Health Tips in HindiHealth Tips

చక్కెరను ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సాధారణంగా చక్కెరను స్వీట్ల తయారీలో వాడతారు. కానీ చక్కెర వలన కలిగే ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ వివరించబడింది.
  • 1

    పువ్వులను తాజాగా ఉంచుతుంది

    ఇంట్లో ఉండే పువ్వులను ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచాలనుకుంటున్నారా? అయితే 3 చెంచాల చక్కెర, 2 చెంచాల వైట్ వెనిగర్ ను నీటిలో కలిపి పువ్వులను ఈ ద్రావణంలో ఉంచండి. చక్కెర చెట్టు పువ్వు కాడలకు మంచిది మరియు వెనిగర్ బ్యాక్టీరియా సోకకుండా చేసి, పువ్వులను ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుతుంది.

  • 2

    గాయాలను తగ్గించుటకు

    కొన్ని పాత సామెతలు, ప్రతిపాదనలు నిజంగా పని చేస్తాయి. అవును, గాయాలను తగ్గించుటకు మరియు ఇన్ఫెక్షన్ లను తగ్గించుటలో చక్కెర కూడా పని చేస్తుంది. చిన్న చిన్న స్పటికాలుగా ఉండే చక్కెరను గాయాలపై చల్లటం వలన బ్యాక్టీరియాల పెరుగుదలను నివారించి, గాయాలను తగ్గిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

  • 3

    చేతి మరకలను తొలగించుటకు

    కారు లేదా బైక్ లేదా ఇతర సామాగ్రితో పని ఉండి, వాటిని వాడటం వలన మీ చేతులు పూర్తిగా దుమ్ము, జిడ్డుగా మారిపోతాయి. ఇలాంటి సమయంలో చేతులను సబ్బుతో కడిగిన ఈ జిడ్డు పోదు. కానీ ఈ సమయంలో చక్కెర సహాయపడుతుంది. అవును చక్కెర ఇలాంటి జిడ్డును పోగొడుతుంది. ఆలివ్ ఆయిల్ మరియు చక్కెర కలిపిన మిశ్రమాన్ని ఇలాంటి సమయంలో వినియోగించటం వలన మీ చేతులు శుభ్రంగా మారతాయి.

  • 4

    ఎక్సోఫోలేట్ గా పని చేస్తుంది

    చక్కెర చర్మాన్ని ఎక్సోఫోలేట్ గా కూడా వాడవచ్చు. ఇది శరీరంపై పొరలో ఉండే నిర్జీవ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా మరియు నునుపుగా మారుస్తుంది. బాదం లేదా ఆలివ్ నూనెలో చక్కెర కలపి చర్మంపై రాయండి. తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి.

  • 5

    పెదాలను మృదువుగా మారుస్తుంది

    మీ పెదాలు మృదువుగా, ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటున్నారా? చాలా సులభంగా పొందవచ్చు. సమాన మొత్తాలలో చక్కెర మరియు ఆలివ్ ఆయిల్ ను కలపండి. ఇపుడు ఈ పేస్ట్ ను మీ పెదాలకు పూసి, 30 నుండి 60 సెకన్ ల పాటూ ఉంచండి. తరువాత తడి గుడ్డతో తుడవండి.  Image source:Gettyimages.in

    Tags:
  • చక్కెర వలన కలిగే ఇతర లాభాలు
  • చక్కెరను వాడే వివిధ రకాలు
  • చక్కెర వలన కలిగే అద్భుత ప్రయోజనాలు
  • Chakkera valan kalige itara labhalu
  • Benefits of sugar in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ