Health Tips in HindiHealth Tips

శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 04, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇక్కడ తెలిపిన ఆహారాలు ఆకలిని నియంత్రించి బరువు తగ్గటానికి సహాయపడతాయి.
  • 1

    బరువు తగ్గటం

    చాలా మంది బరువు విషయంలో ఆందోళనలకు గురవుతుంటారు మరియు బరువు తగ్గించుకోవటానికి చేసే ప్రయత్నంలో విఫలం అవుతున్నారు. మనము బరువు తగ్గించికోటానికి చేసే ప్రయత్నంలో, ఆకలి వేసినపుడు తయారు చేసిన ప్రణాలికలను మరచి, ఎక్కువగా తింటూ ఉంటాము. ఇక్కడ మేము తెలుపిన ఆహర పదార్థాలను తినటం మీరు ఆకలి పరంగా సంతృప్తి చెంది, బరువు తగ్గే అవకాశం ఉంది. Image Courtesy@www.gettyimages.in

  • 2

    గ్రీన్ టీ

    బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ 'పాలీ ఫినాల్స్'లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్'లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది. ప్రతి సారి కప్పు గ్రీన్ తాగినపుడల్లా మీరు మంచి భావనను పొందుతారు. Image Courtesy@www.gettyimages.in

  • 3

    బ్రోకలీ

    బ్రోకలీ అనేది అద్బుతమైన, ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహరం మరియు ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఎక్కువ మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మీరు తీసుకునే ఆహారంలో అధికంగా క్యాలోరీలు, కొవ్వులను అందించే ఆహారాల బదులుగా బ్రోకలీని కలుపుకోండి. Image Courtesy@www.gettyimages.in

  • 4

    నారింజ పండు

    బరువు తగ్గించుటలో సహాయపడే మరొక అద్బుతమైన ఆహరంగా నారింజ పండును చెప్పవచ్చు. ఎక్కువ క్యాలోరీలను అందించే డిషెస్'లకి బదులగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ మరియు విటమిన్ 'C'లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి. Image Courtesy@www.gettyimages.in  

  • 5

    నీరు

    ఈ విషయం చాల మందిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, కానీ ఇది నిజం. నీరు వలన శరీరంలోని ఎక్కువ పౌండ్స్'లను కోల్పోయేలా చేస్తుంది. స్త్రీలలో ఎవరైతే నీటి శాతం అధికంగా ఉన్న ఆహర పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారో, వారి BMI (బాడీ మాస్ ఇండెక్స్) తక్కువగా ఉంటుందని 'యూనివర్సిటీ అఫ్ టోక్యో' వారు కనుగొన్నారు. ఇవి మీ ఆకలిని ప్రత్యామ్నాయ పరచవు కానీ నీరు మాత్రం మీ ఆకలిని తీరుస్తుంది. Image Courtesy@www.gettyimages.in

  • 6

    క్యాబేజీ

    క్యాబేజీని మీ ఆహర ప్రణాళికలో కలుపుకోవటం వలన ఆకలి తగ్గుతుంది. ఇది మీ శరీర అధిక బరువును తగ్గించటంలో సహాయపడటమే కాకుండా, అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను, విటమిన్ 'C' కలిగి ఉండి, జీవక్రియ రేటును మెరుగుపరచి, శరీర రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుంది. Image Courtesy@www.gettyimages.in

  • 7

    ద్రాక్ష పండ్లు

    ఇది చాలా ఆరోగ్యవంతమైన ఆహరంగా చెప్పవచ్చు, ద్రాక్ష పండ్లు విటమిన్ 'C', ఫోలిక్ ఆసిడ్'లతో పాటూ, పెక్టిన్ మరియు కరిగే ఫైబర్'లను కలిగి ఉంటుంది. ద్రాక్షలు మీ ఆరోగ్యాన్ని ప్రభావిత పరచకుండా, మీ శరీర బరువును మాత్రమె తగ్గిస్తాయి. Image Courtesy@www.gettyimages.in

  • 8

    రాడిషేస్

    రాడిషేస్ జీర్ణక్రియలో వచ్చే సమస్యలను త్రోలగించే పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, యాంటీ ఆక్సిడెంట్ మరియు సల్ఫర్ వంటి పోషకాలను కలిగి ఉంటుంది. తరచుగా రాడిషేస్'లను తీసుకోవటం వలన మీ జీర్ణక్రియ స్థాయిలను పెంచి, బరువు పెరుగుదలను అరికడుతుంది. ఇవి మీకు ఫుల్'గా అనిపించేలా చేసి, మీ శరీర బరువును తగ్గేలా చేస్తుంది. Image Courtesy@www.gettyimages.in

  • 9

    సాల్మన్

    శరీర బరువు తగ్గించటంలో సాల్మన్ శక్తివంతంగా పని చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాట్'లను కలిగి ఉంటుంది. శరీర బరువును శక్తివంతంగా తగ్గించే ఒమేగా-3 అనే ఫాటీ ఆసిడ్'ను పుష్కలంగా కలిగి ఉంటుంది. శరీర బరువు తగ్గించుకోటానికి సాల్మాన్ తగిన సహాయాన్ని అందచేస్తుంది.

  • 10

    గుడ్డు

    మీ శరీర కండరాల బరువు పెరుగుటకు గుడ్లు మంచి ఆహరంగా చెప్పవచ్చు. 'లూసియానా స్టేట్ యూనివర్సిటీ' వారు స్త్రీల పైన పరిశోధనలు జరిపి, రోజు ఉదయాన గుడ్డు, తక్కువ క్యాలోరీలను అనించే టోస్ట్ మరియు జేల్లీలను ఆహరంగా తీసుకోవటం వలన మిగిలిన వారితో పోలిస్తే వారి శరీరంలోని కొన్ని పౌండ్స్'ను త్వరగా కోల్పోయినట్టుగా తెలిపారు. Image Courtesy@www.gettyimages.in

  • 11

    బ్రౌన్ రైస్

    బ్రౌన్ రైస్' తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, ఎక్కువ మొత్తంలో ఫైబర్'లను కలిగి ఉంటుంది, మీరు బరువు తగ్గాలి అనుకుంటే బ్రౌన్ రైస్ తినటం వలన రోజంతా ఆకలిగా అనిపించదు మరియు సులభంగా బరువు తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకున్న సమయంలో, ఆకలిచే సమస్యలు ఎదుర్కొన్నపుడు ఈ ఆహారాల ను తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు. Image Courtesy:Getty Images

    Tags:
  • బరువు తగ్గించే ఆహరం
  • ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ కోసం ఆహరం
  • బరువు తగ్గుటకు చిట్కాలు
  • tips for weight loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • srikalyan21 May 2015
    Good
  • Sudhakar04 Mar 2015
    My age-26, Height-173cm, Weight-88KGS, Please tel me weight loss Tips along with Exercises, food instructions for loss weight.
  • Swamy18 Mar 2015
    These tips are very use full.
  • ankaiah03 May 2015
    Slim is very health
  • kishore23 Aug 2015
    Give me some tips for weght lose...
  • ramesh21 Jun 2015
    Mera wajan 77 hain. ummar 37 height 5.5 Vajan kam karna ka suggestion batho please
  • Prabha 07 Aug 2015
    Awesome I want full details about how to loss weight in detail information to my mail in Telugu plz send me (Prabha.chinna557@gmail.com)plz..................

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ