Health Tips in HindiHealth Tips

కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహరాన్ని తినండి

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 03, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాల వలన ఆరోగ్యానికి హానికరం మరియు ఇతరేతర వ్యాధులు కలిగే అవకాశం ఉంది కావున ఇక్కడ తెలిపిన కొవ్వు పదార్థాలు లేని ఆహరాలను తినటానికి ప్రయత్నించండి.
  • 1

    తక్కువ కొవ్వు పదార్థాలను తినటం మంచిది

    సాధారణంగా మనం వింటూ ఉంటాము 'కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది'. ఇది నిజం అనుకోని అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఆహర పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. అధిక కొవ్వు పదార్థాల వలన జీర్ణ వ్యవస్థలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉన్న వాటిని ఉదాహరణకు వెజిటేబుల్ ఆయిల్ మరియు చేప వంటివి మంచివి, కానీ అధికంగా సాచురేటేడ్ ఫాట్ ఉన్న మరియు ట్రాన్స్ ఫాట్ ఉన్న ఆహర పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. Image Courtesy:Getty Images

  • 2

    గింజలు

    మంచి కొవ్వు పదార్థాలు కలిగి ఉన్న ఆహరం వలన శరీరంలో LDL స్థాయిలు తగ్గి HDL వంటి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఫైబర్, గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చే, ఫాట్, విటమిన్ 'E', పొటాషియం, ప్రోటీన్'లను అందించే గింజలను రోజు తినండి. వీటి వలన శరీరానికి కావలసిన పోషకాలు అందించబడతాయి.Image Courtesy:Getty Images

  • 3

    పండ్లు మరియు కూరగాయలు

    పండ్లు మరియు కూరగాయలు తక్కువ సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉంటాయి, వీటిని అధికంగా తినటం వలన శరీరంలో సాచురేటేడ్ ఫాట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇందులో పుష్కలమైన కొవ్వు పదార్థాలను తగ్గించే కరిగే ఫైబర్'లు ఉంటాయి. కావున రోజులో కేవలం ఒక్కసారైన తినటం చాల మంచిది. చిలగడ దుంప, బ్రోకలీ, ఆపిల్ మరియు స్త్రాబెరీలు ఎక్కువ మొత్తంలో కరిగే ఫైబర్'లను కలిగి ఉంటాయి.Image Courtesy:Getty Images

  • 4

    చీస్ మరియు క్రాకర్స్'కి దూరంగా ఉండండి

    శరీరంలో కొవ్వు స్థాయిలు తక్కువ స్థాయిలో ఉంచాలి అనుకుంటే చీస్ మరియు క్రాకర్స్'కి దూరంగా ఉండాలి. వీటిలో అధికంగా సాచురేటేడ్ ఫాట్ కలిగి ఉంటాయి మరియు ఆరోగ్యానికి హని కలుగచేసే అవకాశం ఉంది. Image Courtesy:Getty Images

  • 5

    నిమ్మకాయ రసం మరియు సలాడ్

    కొన్ని రకాల ఫ్రూట్ సలాడ్స్'లలో అధిక కొవ్వు పదార్థాలతో డ్రెస్సింగ్ చేయబడి ఉండి, శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. కావున మీ శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించుకోటానికి సలాడ్'లో నిమ్మరసం కలుపుకొని సేకరించటం చాలా మంచిది. Image Courtesy:Getty Images

  • 6

    వెన్నకి దూరంగా ఉండండి

    వెన్న పుష్కలమైన కోవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది, దీనికి బదులుగా వెజిటేబుల్ ఆయిల్ వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయటం వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి, మంచి పదార్థాల స్థాయిలు పెరుగుతాయి.Image Courtesy:Getty Images

  • 7

    పాప్కార్న్

    బంగాళదుంపతో చేసిన స్నాక్స్'కి దూరంగా ఉండండి. సాయంత్రం సమయంలో మంచి స్నాక్స్'గా పాప్కార్న్ తినటం చాలా మంచిది. ఇంట్లో తయారు చేసుకునే పాప్కార్న్'లో తక్కువ సాచురేటేడ్ ఫాట్'లను మరియు అధిక ఫైబర్'లను కలిగి ఉండి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.  Image Courtesy:Getty Images

  • 8

    బార్లీ మరియు ఓట్స్

    బార్లీ మరియు ఓట్స్'లు అధిక మొత్తంలో కరిగే ఫైబర్'లను కలిగి ఉంటాయి వీటిని బీటా గ్లూకాన్ అంటారు. ఇవి కొవ్వు పదార్థాల విషయంలో అద్బుతంగా పనిచేస్తాయి. బీటా గ్లూకాన్'లు జీర్ణ వ్యవస్థలో కొవ్వు పదార్థాలతో అనుసందించబడి శరీరంలోకి గ్రహించటాన్ని నిలిపివేస్తాయి. Image Courtesy:Getty Images

  • 9

    సోయా

    అందరికి తెలిసిన విషయం సోయా తక్కువగా సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉంటుంది, కావున ఇవి శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు నిర్వహించటంలో సహాయపడతాయి. ఇందులో ఉండే మూలకాలు శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాల స్థాయిలను గుర్తుపట్టే గుణాలను కలిగి ఉంటాయి. చాలా రకాల సోయాతో చేసిన ఆహర పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సోయా పాలు, సోయా బోజనాలు, సోయా మీట్ మరియు సోయా నట్స్ మరియు టోఫూ వంటి చాలా రకాల ఆహర పదార్థాల రకాలు అందుబాటులో ఉన్నాయి. Image Courtesy:Getty Images

  • 10

    చేప

    మీరు తీసుకునే ఆహారంలో చేపలను కలపటం వలన మీ శరీర కొవ్వు స్థాయిలను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచిన వారు అవుతారు. సాల్మన్, సార్దిన్, మాకేరాల్, ట్రౌట్ వంటి పలు రకాల చేపలు అధిక మొత్తంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉంటాయి. ఇవి కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి. Image Courtesy:Getty Images

    Tags:
  • కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు
  • ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు
  • ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం పాటించాల్సిన నియమాలు
  • Lower cholesterol food in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన