Health Tips in HindiHealth Tips

మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Dec 31, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని ప్రభావిత పరుస్తాయి. ఈ అలవాట్లు తెలుసుకొని దూరంగా ఉండటం వలన మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • 1

    కిడ్నీ గురించి జాగ్రత్తలు తీసుకోండి

    మూత్రపిండాలు వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ అని చెప్పవచ్చు. లక్షణాలను గమనించే ముందే చాలా మందిలో 80 - 90 శాతం మూత్రపిండాలు నష్టం గురవుతాయి. మరోమాటలో చెప్పాలంటే, క్రానిక్ కిడ్నీ డిసిజేస్ (CKD) కలిగే వరకు ఎలాంటి లక్షణాలు బహిర్గతం అవవు. ఉబ్బిన మడిమలు, అలసట, ఆకలి లేకపోవటం, మూత్రంలో రక్తం మరియు నురగలతో కూడిన మూత్రం వంటివి CKD వ్యాధి బహిర్గత లక్షణాలుగా చెప్పవచ్చు. Image source: Getty Images

  • 2

    సిగరెట్

    సిగరెట్ మన ఊపిరితిత్తుకు, గుండె మరియు మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. సిగరెట్ తాగే అలవాటు వలన ఊపిరితిత్తుల కన్నా, మూత్రపిండాలు చాలా ప్రమదానికి గురయ్యే అవకాశం ఉంది. అధ్యయనాల ప్రకారం, మూత్రంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది కిడ్నీలు ప్రమాదానికి గురయ్యాయని ఒక చిహ్నంగా భావించవచ్చు. మధుమేహ వ్యాధి మరియు అధిక రక్తపోటు మూత్రపిండాలను ప్రమాదానికి గురి చేస్తాయి. సిగరెట్ అలవాటు కూడా ఇలాంటి ప్రమాదనికే గురి చేస్తాయి.Image source: Getty Images

  • 3

    అధికంగా చక్కెర

    అధిక చక్కెరలు గల ఆహార పదార్థాలు మూత్రపిండాలను ప్రమాదానికి గురి చేస్తాయి. అధిక చక్కెరలు గల వాటిని తినటం లేదా తాగటం వలన ఊబకాయం మరియు మధుమేహ వ్యాధి కలుగుతుంది ఈ రెండు పరిస్థితులు మూత్రపిండాలను ప్రమాదానికి గురి చేస్తాయి. కావున చక్కెరలను తక్కువగా తీసుకోవటం చాలా మంచిది. వీటితో పాటుగా సంవిధాన పరచిన చక్కెరలకు దూరంగా ఉండాలి. ఈ రకం చక్కెరలలో కెలోరీలు, రసాయనాలు మరియు సోడియం అధికంగా ఉంటాయి.  Image source: Getty Images

  • 4

    అధికంగా ఉప్పు

    సోడియం మూత్రపిండాలను చాలా రకాలుగా ప్రమాదాలను గురి చేస్తుంది. అధికంగా సోడియం గల ఆహార పదార్థాలు రక్తపోటును పెంచటంతో పాటూ, మూత్రపిండాలను కూడా ప్రమాదానికి గురి చేస్తుంది. తీసుకునే ఆహార పదార్థాలలో పరిమితంగా ఉప్పు తీసుకోవటం ద్వారా మూత్రపిండాల ప్రమాదాన్ని నివారించవచ్చు. అధికంగా ఉప్పు కలిగిన రెసిపీ వలన త్వరగా రక్తపోటు స్థాయిలు పెరిగి, మూత్రపిండాలు కూడా అదనంగా మూత్రపిండాల వ్యాధికి గురవుతాయి.  Image source: Getty Images

  • 5

    ప్రోటీన్ లను ఎక్కువగా తీసుకోవటం

    మూత్రపిండాల ముఖ్య విధి యూరియాను వడపోసి, (ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేయగా వచ్చిన మిశ్రమం) మూత్రం ద్వారా బయటకు పంపటం. ఆహారంలో ఉండే అదనపు ప్రోటీన్ లు మూత్రపిండాల పనితీరును ప్రభావితపరుస్తాయి. 2003 లో యురోపియన్ జర్నల్స్ ఆఫ్ న్యూట్రీషియన్ వారు జరిపిన అధ్యయనాల ప్రకారం, జంతు సంబంధిత ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉండే ఆహారాలను ఎక్కువగా తినటం వలన మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.Image source: Getty Images

    Tags:
  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు
  • కిడ్నీ ఆరోగ్యాన్ని నాశనం చేసే అలవాట్లు
  • Kidney arogyanni nashanam chese alavatlu
  • Habits That Destroy Your Kidneys in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని