Health Tips in HindiHealth Tips

ఆవలింతలు ఎక్కువగా రావటానికి గల కారణాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 02, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అలసిపోయినపుడు, బహుశా రోజు చివరలో ఆవలింతలు సాధారణంగా వస్తుంటాయి. కానీ, లేచినప్పటి నుండి నిరంతరం ఆవలింతలు వస్తున్నాయా? అయితే దానికి కారణం ఏంటో తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అధికంగా ఆవలింతలా?

    ఆవలింత అనేది, నోరు తెరచి లోతుగా గాలిని ఊపిరితిత్తుల నిండా పీల్చుకునే  అసంకల్పిత ప్రక్రియ. అలసటగా ఉన్నపుడు లేదా నిద్ర ముంచుకొచ్చే ముందు ఆవలింతలు వస్తుంటాయి. ఆవలింతల వలన మెదడు ఉష్ణోగ్రత తగ్గుతుందని మరియు మితిమీరిన ఆవలింతలు హానికరమని నూతన పరిశోధనలలో తెలుపబడింది. అలసటగా లేనపుడు కూడా రోజులో చాలా ఆవలింతలు కలగటం అనేది మన వ్యక్తిగత జీవితంతో పాటూ, వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితపరుస్తుది. ఇలా అధిక ఆవలింతలకు గల కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    నార్కొలేప్సి

    చాలా మంది రోజు చివరలో అలసిపోవటం వలన ఆవలింతలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ, కొంతమందిలో పూర్తిరోజు నిద్రపోయిన వారు అలసిపోయాం అనే భావనకు లోనవుతుంటారు. దీనినే ఈ పరిస్థితిని  నాడీ శాస్త్రం ఆధారంగా నార్కొలేప్సి గా పేర్కొంటారు. ఇదేం ప్రమాదకర వ్యాధి కాదు.

  • 3

    థైరాయిడ్

    థైరాయిడ్ నెమ్మదిగా పురోగతి చెందుతూ, జీవక్రియను నియంత్రించి, పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. కావున అధికంగా ఆలింతలు కలగటం ప్రారంభమైనపుడు, ఇతర కారణాలు కాదు అనిపిస్తే, అది థైరాయిడ్ వలన అని గమనించండి. వైద్యుడిని కలిస్తే చిన్న రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ గ్రంధి సాధారణంగా పని చేస్తుందా లేదా అని తెలుస్తుంది.

  • 4

    ఆహారం

    కొన్ని రకాల శక్తి పెంచే ద్రావణాలు కూడా దీనికి కారణం కావచ్చు. ఉదాహరణకు- ఒక కప్పు కాఫీ మీకు శక్తిని అందించి, చురుకుగా మీ పనిని చేసేలా ప్రోత్సహిస్తుంది కానీ, ఎక్కువగా కాఫీ తాగటం వలన అలసటకు గురై అధికంగా ఆవలింతలు వస్తాయి. దీనికి కారణం ఒకేసారి అకస్మాత్తుగా అధిక కెలోరీలు శక్తి అందించబడి, తిరిగి శక్తి స్థాయిలు గణనీయంగా పడిపోవటం.అధిక చక్కెరలు గల ఆహార పదార్థాలు కూడా ఇలాంటి చర్యలకు కారణం అవుతాయి. మీకు కానీ, అధిక ఆవలింతలు గమనిస్తే మీరు తినే మరియు తాగే ఆహార పదార్థాలను ఒకసారి చెక్ చేసుకోండి.

  • 5

    మందులు

    సెరోటోనిన్ రిఅప్టేక్ ఇన్హిబిటర్ల (SSRIs) వంటి కొన్ని ప్రత్యేక మందుల వాడకం వలన డిప్రెషన్ లేదా ఉద్రేకత లు కలిగి అధికంగా ఆవలింతలు కూడా కలగవచ్చు. అంతేకాకుండా, యాంటీ డిప్రసేంట్ చికిత్సలో అధిక ఆవలింతలు అనేది ఒక దుష్ప్రభావమని వైద్యులకు తెలుసు. కానీ దీనిపై ఎక్కువ పరిశోధనలు జరపలేదు. Image source: Getty Images

    Tags:
  • ఆవలింతలకు కారణాలు
  • ఆవలింతల అధికంగా రావటానికి గల కారణాలు
  • Avalinchathalaku gala karanalu
  • Causes of Excessive Yawning in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ