Health Tips in HindiHealth Tips

గర్భవతిగా ఉన్నపుడు ఎదోర్కేనే సమస్యలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 13, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భ దశ అనేది స్త్రీలకు కీలక సమయం అని చెప్పవచ్చు, కారణం ఈ సమయంలో కలిగే సమస్యల చాలా ప్రమాదకరంగా ఉంటాయి. గర్భ సమయంలో కలిగే సమస్యలు మరియు పరిష్కారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గుండెలో మంట

    గర్భ సమయంలో గుండెలో మంట చాలా సాధారణంగా కనపడే లక్షణం. దీనినే ''గ్యాస్ట్రోఈసోఫాగల్ రిఫ్లెక్ష్ డిసీజ్'' (GERD) అంటారు, ముఖ్యంగా ఇది ప్రారంభ గర్భ దశలో కలుగుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఉన్నఏకైక మార్గం- సరైన ఆహర ప్రణాళికను అనుసరించటం మరియు వ్యాయామాలను చేయటం. గర్భ సమయంలో కలిగే సాధారణ సమస్య మరియు సులభంగా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.Image Courtesy : Getty Images

  • 2

    బ్రాక్స్టన్ హిక్స్ కుదింపులు

    కొంత మంది స్త్రీలు గర్భ సమయంలో వివిధ రకాల కుదింపులకు గురవుంటారు వీటినే ''బ్రాక్స్టన్ హిక్స్ కుదింపులు'' అంటారు. ఈ రకమైన సమస్యలు కొంత మందిలో రోజంతా ఉండి సమస్యలకు గురి చేస్తాయి మరియు రెండవ దశ త్రైమాసిక దశలో వీటిని ఎక్కువగా గమనించవచ్చు. గర్భం తరువాత కూడా ఇవి కలుగుతాయి మరియు సరైన మందులను వాడటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. వీటికి చికిత్సలో సరైన భంగిమలో నిద్ర, నడవటం పైన సూచనలు మరియు ఫిజియోథెరపీ వంటిని జరిపిస్తారు.Image Courtesy : Getty Images

  • 3

    మలబద్దకం

    గర్భ సమయంలో స్త్రీ శరీరంలో ఉండే పేగులలో కలిగే అసాధారణ కుదింపుల వలన మలబద్దకం కలిగే అవకాశం ఉంది. ఫలితంగా మీ శరీరంలో పోషకాల గ్రాహన అధికం అవుతుంది. దీని వలన కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉంది. Image Courtesy : Getty Images

  • 4

    డీ హైడ్రేషన్ (నిర్జలీకరణము)

    గర్భ సమయంలో రక్తనాళాలు విస్తరణ అధికం అవుతాయి. మరొక మాటలో చెప్పాలంటే, ఈ సమయంలో మీ శరీరానికి నీరు అవసరం మరియు అవసరమైన నీటి శాతాన్ని బదిలీ చేయించాలి. డీ హైడ్రేషన్ అనేది గర్భ సమయంలో సాధారణ సమస్యగా చెప్పవచ్చు. అధిక నీటి సేకరణ లేదా ద్రావణాల సేకరణ వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.Image Courtesy : Getty Images

  • 5

    వెన్ను సమస్యలు

    గర్భం ధరించిన మొదటి నుండి చివరి వరకు వెన్ను నొప్పులతో భాదపడాలి, చాలా సాధారణ సమస్య మరియు మూడవ త్రైమాసిక దశలో ఇది అధికంగా ఉంటుంది. గర్భాశయంలో శిశువు పరిమాణం పెరిగిన కొలది, స్త్రీ శరీరంలోని గురుత్వాకర్షణ కేంద్రం మారుతూ వస్తుంది. పడుకునే సమయంలో, కోణాలలో సాధారణ చిట్కాలను పాటించటం మరియు కూర్చునే సమయంలో, నడిచే సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటించటం వలన వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.Image Courtesy : Getty Images

  • 6

    అధిక రక్తపోటు

    'ఎక్లంప్సియా', 'ప్రీఎక్లంప్సియా', 'దీర్ఘకాలిక రక్తపోటు' మరియు 'గర్భధారణ రక్త పీడనం' వంటివి ఇందులో చేర్చబడ్డాయి. గర్భధారణ రక్త పీడనం మాత్రం గర్భ సమయంలో ఉండి, ప్రసవం తరువాత స్వతహాగా తగ్గిపోతుంది. కానీ గర్భ సమయంలో ఈ రకమైన రక్త పీడనం వలన చాలా రకాల సమస్యలు కలుగుతాయి. కావున గైనాకాలజిస్ట్ లేదా మీ ఆరోగ్య నిపుణులను కలిసి తగిన జాగ్రత్తలను తీసుకోవటం వలన ఈ సమస్య నుండి భయట పడవచ్చు.Image Courtesy : Getty Images

  • 7

    జ్వరం

    గర్భంతో ఉన్న ఆడవారికి ఇది చాలా ముఖ్యమైనది మరియు గర్భ సమయంలో సరైన వాక్సిన్'లను తీసుకోవటం వలన జ్వరం ద్వారా కలిగే సంక్లిష్ట సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. Image Courtesy : Getty Images

  • 8

    స్రావాలు

    గర్భ సమయంలో స్రావాలు ప్రమాదకర పరిస్థితిగా పేర్కొనవచ్చు మరియు ఇవి కలిగిన వెంటనే తగిన చర్యలను లేదా చికిత్స చేపించుకోవాలి, అంతేకాకుండా తిమ్మిరులతో కూడిన స్రావాలు గర్భస్రావాలకు సూచికలుగా చెప్పవచ్చు. కావున ఇలాంటివి కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.Image Courtesy : Getty Images

    Tags:
  • గర్భ దశలో కలిగే సమస్యలు
  • గర్భంలో కలిగే వెన్నునొప్పులకు పరిష్కారాలు
  • గర్భ గర్భ సమయంలో కలిగే సమస్యలకు పరిష్కారాలు
  • గర్భ సమస్యలకు పరిష్కారాలు
  • Common Problems in Pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • స్వతహాగా తగ్గించుకోగల దంత సమస్యలు

    దంత సమస్యలను తగ్గించుటకు వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ఇంట్లోనే వీటిని సులువుగా తగ్గించులోవచ్చు. చవకైన, సులువుగా సమస్యలను దూరం చేసే పద్దతుల గురించి ఇక్
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • స్వతహాగా తగ్గించుకోగల దంత సమస్యలు

    దంత సమస్యలను తగ్గించుటకు వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ఇంట్లోనే వీటిని సులువుగా తగ్గించులోవచ్చు. చవకైన, సులువుగా సమస్యలను దూరం చేసే పద్దతుల గురించి ఇక్