Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహర ప్రణాళిక

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 23, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహర విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, కారణం తీసుకునే ఆహరంలో చక్కెరలు, ఉప్పు అధికంగా ఉన్నట్లయితే శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువ లేదా తక్కువ అవవచ్చు. కావున మీరు తీసుకునే ఆహరం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం వారి ఆరోగ్యానికి హాని కలిగించని వివిధ రకాల ఆహర పదార్థాలు తెలుపబడ్డాయి.
  • 1

    మధుమేహ వ్యాధి గ్రస్తుల ఆహర నిర్వహణ

    మధుమేహ వ్యాధి గ్రస్తులు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహరం, మంచి ఆహర ప్రణాళిక మరియు కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించని ఆహర పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. మంచి ఆరోగ్య ప్రణాళిక అనగా, ఫైబర్'లను ఎక్కువ కలిగి ఉండాలి, తక్కువ ఫాట్ మరియు గుండె, మూత్రపిండాల ఆరోగ్యానికి హాని కలిగించేదిగా ఉండకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీర రక్త స్థాయిలు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి ఆహార ప్రణాళికలో మార్పులు చేసి మంచి ఆహారాలను మాత్రమే తినాలి.Image Courtesy:Getty Images

  • 2

    ఏ ఆహరం తినాలో తెలుసా?

    నియమబద్దమైన ఆహరాలను తినటం వలన శరీర రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు ఆరోగ్యకర స్థితిలో ఉండి, గుండెపోటు వంటి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులు హోల్ గ్రైన్స్, కూరగాయలు, పండ్లు, ఫాట్-లేని పాల ఉత్పత్తులు, లీన్ మీట్, పౌల్ట్రీ మరియు చేపలను వారి ఆహర ప్రణాళికలో చేర్చుకోవాలి. మీ వైద్యుడితో చర్చించి ఇలాంటి అన్ని పండ్లను మీరు రోజు తినే ఆహరంలో కలుపుకోండి.   Image Courtesy:Getty Images

  • 3

    ఉదయాన అల్పాహారం

    మధుమేహ వ్యాధి గ్రస్తులు అల్పాహారంగా ఎంచుకోటానికి చాలా రకాలు ఆహారాలు అందుబాలుటులో ఉన్నాయి. అల్పాహారంగా తీసుకోటానికి తక్కువ చక్కెరలను కలిగి ఉండే యొగ్ హార్ట్. రోజు ఉదయం ఇంట్లో అల్పాహార సమయంలో, ఉల్లిపాయ, జీలకర్రతో చేసిన ఆమ్లెట్ మంచి అల్పాహారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా అల్పాహారంగా చిన్న గిన్నెనిండా తృణధాన్యాలు మరియు స్టాబెర్రీలతో కలిపిన పాలు మంచి ఉదయపు ఆహారంగా చెప్పవచ్చు.    Image Courtesy:Getty Images

  • 4

    మధ్యాన్న భోజనం

    మధ్యాన్న ఆహరంగా లీన్-మీట్ సాండ్ విచ్'తో హోల్ గ్రైన్ బ్రెడ్, ఒక భాగం పచ్చని కూరగాయలు మరియు ఆపిల్'లతో కలిపిన ఆహరం మధ్యాన్న భోజనానికి అద్బుతమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇవి మాత్రమే కాకుండా, పీర్స్ మరియు సలాడ్స్'లతో కలిపిన ఆహరంలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. కానీ మీ మధ్యాన్న ఆహారంగా కేక్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాల వలన మీ శరీర రక్తంలోని చక్కర స్థాయిలను పెంచి ప్రమాదానికి గురి చేస్తాయి.Image Courtesy:Getty Images

  • 5

    రాత్రి భోజనం

    మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజులో చివర తీసుకోవలసిన ఆహరంలో ప్రోటీన్ (విత్తనాలు లేదా జున్ను) మరియు ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా పచ్చని కూరగాయలు మరియు పండ్లు (ద్రాక్ష పండ్లు లేదా నారింజ రసం) రాత్రి తినే ఆహరంలో ఉండేలా చూసుకోండి. చేపలు అద్బుతమైన రాత్రి భోజనంగా చెప్పవచ్చు; నూనెల వేయించిన సాల్మన్ (లేదా లీన్ ఫిష్) మరియు వీటితో అన్నం కూడా మంచి ఆహారంగా చెప్పవచ్చు.Image Courtesy:Getty Images

  • 6

    స్నాక్స్

    భోజనం తరువాత రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండుటకు స్నాక్స్ తీసుకోవాలి. ఉడికించిన గుడ్లు, క్యారెట్, విత్తనాలు, తృణ ధాన్యాలు మరియు పల్లీలు జున్ను, పండ్లు (ఆపిల్ మరియు ద్రాక్ష పండ్లు) మరియు తక్కువ చక్కెరలు ఉన్న గ్రానోల వంటివి మంచి స్నాక్స్'గా చెప్పవచ్చు.Image Courtesy:Getty Images

  • 7

    పూర్తి వారానికి ప్రణాళిక

    మధుమేహ వ్యాధి గ్రస్తులు పూర్తి వారానికి ఆహార ప్రణాళికను తయారు చేయండి, కానీ మీరు ప్రణాళిక తయారు చేయటానికి ముందుగా మీ వైద్యుడితో చర్చించండి. మీ భోజనంలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహర పదార్థాలను ఎక్కువగా ఉండేలా ప్రయత్నించండి. మీ ఆహర ప్రణాళికను ఎప్పటికపుడు పరిశీలిస్తూ, సమీక్షించుకోవటం ముఖ్యం. దీని కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి.Image Courtesy:Getty Images

  • 8

    పోషకాల ఆవశ్యకత

    మీరు తీసుకునే ఆహరంలో శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలను ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యానికి ప్రమాదానికి గురి చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని మీ వైద్యుడు సలహా ఇస్తుంటాడు. అంతేకాకుండా, విటమిన్, మినరల్స్ మరియు ఫైబర్ అధికంగా ఉన్న ఆహర పదార్థాలను తీసుకోమని సలహా ఇస్తాడు.Image Courtesy:Getty Images

  • 9

    పిండి-పిండి పదార్థాలు లేని ఆకుకూరలు

    మీరు తినే ఆహరంలో ఎక్కువగా పిండి పదార్థాలు లేని కూరగాయలు ఉండకుండా జాగ్రత్త పడాలి. స్పీనాచ్, క్యారెట్, బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాట, దోసకాయ మరియు విత్తనాలు తక్కువ స్థాయిలో పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. ఇతరేతర ఆహర పదార్థాల కన్నా వీటిని అధికంగా తీసుకోవచ్చు.Image Courtesy:Getty Images

  • 10

    ఆహరం మరియు వ్యాయామాలతో మధుమేహ వ్యాధిని నిర్వహించండి

    మీ జీవనశైలిలో భౌతిక కార్యకలపాలు తప్పని సరిగా అవసరం, మధుమేహ వ్యాధి గ్రస్తులలో వ్యాయామాలు చేయటం కష్టం. ఇలాంటి సమయంలో మీ వైద్యుడిని సంప్రదించి సరైన విధంగా శిక్షణ తీసుకోండి. ముఖ్యంగా నడవటం, బైకింగ్ మరియు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు మధుమేహం ఉన్న వారికి మంచి వ్యాయామాలు అని చెప్పవచ్చు. Image Courtesy:Getty Images

    Tags:
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆహరం
  • షుగర్ వ్యాధికి ఆహరం
  • Diet for Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • Saisubbarao 12 Apr 2015
    My father & grandfather also having diabetes. My age is 30. Please tell me how to take care of my health. Mr. Saisubbarao Please check these link and you can improve your health by these lips http://telugu.onlymyhealth.com/eating-to-prevent-control-and-reverse-diabetes-in-telugu-1429616473

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు