Health Tips in HindiHealth Tips

ఆస్తమా కలిగే ముందు ఈ లక్షణాలను గమనించి జాగ్రత్త పడవచ్చు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 25, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రమాదకర మరియు భయంకర వ్యాధులలో ఆస్తమా కూడా ఒకటి, శ్వాస ఇబ్బందులను ముఖ్యంగా, రాత్రి సమయంలో ఆకస్మికంగా, శ్వాసలో సమస్యలను కలుగచేసి ఇబ్బందులకు గురి చేస్తుంది, వ్యాధి సంక్రమణ ముందు కొన్ని లక్షణాలను బహిర్గత పరుస్తుంది, వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    తెలుసుకోవాల్సిన లక్షణాలు

    ఆస్తమా అనేది తీవ్రమైన వ్యాధిగా పరిగణించవచ్చు. రాత్రి పడుకున్న సమయంలో ఆస్తమా వలన శ్వాసలో ఇబ్బందులను కలుగచేసి, వివిధ రకాల సమస్యలను కలుగ చేస్తుంది. ఆస్తమా వ్యాధి కలిగే ముందు బహిర్గతమయ్యే లక్షణాల గురించి తెలుసుకోవటం వలన వ్యాధి తీవ్రతరం అవకుండా కాపాడుకోవచ్చు.Image Courtesy : Getty Images

  • 2

    నిరంతర దగ్గు

    ఆస్తమా వలన కలిగే లక్షణాలు సమయానికి అనుగుణంగా మారుతుంటాయి. కొన్ని సమయాల్లో సాధారణ దగ్గుగా, తరువాత దగ్గు మానిపోవటం మరియు కొన్ని సమయాల్లో తీవ్రతరమైన దగ్గు రూపంలో బహిర్గతం అవుతుంటుంది. ఈ దగ్గు పొడిగా ఉండి, మందుల వలన తగ్గదు. ఆస్తమా వ్యాధికి గురయ్యే ప్రమాదాన్ని తెలిపే లక్షణంగా తెలుపవచ్చు.Image Courtesy : Getty Images

  • 3

    చాతి మరియు గడ్డం వద్ద దురదలు

    మచ్చలతో, గడ్డం మరియు చాతి ప్రాంతాలలో దురదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా!, ఆస్తమా వ్యాధికి గుర అవబోతున్నారని అర్థం.Image Courtesy : Getty Images

  • 4

    గురకలు

    శ్వాస వ్యవస్థ, పై భాగంలో శ్లేష్మ ఉత్పత్తి అధికం అవటం వలన గురకలు కలుగు తుంటాయి. ఈ లక్షణం కూడా అస్తమా వ్యాధికి గురవబోతున్నారు అని తెలిపే లక్షణంగా పరిగణించవచ్చు. Image Courtesy : Getty Images

  • 5

    చాతిలో గట్టిదనం

    మీ చాతిలో కారణం లేకుండా గట్టిగా అనిపిస్తుందా! శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తుందా! అయితే ఆస్తమాకి గురవబోతున్నారని అర్థం. Image Courtesy : Getty Images

  • 6

    శ్వాసలో పెరుగుదల

    అలర్జీ కారకాలకు దగ్గరగా ఉన్నపుడు, మీ శ్వాస అధికం అవటాన్ని గమనిస్తారు అవునా! మీరు త్వరలో ఆస్తమా వ్యాధికి గురి అవబోతున్నారు అని సూచికగా చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

  • 7

    చాతిలో మంటగా అనిపించటం

    చాతిలో మంటగా అనిపిస్తుందా! అయితే, తేలికగా వదిలేయకండి, దీనిని గమనించిన వెంటనే, వైద్యుడుని సంప్రదించండి. అసిడిటీ వలన చాతిలో మంటగా అనిపిస్తుంది. కానీ, ఆస్తమా వలన కలిగితే, తేలికగా మాత్రం తీసుకోకుండా, తగిన చర్యలను తీసుకోండి. Image Courtesy : Getty Images

  • 8

    శ్వాసలో తగ్గుదల

    శ్వాస తీసుకోటానికి ఇబ్బందిగా అనిపిస్తుందా! అయితే, ఈ సమస్యను తేలికగా తీసుకోకండి. ఆస్తమా వలన ఇలా జరిగే అవకాశం ఉంది, కానీ ఇతర శ్వాస ఇబ్బందుల వలన కూడా ఇలాగే జరుగుతుంది. కావున తగిన చర్యలను తీసుకోవటం చాలా మంచిది.Image Courtesy : Getty Images

  • 9

    నీలి రంగు పెదాలు లేదా వెలి గోళ్ళు

    మీ శరీర రక్తంలో, ఆక్సిజన్ సరైన స్థాయిలో సరఫరా చెందని పక్షంలో, పెదాలు లేదా వెలి గోర్లు నీలి రంగులోకి మారతాయి. దీనినే ''సైనొసిస్'' అంటారు. ఆస్తమా కలిగే ముందు ఇది కూడా ఒక లక్షణంగా పరిగనించవచ్చు.Image Courtesy : Getty Images

    Tags:
  • ఆస్తమా లక్షణాలు
  • ఆస్తమా వ్యాధి బహిర్గతపరిచే లక్షణాలు
  • ఆస్తమా వ్యాధి నివారణలు
  • How to prevent asthma attack in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ