Health Tips in HindiHealth Tips

మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 26, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ పేర్కొన్న ఆహరాల సేకరణ వలన వేగంగా మీ సున్నితమైన చర్మాన్ని తప్పక పొందుతారు
  • 1

    మృదువైన చర్మం

    ఎవరైన ‘ఆరోగ్యం’ ముఖ్యమైనదిగా భావించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, దీని కన్నా చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా కనపడటానికి ఎక్కువగా ఇష్టపడతారు అవునా! కొన్ని రకాల ఆహార పదార్ధాలను తీసుకోవటం వలన చర్మం ఆరోగ్యంగా మరియు మృదువుగా కనపడేలా చేస్తాయి. ఈ ఆహార పదార్థాలు మీరు తినే ఆహారంలో ఉండోచ్చు. మీ ఆహారంలో లేకపోతే మార్కెట్ మరియు సాధారణ దుకాణాలలో కూడా లభిస్తాయి.   Image Courtesy:Getty Images

  • 2

    అవకాడో

    అవకాడో, అందాన్ని పెంపొందించే ఫలము, దీన్ని ఆహారంలో తీసుకోవటం వలన మీ చర్మాన్ని కాపాడటమే కాకుండా, జుట్టుని మరియు చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇది కణాలకు సహజమైన ఆయిల్'ని అందించుటలో సహాయపడతాయి. రెండు అవకాడో లను దంచి జుట్టుకి చర్మానికి అప్లై చేయాలి. అవకాడోలో ఉండే విటమిన్ ‘A’ జుట్టుకి మెరుపుని ఇస్తుంది, విటమిన్ ‘B’ ఆయిల్ ఉత్పత్తిని సమన్వయపరిచి, మీ చర్మం మరియు జుట్టు ఎక్కువగా ఆయిల్ లేదా పొడిగా ఉన్నపుడు సమన్వయ పరుస్తుంది, విటమిన్ ‘E’ సూర్యుడి మరియు కాలుష్యం వల్ల వచ్చే నష్టాలను తగ్గిస్తాయి.    Image Courtesy:Getty Images

  • 3

    టమాట

    టమాటలో శక్తి వంతమైన యాంటీ-ఆక్సిడెంట్'లు అయినట్టి 'లైకోపీన్'ను ఎక్కువగా కలిగి ఉంటాయి, ఇవి సూర్యకాంతి నుండి వచ్చే చర్మానికి హానికలిగించే UV కిరనాల నుండి చర్మాన్ని కాపాడతాయి. సూర్యకాంతి వలన చర్మం పైన వచ్చే ముడతలను, మరియు వేడిని తొలగిస్తాయి. కావున రోజు మీరు తీసుకునే ఆహారంలో 16 మిల్లిగ్రాముల లైకోపిన్, అనగా మీ ఆహారంలో టమాటలు ఉండేలా చూసుకోండి.   Image Courtesy:Getty Images

  • 4

    కోకో పొడి

    ఇందులో 'క్లావోనల్స్' అనే యాంటీ-ఆక్సిడెంట్'లు ఉండటం వలన ఇవి చర్మం యొక్క గరుకుతనాన్ని పోగోట్టటమే కాకుండా, సూర్య కాంతి వల్ల వచ్చే నష్టాల నుండి కాపాడుతుంది. కోకో పొడిని రోజు వాడటం వలన మీ చర్మాన్ని మృదువుగాను మరియు తేమని అందిస్తాయి. మంచి కోకో పొడిని వాడటం వలన అది రక్తప్రసరణ పెంచి, చర్మానికి ఆక్సిజన్ ఎక్కువగా అందించి UV కిరణాల వల్ల వచ్చే నష్టాలను తగ్గిస్తాయి. Image Courtesy:Getty Images

  • 5

    సన్ ఫ్లవర్ ఆయిల్

    పొద్దు తిరుగుడు పువ్వుల నుండి తీసిన ఆయిల్'ని కొన్ని రకాలైన కాస్మెటిక్'ల తయారీలలో వాడతారు. కణానికి కావలసిన పదార్థాల రవాణ మరియు వాటికి నీటిని సులభంగా కణత్వచం గూండా రవాణా అయేలా చూసే ఒమేగా-6 అనే ఫాటీ ఆసిడ్'లను ఇవి కలిగి ఉంటాయి. ఈ ఆయిల్ వలన కలిగే  ప్రయోజననాల పైన పరిశోధనలు జరిపి, ఇది సులభంగా వచ్చే పొడి చర్మం, మొటిమలు, ఇన్ఫ్ల-మేషన్, మరియు చర్మ వ్యాధులు రాకుండా సహాయపడుతుందని వెల్లడించారు.      Image Courtesy:Getty Images

  • 6

    పాలకూర

    పాలకూర ఉండే సహజ సిద్ధమైన యాంటీ-ఆక్సిడెంట్'లు వయసు మీరిన కొలది శరీరంలో జరిగే  మార్పులను నెమ్మది చేస్తుంది. మొటిమలు రాకుండా ఉపయోగపడే పోషకాలు మరియు విటమిన్'లను కలిగి ఉంది. పాలకూరలో ఎక్కువగా విటమిన్ ‘A’, ‘C’, ‘E’ మరియు ‘K’ లు ఉంటాయి. కావున మీ ఆహరంలో పాలకూర తప్పకుండా వాడండి. Image Courtesy:Getty Images

  • 7

    ఫ్లాక్స్ సీడ్స్

    చర్మ కణాలలో ఏ కారణం చేతనైన అడ్డంకులు ఏర్పడితే, వివిధ రకాల ఇన్ఫెక్షన్'లు, మొటిమలు, నల్లటి మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలను ఏర్పరుస్తాయి. ఈ విత్తనాలు చర్మ కణాలను శుభ్రపరిచి, మచ్చలను తొలగించే ఒమేగా-3 అనే ఫాటీ ఆసిడ్స్ ని కలిగి ఉంటాయి. ఎవరైతే 6 వారాల పాటూ రోజుకి మూడు చెంచాల ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'ని తీసుకుంటారో , వారిలో చర్మం పైన వచ్చే మంటలు, ఏరుపుధనం. వంటి ప్రభావాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన ఆహారంలో ఫ్లాక్స్ విత్తనాలను కూడా తీసుకోవటం వలన చర్మంలో మార్పులు వస్తాయి. Image Courtesy:Getty Images

  • 8

    బాదం

    చర్మాముఖ్యంగానికి  కావలసిన యాంటీ-ఆక్సిడెంట్'లు, విటమిన్ ‘E’ బాదంలో పుష్కలంగా ఉంటాయి. స్నాక్స్'గా బాదంలను తీసుకోవటము లేదా సలాడ్'కి బాదం రుచిని కలిపి తీసుకోవచ్చు. తృణ ధాన్యాలు మరియు బాదంలు, శరీరంలోని విష పదార్థాలను, ఫ్రీ-రాడికల్'లని బయటకి పంపిస్తాయి. బాదము మరియు వివిధ రకాలైన విత్తనాలు ఎక్కువ క్యాలోరీలను కలిగి ఉంటాయి. Image Courtesy:Getty Images

    Tags:
  • మృదువైన చర్మం రహాస్యం
  • అందంగా కనపడటానికి తీసుకోవలసిన ఆహారం
  • For healthy skin
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

    కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ ప
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

    అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

    కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ ప
  • పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

    అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్