Health Tips in HindiHealth Tips

పోషకాల లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 01, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

విటమిన్, మినరల్స్, మూలకాలు అన్ని శరీరానికి అవసరం వీటి లోపాల వలన ఆరోగ్యానికి చాలా రకాల వ్యాధులు కలుగుతాయి, పోషకాల లోపం వలన కలిగే సమస్యలు మరియు ఆవశ్యకత గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    పోషకాల లోపం వలన కలిగే నష్టాలు

    శరీరానికి కావలసినంత మొత్తంలో పోషకాలను అందించకపోవటం వలన, పోషకాహార లోపం లేదా పోషకాల లోపం కలుగుతుంది. శరీరంలో పోషకాల లోపం వలన వివిధ రకాల సమస్యలు బహిర్గతమవుతాయి. ముఖ్యంగా ఎముకల పెరుగుదలలో లోపాలు, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, జ్ఞాపక శక్తి లోపాలు కలుగుతాయి.Image Courtesy:Getty Images

  • 2

    అలసట

    ప్రోటీన్-ఎనేర్జీ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ 'B1', 'B2', 'B12' మరియు ఇతర విటమిన్ 'B' మూలకాలు మరియు విటమిన్ 'C' వంటి పోషకాల లోపం వలన అలసట కలుగుతుంది. అలసట కలుగుటకు ఇతర కారణాలు-'హిపోథైరాయిడిసం', 'అనీమియా', 'మధుమేహం' మరియు 'డిప్రెషన్' అని చెప్పవచ్చు.Image Courtesy:Getty Images

  • 3

    మలబద్ధకం మరియు డీహైడ్రేషన్

    మీరు తినే ఆహరంలో 'ఫైబర్', 'పొటాషియం', 'మెగ్నీషియం' మరియు 'ఫోలేట్' వంటి పోషకాల లోపం వలన మధుమేహం లేదా డీహైడ్రేషన్ కలుగవచ్చు. అంతేకాకుండా, వైద్యపరమైన సమస్యలు అయినట్టి 'బోవేల్ సిండ్రోం చిరాకులు', 'శోధరహిత అల్ప కోశము (వేర్టిక్యులాసిస్) మరియు 'పురీషనాల క్యాన్సర్' వంటివి కూడా మలబద్ధకం మరియు డీహైడ్రేషన్'లను కలుగచేస్తాయి. Image Courtesy:Getty Images

  • 4

    డిప్రెషన్

    డిప్రెషన్ కలుగుటకు ముఖ్య కారణంగా పోషకాహార లోపంగా కూడా చెప్పవచ్చు. మెదడులో విటమిన్ రిసెప్టార్'లు భావోద్వేగాలతో కూడిన ప్రవర్తనను వ్యక్తపరిచేలా ప్రోత్సహిస్తాయి. విటమిన్ 'C', 'B1', 'B3', 'B6', 'B12', 'ఫోలేట్ బయోటిన్' మరియు శరీరానికి కావాల్సిన ఫాటీ ఆసిడ్'ల లోపాల వలన డిప్రషన్ కలుగుతుంది.Image Courtesy:Getty Images

  • 5

    బలహీన ఎముకలు

    మీరు బలహీన ఎముకలు కలిగి ఉన్నారా, అయితే మీరు విటమిన్ 'D' లోపంతో భాధపడుతున్నారు అని అర్థం. పోషకాలు శరీరంలోని కాల్షియం స్థాయిలను నిర్వర్తించి ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. ఎముకలను బలంగా చేస్తూ, విటమిన్ 'D' కండరాల కదలికలకు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. Image Courtesy:Getty Images

  • 6

    పొడి చర్మం

    శరీరానికి కావలసిన ఫాటీ ఆసిడ్ లోపాల వలన లేదా వివిధ పోషకాల లోపాల వలన మీ చర్మం పొడిగా మారుతుంది. అంతేకాకుండా, తామార వంటి చర్మ వ్యాధుల వలన చర్మం పొడిగా మారే అవకాశం ఉంది.Image Courtesy:Getty Images

  • 7

    తెలుపు లేదా నిర్జీవ గోళ్ళు

    తెల్లటి లేదా నిర్జీవ గోళ్ళు మరియు మీ గోళ్ళ పైన తెల్లటి మచ్చలు ఉన్నట్లయితే మెగ్నీషియం లోపం వలన అని అర్థం. జింక్ మరియు మెగ్నీషియం లోపం వలన గోళ్ళు మృదువుగా మరియు నిర్జీవంగా మారతాయి.Image Courtesy:Getty Images

  • 8

    కండరాల నొప్పులు మరియు తిమ్మిరులు

    మినరల్ మరియు విటమిన్'ల లోపం వలన కండరాలలో నొప్పులు మరియు తిమ్మిరులు కలుగుతాయి. మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ 'B1' మరియు విటమిన్ 'D' లోపం వలన కండరాలలో నొప్పులు మరియు తిమ్మిరులు కలుగుతాయిImage Courtesy:Getty Images

  • 9

    గాయిటర్

    గాయిటర్, మెడ ఉబ్బటం, ఇది అయోడిన్ లోపం వలన కలుగుతుంది. అంతేకాకుండా, థైరాయిడ్ గ్రంధి సమస్యలు, గర్భం వలన కూడా గాయిటర్ వ్యాధి కలుగుతుంది.Image Courtesy:Getty Images

  • 10

    రాత్రి సమయంలో దృష్టి లోపాలు

    జింక్, విటమిన్ 'D', విటమిన్ 'B12' (రిబోఫ్లావిన్) వంటి వాటి వలన మీ రాత్రి చొప్పులో లోపాలు కలుగుతాయి. విటమిన్ 'A' లోపం వలన రాత్రి సమయంలో దృష్టి లోప సమస్యలు కలుగుతాయి. Image Courtesy:Getty Images

  • 11

    కాంతి బహిర్గత చర్మంలో ఎర్రగా మారటం

    మీరు ఒకవేళ విటమిన్ 'B3' లోపం కలిగి ఉన్నట్లయితే, సూర్య కాంతికి బహిర్గతమైన ప్రదేశంలో చర్మం పూర్తిగా ఎరుపుగా మారుతుంది. Image Courtesy:Getty Images

    Tags:
  • పోషకాల ఆవశ్యకత
  • పోషకాల లోపం వలన కలిగే నష్టాలు
  • విటమిన్ లోపం వలన కలిగే వ్యాధులు
  • మినరల్స్ లోపం వలన కలిగే వ్యాధులు
  • Nutritional deficiency in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ