Health Tips in HindiHealth Tips

చలికాలంలో మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు ఇవే...

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చలికాలంలో మన చర్మం పొడిగా మారటం చాలా సాధారణమే కాదా అని అనుకుంటాము, కానీ దీనికి కారణాలు ఎన్నో, నమ్మకమ కలగటం లేదా? అయితే ఇది చదవండి.
  • 1

    చలికాలంలో పొడి చర్మం

    చలికాలంలో చర్మం పొడిగా మారటానికి చలి కారణం అనుకుంటారు. కానీ, ఈ కాలంలో చర్మం పొడిగా మారటానికి చలి ఒక్కటే కాదు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవును, మనం వాడే మందులు, రోజు వారి కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం వంటివి కారణం కావచ్చు. ఆ కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    వేడితో నీటి స్నానం

    చలికాలంలో నీటిని తాకాలంటే కూడా భయమే! ఈ కాలంలో మనం ముఖం కడుక్కోవాలన్న కూడా వేడి నీటి కోసం చూస్తూంటాము. అవునా! ఇంకా స్నానానికైతే మరిగే నీరు కావాల్సిందే. కానీ, వేడి నీరు మనం చర్మంలో ఉండే సహజ తేమ మరియు నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుందని చేలా మందికి తెలియని విషయం. కావున ఈ రోజు నుండి వేడి నీటిని కాకుండా, గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయండి.

  • 3

    ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం

    చలికాలం వచ్చిందంటే చాలు టోనర్స్, లోషన్, బాడీ క్రీములు కొని తెచ్చి పెట్టుకుంటాము. కానీ కొన్ని రకాల ఉత్పత్తులు ఆల్కహాల్ ను కలిగి ఉంటాయి, ఆల్కహాల్ కలిగి ఉండే ఉత్పత్తుల వాడకం వలన చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. మీ చర్మం పొడిగా ఉండకూడదు అంటే ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

  • 4

    జన్యుపర సంక్రమణ

    పొడి చర్మం కూడా వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని చెప్తే మీకు నవ్వు రావచ్చు! కానీ ఇది నిజం. అవును మీ కుటుంబీకులలో ఎవరైన పొడి చర్మం కలిగి ఉంటే మీరు కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

  • 5

    మందుల వాడకం

    శరీర కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు, కేన్సర్ నివారణా మందులు వాడుతున్నారా? అయితే మీరు కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రకమైన మందుకు వాడే వారిలో చర్మం పొడిగా మారి పొలుసులుగా రాలుతుంది. Image source: Getty Images

    Tags:
  • చలికాలంలో చర్మం పొడిగా మారుటకు గల కారణాలు
  • శీతాకాలంలో పొడి చర్మానికి కారణాలు
  • పొడి చర్మానికి కారణాలు
  • Podi charmaniki gala karanalau
  • Causes of dry skin in Winters in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ