Health Tips in HindiHealth Tips

కిడ్నీ ఫెయిల్యూర్ గురైన వారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Apr 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంతమందిలో అనారోగ్యకర జీవనశైలిని అనుసరించటం వలన కిడ్నీ ఫెయిల్యూర్ కు గురవుతుంటారు. రీనల్ ఫెయిల్యూర్ కలిగి ఉన్న వారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. సోడియం, పోటాషియం వంటివి శరీరాన్ని ఎలా ప్రభావిత పరుస్తాయో తెలిసి ఉండాలి. కిడ్నీ ఫెయిల్యూర్ గురైన వారు దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    జంతు సంబంధిత ప్రోటీన్

    జంతు సంబంధిత ప్రోటీన్ లలో 'ప్యూరిన్'లు ఉంటాయి మరియు ఇవి మూత్రపిండాలలో 'యూరిక్ ఆసిడ్'గా మార్చబడతాయి. ఫలితంగా మూత్రం మరింత ఆమ్ల గాడతను సంతరించుకుంటుంది, దీని వలన మూత్రపిండాలలో స్ఫటికాలుగా ఏర్పడి, అవే రాళ్లుగా మారతాయి. యూరిక్ ఆసిడ్ స్ఫటికాలు కీళ్ళలో నిక్షిప్తం చెంది, ఆర్థరైటిస్ ను కలుగచేస్తాయి. "అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కిడ్నీ పెషంట్స్" వారు తెలిపిన దాని ప్రకారం, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు జంతు సంబంధిత ప్రోటీన్ లకు దూరంగా ఉండాలి. వృక్ష ఆధారిత ప్రోటీన్ లు క్షేమం అని తెలిపారు.

  • 2

    సోడియం అధికంగా గల ఆహారాలు

    శరీర రక్తపోటు లేదా రక్త పీడనాన్ని నిర్వహించుటలో మూత్రపిండాల విధిని సోడియం నేరిగా ప్రభావిత పరుస్తుంది. అధికంగా సోడియం తీసుకోవటం వలన అధిక రక్తపోటు కలగవచ్చు. కావున అధికంగా సోడియంను కలిగి ఉండే డబ్బాలో నిల్వ ఉంచిన ఆహారము, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఘనీభవించిన భోజనం, జున్ను ముక్కలు, ఉప్పు, మాంసాలు, ఊరగాయలు, కెచప్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

  • 3

    పొటాషియం అధికంగా గల ఆహారాలు

    మూత్రపిండాల సమస్యలతో సతమతం అయ్యే వారు పొటాషియం అధికంగా గల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పొటాషియంను తక్కువగా తీసుకోవాలంటే, పండ్లు మరియు కూరగాయలను కూడా తక్కువగా తీసుకోండి. పొటాషియం వలన 20 శాతం మూత్రపిండాల విధి తగ్గించబడుతుంది.

  • 4

    ఆక్సలేట్ అధికంగా గల ఆహారాలు

    ఆక్సలేట్ అధికంగా గల ఆహారాలను తక్కువగా తీసుకోవటం ద్వారా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు. కాఫీ, టీ, ద్రాక్ష, టోఫు, దుంపలు, పండ్లు, వేరుశెనగ, నారింజ, తీపి బంగాళదుంపలు, బీన్స్, చాక్లెట్, ముదురు ఆకుకూరలు మరియు డ్రాఫ్ట్ బీర్ వంటి వాటిలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది కావున వీటికి దూరంగా ఉండండి.

  • 5

    పాస్పరస్ లు ఎక్కువగా గల ఆహారాలు

    పాస్పరస్, కాల్షియం గ్రహించటాన్ని తగ్గించి, ఎలక్ట్రోలైట్ సంతులన నిర్వహణను ప్రమాదానికి గురి చేస్తుంది. కావున, శరీరానికి కావాల్సిన కాల్షియంను పొందుటకు గానూ, పాస్పరస్ తీసుకోటాన్ని తగ్గించండి. కాటేజ్ చీస్, పెరుగు, పాలు, సోయా చీస్ మరియు హార్డ్ చీస్ వంటి వాటిని పాస్పరస్ తక్కువగా గల వాటిని తీసుకోండి. Image source:Getty

    Tags:
  • కిడ్నీ సమస్యలున్న వారికి ఆహార ప్రణాళికలు
  • మూత్రపిండాల సమస్యలు ఉన్న వారు తినకూడనివి
  • Kidney Failure varu tinakudani aharalu
  • Foods to Avoid During Kidney Failure in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ