Health Tips in HindiHealth Tips

పిల్లలలో కలిగే స్థూలకాయత్వాన్ని తగ్గించే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 04, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా స్థూలకాయత్వానికి ప్రతి ఒక్కరు గురవుతున్నారు, ముఖ్యంగా పిల్లలలో అచైతన్యమైన జీవనశైలి, అనారోగ్యకర ఆహారం వలన చాలా మంది పిల్లలు దీని భారినపడుతున్నారు. పిల్లలలో స్థూలకాయత్వానికి గురవకుండా ఉండటానికి కొన్ని సూచనలు ఇక్కడ తెలుపబాడ్డాయి.
  • 1

    చిన్నతనంలో స్థూలకాయత్వం

    పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా స్థూలకాయత్వం అనేది అందరిలో కలిగే సాధారణ సమస్య. ఈ తరంలో జన్మించే చాలా మంది, అధిక బరువుతో జన్మిస్తున్నారని కనుగొనబడింది. నిజానికి, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకర జీవనశైలి వలన స్థూలకాయత్వానికి గురి చేసే కారకాలుగా చెప్పవచ్చు. చిన్నతనంలో కలిగే లేదా పిల్లలలో కలిగే స్థూలకాయత్వాన్ని తగ్గించటానికి సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy : Getty Images

  • 2

    భౌతిక కార్యాలు

    పిల్లలలో స్థూలకాయత్వాన్ని తగ్గించే మంచి మార్గం- భౌతిక కార్యాలను అనుసరరించటం. ఆటలు లేదా భౌతిక కార్యాలు శరీర బరువు తగ్గుటకు చాలా సహాయం చేస్తాయి, మీ పిల్లల జీవన విధానంలో వీటిని ఒక అలవాటుగా మార్చి, వాటిని పాటించేలా జాగ్రత్త పడండి.Image Courtesy : Getty Images

  • 3

    ఇతర వ్యాయామాలు

    శరీర బరువు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలంటే, వ్యాయామాలు తప్పని సరే అని చెప్పవచ్చు. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి సాధారణ వ్యాయామాలను అనుసరించేలా ప్రోత్సహించండి. శరీర బరువు తగ్గుటలో మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉండుటలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. Image Courtesy : Getty Images

  • 4

    భోజనం

    పిల్లల బరువును నేరిగా ప్రభావిత పరిచేది- భోజనం. క్యాలోరీలను మరియు కొవ్వు పదార్థాలను తక్కువగా అందించే ఆహారాలను వారికి సమకూర్చండి. కొవ్వు పదార్థాల వలన అధిక బరువు పెరుగుతుంది. కావున శరీర బరువు పెంచే ఆహారాలకు బదులుగా ఆరోగ్యకర ఆహారాలను అందించండి.Image Courtesy : Getty Images

  • 5

    ద్రావణాల నుండి క్యాలోరీలు

    చక్కెర ద్రావణాలను మరియు పండ్ల రసాలు, క్యాలోరీలను అందిస్తాయి. కావున ఇలాంటి ద్రావణాలను మీ పిల్లలు తక్కువ తీసుకునేలా చూడండి. పోషకాలు తక్కువగా ఉండి, అధిక మొత్తంలో క్యాలోరీలను అందించే వాటికి దూరంగా ఉండేలా చుడండి.Image Courtesy : Getty Images

  • 6

    నిద్ర

    మీ పిల్లల ఆరోగ్యాన్ని మరియు శరీర బరువును ప్రభావిత పరిచేది- నిద్ర. పిల్లలు ఎక్కువగా పడుకోవటం లేదా తక్కువగా పడుకోవటం వలన నేరుగా శరీర బరువుపై ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలలో పడుకోవలసిన సాధారణ సమయం కంటే తక్కువగా విశ్రాంతి తీసుకోవటం వలన వారి శరీర బరువు పెరుగుతుంది. కావున సరైన సమయం పాటూ విశ్రాంతి తీసుకునేలా జాగ్రత్త పడండి.Image Courtesy : Getty Images

  • 7

    జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచండి

    పిల్లలకు, భోజన విరామాల మధ్య కలిగే ఆకలిని తగ్గించటానికి వారికి ఆరోగ్యకర స్నాక్స్ ను అందుబాటులో ఉంచండి. పిల్లలకు ఆకలిగా అనిపించినపుడు, జంక్ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను తినటానికి ప్రయత్నిస్తారు. కావున, మీ పిల్లల ఆకలిని తీర్చటానికి ఆరోగ్యకర స్నాక్స్ ఎల్లపుడు వారికి అందుబాటులో ఉండేలా చుడండి.Image Courtesy : Getty Images

  • 8

    టీ.వి చూసే సమయాన్ని తగ్గించండి

    పూర్తి సమయం టీ.వి ముందు కూర్చొని ఉండటం వలన భౌతిక కార్యాలు తగ్గి, పిల్లలు స్థూలకాయత్వానికి గురయ్యే అవకాశం ఉంది. కావున, టి.వి చూసే సమయాన్ని తగ్గించి, ఆటలలో పాల్గొనేలా ప్రోత్సహించండి. లేదా ఇతర భౌతిక కార్యాలలో పాల్గొనేలా చూడండి.Image Courtesy : Getty Images

    Tags:
  • స్థూలకాయత్వాన్ని తగ్గించే సూచనలు
  • పిల్లలలో స్థూలకాయత్వం
  • చిన్నతనంలో అధిక బరువుకు కారణాలు
  • Fight with Childhood Obesity in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ