Health Tips in HindiHealth Tips

పురుషులలో వక్షోజాలు కలిగేలా చేసే ఆహారాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 07, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంతమంది పురుషులు స్త్రీల లాగానే రొమ్మును కలిగి ఉంటారు. వీటికి గల కారణాలు మరియు కలిగేలా చేసే ఆహర పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గైనేకోమాస్టియా

    పురుషులు ఎక్కువగా పెద్ద పెద్ద కండలు మరియు విశాలమైన భుజస్కందాలు కలిగి ఉంటారు కానీ కొంత మంది పురుషులలో ఛాతి చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి వారి ఛాతి చూడటానికి అమ్మాయిల రొమ్ము లేదా వక్షోజాలు లేదా స్తనాలను వలే ఉంటాయి. వైద్యపరంగా దీనిని "గైనేకోమాస్టియా" గా పేర్కొంటారు, సాధారణంగా ఈస్ట్రోజెన్ అధిక స్థాయిలకు చేరటం వలన ఈ పరిస్థితి కలుగుతుంది. కానీ, ఈ హార్మోన్ స్థాయిలను పెంచే ఆహార పదార్థాలను తినటం వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. అవేంటో మీరే చూడండి.

  • 2

    చికెన్ సూప్

    ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా చికెన్ సూప్ థాలేట్స్ లను కలిగి ఉంటుంది. ఈ థాలేట్ లు ప్లాస్టిక్ సాఫ్ట్నర్స్  వలే ఉండి, ఈస్ట్రోజెన్ హార్మోన్ వలే పని చేస్తాయి. ఫలితంగా గైనేకోమాస్టియా కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. "ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్" వారు క్యాన్డ్ ఆహార పదార్థాలపై నూతన పరిశోధనలు జరిపి, చికెన్ సూప్, శిశువు సూత్రం, రావియోలీ, బీన్స్ మరియు ట్యూనా వంటి ఆహర పదార్థాలు అధిక మొత్తంలో థాలేట్స్ లను కలిగి ఉంటాయని తెలిపారు.

  • 3

    పెస్టిసైడ్ లను కలిగి ఉండే సముద్రపు ఆహారాలు

    మనం తినే ఆహార పదార్థాలలో అధిక మొత్తంలో పెస్టిసైడ్ కలవటం వలన కూడా గైనేకోమాస్టియా కలుగుతుంది. సగటున ఒక రోజు, ఒక వ్యక్తి ఆహార పదార్థాల ద్వారా 10 నుండి 13 రకాల పెస్టిసైడ్ లకు బహిర్గతం అవటం వలన అతడు/ఆమెలో ఉండే వినాళగ్రంధుల నుండి వెలువడే హార్మోన్ లు అసమతుల్యతలకు గురవుతాయి. రొయ్యలు మరియు చేపల వంటి సముద్రపు ఆహర పదార్థాలు అధిక మొత్తంలో పెస్టిసైడ్ లను కలిగి ఉండి, గైనేకోమాస్టియాకు గురి చేస్తాయి.

  • 4

    బెర్రీలు

    చాలా రకాల పండ్లు ముఖ్యంగా బెర్రీ వంటి తినదగిన పండ్లు ఈస్ట్రోజెన్ వలే ప్రవర్తించే పెస్టిసైడ్ లతో కలుషితం చెంది ఉంటాయి. కావున, స్ట్రాబెర్రీ, పీచెస్, ఆపిల్, చెర్రీ మరియు కాలే వంటి పండ్లు పురుషులలో వక్షోజాలు ఏర్పడేలా చేస్తాయి.

  • 5

    సూపర్ మార్కెట్లో లభించే మాంసం & చీస్

    సూపర్ మార్కెట్లలో మాంసం మరియు చీస్ లను పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) లతో తయారు చేసిన వ్రాప్ లేదా కవర్ లతో కప్పి ఉంచుతారు, ఇవి హార్మోన్ ల స్థాయిలలో తారతమ్యాలు కలిగిస్తాయి. కావున సూపర్ మార్కెట్లలో మాంసాన్ని కొనుగోలు చేయకుండా, తాజాగా లభించే మాంసపు మార్కట్లలో కొనండి.

  • 6

    ఫాటీ ఆహార పదార్థాలు

    అధిక మొత్తంలో కొవ్వు గల ఆహార పదార్థాలు, పెస్టిసైడ్ లతో కలుషితం చెందిన ఆహర పదార్థాలు, థాలేట్ లను కలిగి ఉండేవి సాధారణంగా పురుషులలో వక్షోజాలను కలిగించటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఆహార పదార్థాల వలన ఊబకాయంతో పాటూ పురుషులలో వక్షోజాలు కలగవచ్చు. Image source: Getty Images

    Tags:
  • పురుషులలో వక్షోజాలను కలిగించే ఆహారాలు
  • పురుషులలో స్తనాలు కలిగేలా చేసే ఆహారాలు
  • మగవారిలో రొమ్ము పెంచే కారణాలు
  • Purshulalo vakshojalu kalagataniki gala karanalu
  • Foods That Cause 'Man Boobs' in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ