Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినదగిన పండ్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 21, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులు పండ్లు తినటం వలన శరీర రక్తంలోని చక్కెరలు అధికం అవుతాయని భయపడుతుంటారు. కానీ వైద్యులు మరియు ఆరోగ్య నిపుణులు మాత్రం పండ్లు తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఎలాంటి హాని కలుగదని చెపుతున్నారు. ఇక్కడ తెలుపబడిన పండ్లు తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఎలాంటి మార్పులు జరుగవు.
  • 1

    మధుమేహ వ్యాధి గ్రస్తులు పండ్లు తినవచ్చు

    కొవ్వు, చక్కర లేని పండ్లను మాత్రమె మధుమేహ వ్యాధి గ్రస్తులు తినాలి మరియు ఏలాంటి పండ్లు తినకూడదని కొందరి భావన. కానీ కొన్ని రకాల పండ్లు తినవచ్చు, వైద్యులు, మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా అన్ని రకాల ఆహర పదార్థాలను తినవచ్చు అని వెల్లడిస్తున్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్పకుండా తినవలసిన ఆహర పదార్థాలు ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి.  Image Courtesy:Getty Images

  • 2

    ఆపిల్

    ఆపిల్ పండ్లు క్యాలోరీల విషయంలో చాలా తక్కువ కలిగి ఉంటాయి. ఆపిల్'ల వలన జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. శరీరంలో 'డిటాక్సీఫియర్'గా పనిచేసే పెక్టిన్'ను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. కావున మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆపిల్ పండ్లను తినవచ్చు.Image Courtesy:Getty Images

  • 3

    చెర్రీస్ & బెర్రీస్

    చేర్రీస్, స్ట్రాబెరీ మరియు బ్లూబెరీస్'లు 'ఆంతోసైయనిన్స్' అనే రసాయనాలను కలిగి ఉంటాయి, ఈ రసాయనాలు శరీర రక్తాన్ని చిక్కగా మారుస్తాయి మరియు ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతాయి, అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణను కల్పిస్తాయి.Image Courtesy:Getty Images

  • 4

    ద్రాక్ష పండ్లు

    ద్రాక్ష పండ్లను తినటం వలన శరీర రక్తంలో చక్కెర స్థాయిలు అధికం అవకుండా ఉంటాయి, ముఖ్యంగా తక్కువ ఫాట్, తక్కువ షుగర్ మరియు తక్కువ స్టార్చ్ ఉన్నపుడు ఇవి చక్కర స్థాయిలను తగ్గిస్తాయి.Image Courtesy:Getty Images

  • 5

    కరిగే ఫైబర్ ఉన్న పండ్లు

    కరిగే ఫైబర్ ఉన్న పండ్లు అయినట్టి పుచ్చపండు, స్ట్రాబెర్రీ, పొప్పదిపండు, రేగుపండ్లు మరియు మస్క్ మిలాన్ వంటి పండ్లను తినటం వలన జీర్ణాశయంలో చక్కెరలను గ్రహించటాన్ని శక్తివంతంగా తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ పండ్లను తినటం వలన వారి జీర్ణాశయ వ్యవస్థ పూర్తిగా శుభ్రం చేయబడుతుంది.    Image Courtesy:Getty Images

  • 6

    నేరేడు పండ్లు

    ఒక గ్లాసు నిండా నేరేడు పండ్లను తినటం వలన రోజు మొత్తం శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఆరోగ్యకరమైన స్థితిలో  ఉంచబడతాయి. నేరేడు పండ్లను మధుమేహ వ్యాధి గ్రస్తులకు రక్షకాలుగా వ్యవహరిస్తారు కారణం- ఇది ప్లీహ గ్రంధి పైన ప్రభావం చూపుతుంది. శరీరంలో ఉండే పిండి పదార్థాలు చక్కెర రూపంలో మారటాన్ని ఆపుతుంది మరియు గ్లూకోజ్ పెరుగుదలను నివారిస్తుంది.Image Courtesy:Getty Images

  • 7

    జామపండు

    మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇది ఒక మంచి తినదగిన పండు. ఇది అధిక మొత్తంలో ఫైబర్'లను కలిగి ఉండి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ 'C' మరియు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి.Image Courtesy:Getty Images

  • 8

    రేగు పండ్లు

    రేగు పండ్లు ఎక్కువ మొత్తంలో యాంటీ-ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ 'A', 'C' మరియు 'E' వంటి విటమిన్'లను కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. Image Courtesy:Getty Images

    Tags:
  • మధుమేహం ఉన్న వారు తినవలసిన పండ్లు
  • మధుమేహం ఉన్న వారికి హాని కలిగించని పండ్లు
  • Fruits for diabetes
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా