Health Tips in HindiHealth Tips

పురుషులలో కేన్సర్ వ్యాధి యొక్క ప్రారంభ సంకేతాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Sep 12, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పురుషులు వైద్య పరీక్షలకు ఎక్కువ శాతం దూరంగా ఉంటారు. కానీ కొన్ని ప్రాణాంతకర వ్యాధులు ప్రారంభ సంకేతాలకు బహిర్గతపరుస్తుంటాయి, కావున ఎలాంటి చిన్న మార్పు గమనించిన వైద్యుడిని తప్పక కలవండి.
  • 1

    జాగ్రత్త

    పురుషులు కేన్సర్ వ్యాధి ప్రారంభ సంకేతాల పట్ల అవగాహన కలిగి ఉండటం వలన ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ ప్రారంభ సంకేతాలను గమనించిన వెంటనే వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన మొదట్లోనే వ్యాధిని తగ్గించవచ్చు. కొన్ని సంకేతాలు నేరుగా కేన్సర్ వ్యాధి కలిగిందని తెలుపుతాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. వీటిని గమనించిన వెంటనే వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

  • 2

    రొమ్ము కేన్సర్

    సాధారణంగా రొమ్ము కేన్సర్ లేదా బ్రెస్ట్ కేన్సర్ పేరు వినగానే స్త్రీలలో మాత్రమే కలుగుతుందని చాలా మంది పురుషులు ఆలోచిస్తుంటారు. కానీ, పురుషులలో సాధారణం కాకపోయినప్పటికీ, ఖచ్చితంగా రాలేదు అని మాత్రం చెప్పలేము. రొమ్ము ప్రాంతంలో చర్మ రంగు మారటం, చనుమొనల నుండి ద్రవాలు రావటం, చనుమొనల నుండి లాగటం లేదా చనుమొనలు ఎర్రగా మారటం వంటివి పురుషులలో కలిగే రొమ్ము కేన్సర్ యొక్క ప్రారంభ బహిర్గత లక్షణాలు చెప్పవచ్చు.

  • 3

    లింఫ్ నోడ్స్ లో మార్పులు

    లింఫ్ నోడ్స్ లో మార్పులు గమనించిన వెంటనే మీరు సమస్యలు పెరగటం గమనిస్తారు. బహుమూలాలో ముద్దలా ఏర్పడటం లేదా వాపుకు గురవటం లేదా మెడను ఎడమ వైపుకు తిప్పటానికి వీలు లేకుండా ఉంటుంది.

  • 4

    జ్వరం

    కారణం లేకుండా జ్వరం రావటం అనేది కేన్సర్ వ్యాధికి సూచిక. ఇతర సాధారణ ఆరోగ్య రుగ్మతల వలన కూడా జ్వరం వస్తుంది. కానీ, తీవ్రమైన జ్వరం దీఘకాలిక సమయం పాటూ ఉండే మాత్రం వంటనే వైద్యుడిని కలవటం మంచిది. వైద్యుడి తగిన పరీక్షలు నిర్వహించి, జ్వరానికి గల కారణం గురించి వివరిస్తాడు.

  • 5

    అలసట

    అలసట అనేది కేన్సర్ వ్యాధి యొక్క సందిగ్ద లక్షణంగా పేర్కొనవచ్చు ఎందుకంటే కేన్సర్ వలన అలసట కలుగుతుంది కానీ, అలసట కలిగిన ప్రతిసారీ కేన్సర్ కారణం కాదు. కానీ, అలసట కలిగినపుడు అశ్రద్ద చేయకుండా చెక్ చేపించుకోవటం మంచిది. పురీషనాళ లేదా స్టమక్ లేదా ల్యూకేమియా కేన్సర్ వ్యాధి యొక్క బహిర్గత లక్షణం.

  • 6

    మింగటానికి ఇబ్బందిగా అవటం

    కొంత మంది ద్రావణాలను తాగేపడు మింగటానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఈ ఇబ్బంది చాలా రోజుల పాటూ ఉండే అది జీర్ణాశయాంతర కేన్సర్ కావచ్చు, కేన్సర్ అన్నవాహిక వరకి విస్తరించటం వలన ఈ సమస్య కలగవచ్చు.   Image source:Gettyimages.in

    Tags:
  • పురుషులలో కేన్సర్ ప్రారంభ సంకేతాలు
  • కేన్సర్ బహిర్గత లక్షణాలు
  • కేన్సర్ కలిగిముందు బాహిర్గతమయ్యే లక్షణాలు
  • Purushulalo Cancer Prarambha lakshanalu
  • Early Signs of Cancer in Men
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ