Health Tips in HindiHealth Tips

జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 06, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ఆహార పదార్థాలను మీ ప్రణాళికలో కలుపుకొంటే, రంగు వేసుకోవలసిన అవసరమే ఉండదు.
  • 1

    ఆహార ఎంపికతో తెల్ల వెంట్రుకలకు దూరం

    ఆరోగ్యకరమైన ఆహార సేకరణ ద్వారా జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? అవును నిజం! కానీ ఇది ఒక సిద్ధాంతపరమైనది.విటమిన్ మరియు మినరల్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం వలన మీరు యవ్వనంగా కనపడతారు మరియు ఇవి వృద్దాప్యాన్ని ఆలస్యపరుస్తాయి.

  • 2

    పచ్చని ఆకుకూరలు

    పచ్చని ఆకుకూరలు తలపై చర్మం పునరుద్దపరిచే విటమిన్ 'B' లను కలిగి ఉంటాయి. సాధారణంగా, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి మరియు వెంట్రుక యొక్క అన్ని భాగాలకు రక్తం పంపిణి చేయటానికి తలపై చర్మానికి విటమిన్ 'B-6' మరియు విటమిన్ 'B-12' లు అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగులో ఉండటానికి విటమిన్ 'B-2' పై ఆధారపడి ఉంటుంది.

  • 3

    సూపర్ సాల్మన్

    ఎప్పటికైనా ఆరోగ్యక ఆహార పట్టికలో నిలిచే ఆహార పదార్థంగా సాల్మన్ చేపను పేర్కొనవచ్చు మరియు దీనిని జుట్టు నెరవకుండా ఆపే ఆహార పదార్థాల పట్టికలో కూడా కలపవచ్చు. వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్ లను స్రవించుటకు సాల్మన్ చేపలో ఉండే సెలీనియం తప్పక అవసరం. మీ జుట్టు నెరవటాన్ని ఆపుటకు వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్మన్ చేపను తినండి.

  • 4

    గుడ్లు

    మీ జుట్టు తెల్లగా మారటాన్ని ఆపాలంటే రోజు విటమిన్ 'B-12' తినండి. మీకు కావలసిన ఈ పోషకం గుడ్డులో లభిస్తుంది. నిజానికి ఫ్రీరాడికల్ లు మన వెంట్రుకలను తెల్ల రంగులోకి మారటాన్ని ప్రోత్సహిస్తాయి. కావున రోజు తినే ఆహార పదార్థాలలో ఒక గుడ్డును తినటం వలన జుట్టు తెల్లగా మారటాన్ని ఆలస్యపరచవచ్చు.

  • 5

    మాంసం మరియు కాలేయం

    యువకులలో జుట్టు తెల్లగా మారటానికి గల కారణం- అనీమియా మరియు ఐరన్ లోపం వలన అని చెప్పవచ్చు. ఈ రకమైన జుట్టు తెల్లబడటాన్ని నివారించుటకు మాంసం మరియు కాలేయాన్ని తినండి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తాయి. Image source:Gettyimages.in

    Tags:
  • జుట్టు నెరవటం
  • జుట్టు నెరవటాన్ని ఆపే ఆహారాలు
  • వెంట్రుకలు నల్ల రంగులో ఉంచే ఆహారాలు
  • Juttu neravatanni ape padarthalu
  • Foods that fight gray hair in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు