Health Tips in HindiHealth Tips

అబార్షన్ అవటానికి కారణమయ్యే ప్రమాదకర వ్యాధులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 10, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కారణం ఏదైనా ప్రస్తుతకాలంలో అబార్షన్ లేదా గర్భస్రావం చాలా సాధారణమైంది. అబార్షన్ కలగటానికి గల ముఖ్యమైన కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అబార్షన్ లేదా గర్భస్రావం

    గర్భవతులలో, సిగరెట్ తాగే అలవాట్ల వంటి జీవనశైలి కారకాలు, వాతావరణ సంబంధిత విషపూరిత కారకాలు, మందుల వాడకం మరియు మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ సేకరణ వంటివి అబార్షన్ లేదా గర్భస్రావానికి కారణమవుతాయి. వీటితో పాటుగా గర్భ సమయంలో ఎవైన ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ ల సమస్యలు మరియు ఇతర వ్యదుకు కలిగి ఉంటే కూడా అబార్షన్ అవటానికి ఆస్కారం ఉంది. అవేంటో మీరే చూడండి.

  • 2

    PCOS

    పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS) కలిగిన మహిళలలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు అధికంగా ఉండటం వలన క్రమరహిత రుతుక్రమం,  అబార్షన్ కు కారణమవుతుంది. అంతేకాకుండా పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకతను కూడా కలుగచేస్తుంది. దీని వలన ఎండోమెట్రియల్ లైనింగ్ పెరుగుదలను నివారించి, ఇంప్లాంటేషన్ జరగకుండాపోతుంది.

  • 3

    హైపర్ థైరాయిడిజం

    థైరాయిడ్ హార్మోన్ కణాల విధులు నియంత్రిస్తుందని మరియు అసాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు గర్భాన్ని ప్రభావితపరుస్తాయని దాదాపు చాలా మందికి తెలియదు. ఒకవేళ దీనికి తగిన చికిత్స అందించని ఎడల, అది అబార్షన్ కు దారి తీయవచ్చు. అంతేకాకుండా, శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గిన పరిస్థితులు అండోత్సర్గాన్ని ప్రభావిత పరుస్తాయి మరియు సంతాన ప్రాప్తి లేకుండుట మరియు గర్భస్రావానికి కారణం అవుతాయి.

  • 4

    క్రోమోసోమ్ల్ ల అసాధారణతలు

    పిండంలో జరిగే క్రోమోసోల్ ల అసాధారణతల కారణంగా 50 శాతం ఆలస్యపు గర్భస్రావాలు లేదా అబార్షన్ లు జరుగుతున్నాయి. పిండంలోని అసాధారణతల కారణంగా శిశువు పెరుగుదల లోపాలకు గురై, గర్భస్రావానికి గురవుతున్నారు. ఈ రకం సమస్యలు అధికంగా 30 సంవత్సరాల తరువాత మరియు 40 సంవత్సరాల వయసు లోపు గల గర్భం దాల్చిన మహిళలలో గమనించవచ్చు.

  • 5

    తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు

    అవును, అనియంత్రిత మధుమేహ వ్యాధి లేదా అధిక రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు అబార్షన్ కు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితులు కలిగిన మహిళకు గర్భవతులు అవాలంటే, ఈ పరిణామాలను తగ్గించే మందులు వాడుతూ, నిత్యం వైద్యురాలిని (గైనకాలజిస్ట్) కలవాలి.

  • 6

    స్వయం ప్రతిరక్షక వ్యాధి (ఆటోఇమ్యూన్ వ్యాధి)

    ఇది చాలా అరుదు, అయినప్పటికీ, ఈ రకం వ్యాధుల వలన కూడా అబార్షన్ జరగవచ్చు. ఎందుకంటే, తల్లి శరీరంలోని కణాలు, గర్భాశయంలోని పిండాన్ని బయటి కారకం లేదా హానికర కారకంగా భావించి, పిండానికి వ్యతిరేఖంగా యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా, అబార్షన్ కు లోనవుతుంది. Image source: Getty Images

    Tags:
  • అబార్షన్ కు గల కారణాలు
  • మహిళలలో గర్భస్రావానికి గల కారణాలు
  • అబార్షన్ ను ప్రేరేపించే వ్యాధులు
  • అబార్షన్ కలిగేలా చేసే కారణాలు
  • Abortion kalagataniki gala karanalu
  • Diseases that can up Abortion risk in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త