Health Tips in HindiHealth Tips

కిడ్నీ స్టోన్స్ యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Oct 19, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మూత్రపిండాలలో రాళ్లు చాలా నొప్పిగా మరియు అసౌకర్యాలకు గురి చేస్తాయి, అంతేకాకుండా వీటి ప్రారంభ సంకేతాలను తెలుసుకోవటం వలన ముందుగానే పసిగట్టి చికిత్స అందించవచ్చు. అవేంటో మీరే చూడండి.
  • 1

    మూత్రపిండాలలో రాళ్లు

    మూత్రపిండాలలో లేదా మూత్ర మూత్ర మార్గంలో మినరల్ లు స్ఫటికాకారంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల రాళ్లుగా పేర్కొంటారు. మూత్ర పరిమాణం తగ్గటం లేదా అధిక మొత్తంలో లవణాలు స్పటికాలుగా మారటం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ వలన మూత్రంలో రక్తం రావటం మరియు ఉదర భాగంలో నొప్పి లేదా వెన్నుభాగంలో నొప్పి కలుగుతుంది. వీటిలో కొన్ని ప్రారంభ సంకేతాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image source: Getty Images

  • 2

    తరచుగా మూత్రం & నొప్పితో కూడిన మూత్ర విసర్జన

    ఉన్నట్టుండి తరచుగా మూత్ర విసర్జన చేయటం అనేది కిడ్నీ స్టోన్స్ యొక్క సంకేతం. ఇలా తరచుగా చేసే మూత్ర విసర్జనతో పాటుగా విసర్జన సమయంలో నొప్పి కానీ కలిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలిసి, మూత్ర పిండాలలో రాళ్లను గుర్తించే పరీక్ష చేపించుకోండి. రాళ్లు మూత్ర మార్గం నుండి మూత్రాశయంలోకి ప్రవేశించేపుడు, తరచుగా మూత్ర విసర్జనతో పాటూ నొప్పిని కూడా కలిగిస్తాయి. Image source: Getty Images

  • 3

    వెన్నుభాగంలో నొప్పి

    మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయని తెలిపే అత్యంత సాధారణ లక్షణం- వెన్నుభాగంలో నొప్పి. ఈ నొప్పి అకస్మాత్తుగా మరియు చాలా తీవ్రంగా కలుగుతుంది మరియు అపుడపుడు ఉదరభాగంలో నొప్పి కూడా కలగవచ్చు. ఒకవేళ మీరు అకస్మాత్తుగా, వెన్నుభాగంలో లేదా ఉదర భాగంలో నొప్పికి గురైతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవండి. Image source: Getty Images

  • 4

    మూత్రంలో రక్తం

    మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయని తెలిపే మరొక సంకేతం- మూత్రంలో రక్తం. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన వారు పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో మూత్ర విసర్జన జరుపుతారు. ఇలా కిడ్నీ స్టోన్స్ అభివృద్ధి చెందటం వలన మూత్రంలో రక్తం విసర్జించబడుతుంది. కావున మూత్రం రంగు మారగానే వైద్యుడిని కలవండి. Image source: Getty Images

  • 5

    కూర్చోవటంలో సమస్యలు

    కొన్నిసార్లు, కిడ్నీ స్టోన్స్ పరిమాణం చాలా పెద్దగా మారతాయి, ఫలితంగా ఆ వ్యక్తి కూర్చోటానికి కూడా ఇబ్బందిగా భావిస్తుంటాడు. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడిన వ్యక్తి కూర్చోటానికి ఇబ్బందిగా భావిస్తూ, నిలబడటానికి ప్రాముఖ్యత చూపిస్తుంటాడు. Image source: Getty Images

  • 6

    వాపులు

    మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లు వాటి పరిమాణం పెరిగిన కొలది వాపులకు మరియు చాలా నొప్పికి గురవుతుంటాడు. ఉదర భాగంలో లేదా వెన్నుముక కింది భాగంలో వాపు లేదా ఇన్ఫ్లమేషన్ కలిగితే వెంటనే వైద్యుడిని కలవండి. Image source: Getty Images

    Tags:
  • మూత్రపిండాలలో రాళ్లు
  • కిడ్నీ స్టోన్స్ ముందస్తు హెచ్చరిక
  • కిడ్నీ స్టోన్స్ ప్రారంభ సంకేతాలు
  • Kidney Stones prarambha sanketalu
  • Early Warning Signs of Kidney Stones in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త