Health Tips in HindiHealth Tips

ద్వితీయా త్రైమాసిక దశలో స్త్రీ శరీరంలో కలిగే మార్పులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 16, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భదశలో చాలా ఇబ్బందులు మరియు మార్పులు కలుగుతాయి. వీటి గురించి ముందే తీసుకోవటం వలన సమస్యల నుండి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు కలిగే మార్పులకు ముందుగానే మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉండవచ్చు. ద్వితీయా త్రైమాసిక దశలో కలిగే మార్పుల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • 1

  మార్పులు

  గర్భ నిర్దారణ జరిగిన తరువాత స్త్రీ శరీరంలో రోజు, రోజుకు మార్పులు కలుగుతూనే ఉంటాయి, వీటికి అనుగుణంగా, సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ద్వితీయా లేదా రెండవ గర్భదశలో కలిగే మార్పుల గురించి ఇక్కడ తెలుపబడింది, వీటి గురించి తెలుసుకోవటం వలన ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. Image Courtesy : Getty Images

 • 2

  తుంటి మరియు పొత్తి కడుపులో నొప్పులు

  గర్భాశయంలో శిశువు పెరుగుతున్న కొలది, పొట్ట పరిమాణం పెరగటం వలన వెన్నుభాగంపై ఒత్తిడి ఏర్పడుతుంది. గర్భ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు, స్నాయువులను (కీళ్ళను కలిపే ప్రాంతం) విశ్రాంతి పరచటం తుంటి మరియు పొత్తి కడుపులో నొప్పి కలుగుతుంది.Image Courtesy : Getty Images

 • 3

  రొమ్ము పరిమాణం పెరగటం

  ద్వితీయా త్రైమాసిక దశలో, పాలను ఉత్పత్తి చేసే గ్రంధుల పరిమాణం అధికం అవటం వలన రొమ్ము పరిమాణం పెరుగుతుంది. గర్భవతి రొమ్ములో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా, రొమ్ము పరిమాణం పెరిగి, మృదువుగా మారతాయి, వీటితో పాటూగా, చనుమొనలు సున్నితంగా మారి, గర్భదశ పూర్తిగా అలానే ఉండవచ్చు. వీటికి మద్దతును ఇచ్చే బ్రా తప్పక వాడాలి.Image Courtesy : Getty Images

 • 4

  బ్రాక్స్టన్ హిక్స్ కుదింపులు

  ఈ కుదింపులు, గర్భాశయ కండరాలు బిగుతుగా మారటం వలన కలుగుతాయి. ఈ కుదింపులు శిశు జననానికి సుచనలుగా తెలుపవచ్చు. బ్రాక్స్టన్ హిక్స్ కుదింపులు, గర్భవతిని చాలా అసౌకర్యాలకు గురి చేస్తాయి. కొన్నిసార్లు, శరీరంలో జారిగే మార్పులు, బ్రాక్స్టన్ హిక్స్ కుదింపులుగా అనిపిస్తాయి.Image Courtesy : Getty Images

 • 5

  రొంప & ముక్కు నుండి స్రావాలు

  హార్మోన్ ల మార్పుల వలన ముక్కులోని శ్లేష్మ పొరల గోడలు వాపులకు గురవుతాయి. దీని ఫలితంగా ముక్కు నుండి మరియు నోటి నుండి స్రావాలు అధికవుతాయి. ఈ మార్పుల వలన సులభంగా ముక్కు నుండి స్రావాలు జరుగుతాయి. ముక్కు నుండి స్రావాలను తగ్గించుటకు, తలను పైకి ఎత్తి ఉంచండి.Image Courtesy : Getty Images

 • 6

  బరువులో పెరుగుదల

  ద్వితీయ త్రైమాసిక దశలో, వేవిళ్లు చాలా సాధారణం మరియు ఆకలి కూడా అధికంగా ఉండటం, వీటితో శరీర బరువు పెరుగుతుంది. మీ శరీర బరువు సాధారణంగా, కాకుండా గణనీయంగా పెరిగితే, వైద్యుడిని కలవటం తప్పనిసరి.Image Courtesy : Getty Images

 • 7

  ఊపిరి ఆగినట్టుగా అనిపించటం

  ఈ రకమైన సమస్య సాధరణమనే చెప్పవచ్చు, కారణం- గర్భాశయ పరిమాణం పెరగటం వలన, ఊపిరితిత్తుల వ్యాకోచానికి తగిన స్థలం ఉండదు. లోతైన శ్వాస మరియు రోజు ఉదయాన కొన్ని రకాల శ్వాస వ్యాయామాల చేయటం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.Image Courtesy : Getty Images

 • 8

  దురదలుగా అనిపించటం

  90 శాతం గర్భవతులు, దురదలకు గురవుతుంటారు, ముఖ్యంగా, పొట్ట చుట్టూ. కారణం- శరీరంలో కలిగే మార్పుల ఫలితంగా అని చెప్పవచ్చు. హార్మోన్ ల మార్పులు మరియు శుశువు పెరుగుదల వలన చర్మంపై ఒత్తిడి, శరీర ఉష్ణోగ్రత పెరగటం వలన దురదలు కారణాలుగా చెప్పవచ్చు. Image Courtesy : Getty Images

  Tags:
 • రెండవ త్రైమాసిక గర్భదశ
 • గర్భదశ సమస్యలు
 • Garbhadashalo kalige marpulu
 • Changes in 2nd Trimester pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు.

  రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్య
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు.

  రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్య