Health Tips in HindiHealth Tips

శరీర బరువును తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 15, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రస్తుతకాలంలో, ప్రపంచాన్ని భయాందోలనలకు గురి చేస్తున్నది- స్థూలకాయత్వం. చాలా మంది అధిక బరువు ఉండి, శరీర బరువును తగ్గించుకొనుటకు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు, అవునా! కానీ ఎలాంటి ఫలితాన్ని పొందలేకపోతున్నారు, కారణం ఎంపికలో లేదా ఆచరణ తప్పులని చెప్పవచ్చు. శరీర బరువును శక్తివంతంగా బరువు తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఇక్కడ వివరించబడింది.
  • 1

    బరువు తగ్గుదల

    సులభంగా బరువు తగ్గించుకొనే పద్దతిని ఎవరు కనుగోనలేరు. కారణం- శరీర బరువు తగ్గించుకోవటం అంత సులభమని చెప్పటం కష్టమే. నిపుణుల సహాయాన్ని తీసుకోవటం, ఆహార ప్రణాలికలను పాటించటం, వ్యాయామాలను అనుసరించటం వంటి వాటిని దృష్టిని కేంద్రీకరించి అనుసరించటం వలన బరువు తగ్గుతారు. ప్రణాలికలను అశ్రద్ద చేసిన బరువు తగ్గే ప్రణాలికలో వ్యత్యాసాలు ఏర్పడవచ్చు. కావున బరువు తగ్గించే ప్రణాళికను శ్రద్ధతో పాటించాలి, శరీర బరువును తగ్గించే సులభ మార్గాలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy:Getty Images

  • 2

    నిద్ర

    నిద్ర అనేది శరీర బరువును తగ్గించే మరియు ఆరోగ్యంగా ఉంచే సహజ పద్దతిగా చెప్పవచ్చు. ''క్యుబెక్''లో ఉన్న ''లవాల్ విశ్వవిద్యాలయంలో'' పరిశోధనల ప్రకారం, ఎక్కువ సమయం పడుకున్న లేదా తక్కువ సమయం పడుకున్న శరీర బరువు పెరుగుతుందని తెలిపారు. 8 గంటల కంటే ఎక్కువ సమయం 6 గంటల సమయం కంటే తక్కువ సమయం పడుకునే వారితో పోలిస్తే, 7 నుండి 8 గంటల పాటూ పడుకునే వారిలో శరీర బరువు తక్కువగా ఉంటుంది.Image Courtesy:Getty Images

  • 3

    నీటిని అధికంగా తాగండి

    నీరు అధికంగా తాగటం వలన శరీరంలో అధిక కొవ్వు పదార్థాల నిల్వ ఉండదు. సరైన స్థాయిలో నీరు తాగని ఎడల, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది మరియు కాలేయ ముఖ్య విధి అయినట్టి, కొవ్వు పదార్థాల వినియోగం కూడా జరగదు. కావున, త్వరగా బరువు తగ్గుటకు నీటిని అధికంగా సేవించండి.Image Courtesy:Getty Images

  • 4

    నమలండి

    త్వరగా బరువు తగ్గుటకు, తీసుకున్న ఆహరం పూర్తిగా శరీరానికి వినియోగింపబడాలి. మీరు ఆహరం తీసుకున్న వెంటనే శక్తి ఉత్పన్నం జరగదు మరియు ఆహరం పూర్తిగా జీర్ణమైన తరువాత మాత్రమే శక్తి విడుదల జరుగుతుంది. మీరు తిన్న ప్రతిదీ కనీసం 8 నుండి 12 నిమిషాల పాటూ నమలండి. దీని వలన అధిక ఆహార సేకరణ తగ్గించిన వారు అవుతారు ఫలితంగా శరీర బరువు కూడా తగ్గుతారు.Image Courtesy:Getty Images

  • 5

    ఆపిల్

    ఆపిల్ తక్కువ క్యాలోరీలను కలిగి ఉంటుంది, అధిక క్యాలోరీలను అందించే ఆహారాలకు బదులుగా ఆపిల్'ను తినండి. ఎక్కువగా ఆపిల్'లను తీసుకోవటం వలన శక్తి కూడా తక్కువగా పొందుతారు. ఒక గిన్నె నిండా తరిగిన పచ్చి ఆపిల్ నుండి కొవ్వు పదార్థాలు కాకుండా, 65 క్యాలోరీలు మాత్రమె పొందుతారు మరియు సాధారణ పరిమాణంలో ఉన్న ఒక ఆపిల్ నుండి 110 క్యాలోరీలను పొందుతారు.Image Courtesy:Getty Images

  • 6

    అధిక ఫైబర్

    మీరు తినే ఆహరంలో అధిక మొత్తంలో కరిగే మరియు కరగని ఫైబర్'లను కలపటం వలన, ఆహరం నుండి జీర్ణాశయం అధిక మొత్తంలో నీటిని గ్రహించుకుంటుంది. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉన్న నారింజ పండ్లను తీసుకోవటం వలన జీవక్రియ రేటు పెరిగి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తుంది.Image Courtesy:Getty Images

  • 7

    గ్రీన్ టీ

    ఆరోగ్యకరమైన బరువు తగ్గించుటలో ముఖ్య పాత్ర పోషించేది, గ్రీన్ టీ. రోజులో 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ తాగటం వలన శరీరంలో దాదాపు 35 నుండి 43 శాతం కొవ్వు పదార్థాలను కరిగించిన వారు అవుతారు. ఒకవేళ గ్రీన్ టీ స్వతహాగా తీసుకునేంత సమయం లేకుంటే, గ్రీన్ టీ పిల్స్'లను తీసుకోవచ్చు.Image Courtesy:Getty Images

  • 8

    చిన్న వ్యాయామాలు

    కొన్ని చిన్న చిన్న భౌతిక కార్యాలను అనుసరించటం వలన తగ్గే శరీర బరువు మరే ఇతర పద్దతి ద్వారా తగ్గదనే చెప్పాలి. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలను అనుసరించటం మంచిది అని చెప్పవచ్చు. వ్యాయామాలు చేసేంత సమయం లేకుంటే, ఒక పీడో మీటర్ (నడకదూరాన్ని కొలిచే పరికరము)ను వాడి కొద్ది దూరం నడవటం వలన అధిక క్యాలోరీలను తగ్గించుకోవచ్చు.Image Courtesy:Getty Images

    Tags:
  • బరువు తగ్గించే ప్రణాళిక
  • కొవ్వు తగ్గించే ఔషదాలు
  • బరువు తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు
  • Home Remedies for Weight loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం