Health Tips in HindiHealth Tips

శరీరంలో పొటాషియం లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 09, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరంలో ముఖ్య విధుల నిర్వహణకు పొటాషియం తప్పని సరి. వీటి లోపం వలన మూత్రపిండాల, నాడీకండర సంబంధిత లోపాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన లక్షణాలు బహిర్గతమవుతాయి.
  • 1

    సాధారణ అలసట

    శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గినపుడు బహిర్గతమయ్యే సాధారణ లక్షణం- అలసట. మానవ శరీరంలోని ప్రతి కణం తన విధులను సరిగా నిర్వహించటానికి తక్కిన స్థాయిలో పొటాషియం అవసరం. తగిన సమయం పాటు విశ్రాంతి తీసుకోలేకపోవటం మరియు తరచుగా చెమట పట్టడం వంటివి లక్షణాలు పొటాషియం లోపం వలన అని చెప్పవచ్చు.

  • 2

    అధిక రక్తపీడనం

    మీ శరీరంలో తగిన స్థాయిలో పొటాషియం లేని ఎడల, సోడియం స్థాయిలు అధికమవటం వలన, రక్తనాళాల లోపలి వైపు కుంచించుకు పోవటం వలన రక్తపీడన స్థాయిలు లేదా రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు స్థాయిలు తగ్గించుకోటానికి గానూ, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినండి. పొటాషియం లోపం వలన శ్వాసలో తగ్గుదల మరియు దాహంగా అనిపిస్తుంది.

  • 3

    కళ్ళు తిరగటం

    పొటాషియం తగ్గినపుడు బహిర్గతమయ్యే మరొక లక్షణం- కళ్ళు తిరిగినట్టుగా లేదా మైకంగా అనిపించటం. తగిన సమయం పాటు నిద్ర మరియు విశ్రాంతి పొందినప్పటికీ తరుచుగా మైకానికి లేదా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. చిలకడదుంప, వైట్ బీన్స్, యొగ్ హార్ట్ వంటి ఆహార పదార్థాలు అధికంగా పొటాషియంను కలిగి ఉంటాయి.

  • 4

    కండరాల పనితీరులో లోపం

    శరీరంలో తగ్గిన పొటాషియం స్థాయిలు నేరుగా నాడీవ్యవస్థపై ప్రభావం చూపించి, కండరాల సంకోచాలలో సమస్యలను కలుగచేస్తాయి. అంతేకాకుండా, కండరాలకు రక్తప్రసరణ కూడా తగ్గిపోవటం వలన కండరాల ఫైబర్ విచ్చిన్నానికి గురవుతుంది. వీటన్నిటి ఫలితంగా, అలసట, కండరాల దృడత్వం తగ్గటం మరియు అపుడపుడు కీళ్ళలో నొప్పులు కలగవచ్చు.

  • 5

    జీర్ణాశయ సమస్యలు

    పొటాషియం మూలక లోపం వలన పేగు కదలికలలో లోపాలు ఏర్పడి, వివిధ రకాల పేగులలో పాక్షిక లేదా శాశ్వత అవరోదాలు, వాంతులు, పొట్టలో ఉబ్బరం మరియు ఉదర ప్రాంతంలో తిమ్మిరులు వంటి జీర్ణాశయ సమస్యలు కలుగుతాయి.  Image Courtesy: Getty Images

    Tags:
  • పొటాషియం లోపం
  • పొటాషియం లోప లక్షణాలు
  • హైపోకాలెమియా
  • Potassium lopa bahirgata lakshanalu
  • signs of low potassium deficiency in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ