Health Tips in HindiHealth Tips

బరువు తగ్గాలి అనుకునే ప్రయత్నంలో చేసే తప్పిదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 03, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు తగ్గటంలో చాలా కష్ట పడాలి కానీ మీరు అనుసరించే నియమాలలో చిన్న చిన్న తప్పిదాల వలన చాలా బరువు తగ్గలేరు. బరువు తగ్గటం కోసం చేసే ప్రయత్నంలో అందరు చేసే తప్పిదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • 1

  బరువు తగ్గాలి అనుకున్నపుడు చేసే పెద్ద తప్పు

  బరువు తగ్గాలి అనుకుంటున్నపుడు మీ జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవాలి. బరువు తగ్గించుకోనుటకు రోజు వారి జీవితంలో ఎక్కువ మార్పులు అవసరం లేదు. బరువు తగ్గుటకు చేసే ప్రయత్నంలో చేసే చిన్న చిన్న తప్పుల వలన మీ ప్రయత్నం వృధా అవవచ్చు. మీరు చేసే తప్పిదాల గురించి ఇక్కడ తెలుపబడింది.Image Courtesy:Getty Images

 • 2

  వ్యాయామాలు చేయకపోవటం

  శరీర బరువు తగ్గించుకోటానికి, తీసుకునే క్యాలోరీల కన్నా ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్య అధికంగా ఉండాలి. కానీ కొంత మంది ఎక్కువ క్యాలోరీలను తీసుకుంటూ తక్కువ క్యాలోరీలు ఖర్చు చేస్తూ ఉంటారు. సన్నగా అవటానికి ఉన్న ఒకే ఒక్క దారి: అధిక క్యాలోరీల ఖర్చు కోసం వ్యాయమాలను తప్పక అనుసరించటం. Image Courtesy:Getty Images

 • 3

  సరైన ఆహారం తీసుకోకపోవడం

  ఆరోగ్యవంతమైన భోజనము మరియు స్నాక్స్'లను చిన్న చిన్న దఫాలుగా, ఎక్కువ సార్లు తీసుకోవటం వలన రోజంత శక్తిని పొందటమే కాకుండా బరువు కూడా తగ్గుతారని చెప్తే ఎవరు నమ్మరు కానీ ఇది సత్యం. కానీ కొన్ని సార్లు, తినకపోవటం వలన ఎక్కువగా ఆకలిగా అనిపించి, అధిక క్యాలోరీల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంది.    Image Courtesy:Getty Images

 • 4

  అవాస్తవిక అంచనాలు

  బరువు తగ్గటంలో ముందుగా నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అంచనాలకు తగినట్టుగా ప్రయత్నించాలి కానీ అవాస్తవిక అంచనాలను చూసి నిరుత్సాహ పడకూడదు. మీరు నిర్దేశించుకునే లక్ష్యాలు సహజంగా మరియు నెరవేరేలా ఉండాలి. ఒక నెలలో 10 కిలోగ్రాములు వంటి లక్ష్యాలను కాకుండా చిన్న లక్ష్యాలను ఎంచుకోవటం వలన సులువుగా అధిరోహిస్తారు మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. Image Courtesy:Getty Images

 • 5

  తక్కువ సమయంలో ఫలితాల పైన దృష్టి పెట్టండి

  కొంత మంది 10 రోజులలో 5 పౌండ్ల బరువు తగ్గాలి అని లక్ష్యాన్ని పెట్టుకొని చేధిస్తారు. కానీ ఆ తరువాత బరువు తగ్గటం పైన దృష్టి సారించారు, తిరిగి బరువు పెరుగుతారు. బరువు తగ్గాలి అని కొనసాగించే ప్రయత్నం కనీసం సంవత్సరం వరకు అయిన ఉండాలి.  Image Courtesy:Getty Images

 • 6

  సరిపోయేంత నిద్ర లేనపుడు

  'పడుకోవటం వలన బరువు తగ్గుతారు' అని ఎపుడైనా విన్నారా! ఈ వాఖ్యంలో నిజం ఉంది. ఒక రోజులో మీరు 7 నుండి తొమ్మిది గంటల సమయం పాటూ విశ్రాంతి తీసుకోవాలి. దీని వలన ఆకలిని ప్రేరేపించబడి, హార్మోన్ విడిదల కూడా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా నిద్ర కూడా శరీర బరువు పైన ప్రభావం చూపుతుంది.   Image Courtesy:Getty Images

 • 7

  టి.వి ముందు కూర్చిని తినటం

  తినటం కూడా వలన బరువు తగ్గటంలో వైఫల్యానికి ఒక కారణంగా చప్పవచ్చు. ఇష్టమైన టి.వి షో ముందు కూర్చొని తినటం వలన మీకు తెలియకుండానే ఎక్కువగా తినే అవకాశం ఉంది. కావున టి.వికి దూరంగా కూర్చొని తినటం చాలా మంచిది.Image Courtesy:Getty Images

 • 8

  తరచు బరువు తణికి

  బరువు తగ్గటానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు రోజు బరువు తణికి చేసుకోవటం వలన పొందే ఫలితాలలో మార్పులను చూసి, ఎక్కువ ఉత్సహంగా పని చేయటానికి ఇష్ట పడుతుంటారు. ఉదయాన కన్నా రాత్రి సమయంలో బరువు అధికంగా తగ్గుతారు.  Image Courtesy:Getty Images

 • 9

  ఆహరంపై వ్యామోహం

  మీకు ఇష్టమైన ఆహరం కనపడినపుడు ఎక్కువ తినే ఆవకాశం ఉంది, కానీ కొన్ని సమయాల్లో, వీటి వలన దీర్ఘకాలిక ఫలితాలను కాకుండా స్వల్ప కాలిక ఫలితాలను చూపవచ్చు. వీటి వలన మీ ఆహర నియమాలలో ఆటంకాలు ఏర్పడి, మీ లక్ష్యం  దెబ్బతినవచ్చు. కావున మీకు కావలసిన పోషకాలకు సంబంధించిన వాటిని మాత్రమే తింటూ, మిగిలిన వాటికి దూరంగా ఉండండి. Image Courtesy:Getty Images

 • 10

  తిరిగి చెడు ఆహరపు అలవాట్లను పొందటం

  మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నపుడు, తినే ఆహారంలో అధిక క్యాలోరీలు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేల మీరు కానీ వెన్నతో చేసిన టోస్ట్ వంటివి తినటం వలన శరీరానికి అధికక్యా లోరీలు అందింపబడి బరువు తగ్గే లక్ష్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. Image Courtesy:Getty Images

  Tags:
 • బరువు తగ్గేపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
 • బరువు తగ్గేటపుడు చేసే తప్పులు
 • బరువు తగ్గటానికి చిట్కాలు
 • Weight Loss Tip in Telugu.
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

 • Parwinali Patan30 Nov 2014
  Good and super valuable information...
 • Ch.Shivarama krishna14 Feb 2015
  I have heavy weight so please tell some tips for weight loss.
 • Prakash18 Feb 2015
  Very good it required to every one body. Thank you for site
 • Divya 19 Aug 2015
  Plz tel me weight loss tips

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

  లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

  లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ