Health Tips in HindiHealth Tips

గర్భిణీలు రోజు అల్లం తినటం వలన కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సహజ ఔషదంగా పేర్కొనే అల్లం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలలో దీని వలన కకలిగే లాభాలు అనేకమనే చెప్పవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అల్లం

    సహజసిద్దంగా లభించే ఆహారపదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లంలో ఉండే అల్లీసిన్ అనే సమ్మేళనం గర్భిణీల పొట్టలో ఏర్పడే అధిక ఆసిడ్ లను మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ సహజ ఔషదం గర్భిణులలో కలగే కడుపుబ్బరం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గర్భిణీల రోజు వారి ఆహార ప్రణాళికలో అల్లం చేర్చుకోవడం వలన కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    రక్త ప్రసరణను పెంచుతుంది

    సహజ ఔషదంగా పేర్కొనే అల్లం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలలో దీని వలన కకలిగే లాభాలు అనేకమనే చెప్పవచ్చు. గర్భిణులు వారి రోజు పాటించే ఆహార ప్రణాళికలలో అల్లం కలుపుకోవటం వలన తల్లి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, అభివృద్ధి చెందుతున్న శిశువులో కూడా రక్త ప్రసరణ మెరుగుపడి, ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

  • 3

    మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది

    గర్భిణులు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య- మార్నింగ్ సిక్నెస్. గర్భిణులు వారు పాటించే రోజు వారి ఆహార ప్రణాళికలో అల్లం చేర్చుకోవటం వలన మార్నింగ్ సిక్నెస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారని పరిశోధనలలో తెలుపబడింది.

  • 4

    యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

    అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీలుగా పని చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ లు గర్భిణి శరీరంలో వాపులు మరియు నొప్పులను కారణమయ్యే ఫ్రీ రాడికల్ లను తటస్తీరిస్థాయి. కావున గర్భిణి మహిళలు వారు పాటించే ఆహార ప్రణాళికలో అల్లంను తప్పక కలుపుకోవాలి.

  • 5

    వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది

    గర్భిణులకు ముఖ్య పోషకాలుగా పేర్కొనే ఐరన్, విటమిన్ 'C' వంటి పోషకాలు అల్లం ద్వారా అందించబడతాయి. ఈ పోషకాలు శిశువు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ సహజ ఔషదం తల్లి మరియు శిశువు యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచటంతో పాటుగా, జనన లోపాలను కూడా తగ్గిస్తుంది.

  • 6

    గుండె మంటను తగ్గిస్తుంది

    గర్భ సమయంలో కలిగే ఆరోగ్య సమస్యలలో గుండె మంట కూడా ఒకటి. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందుటకు శరీరలో విడుదలయ్యే ఆసిడ్ స్థాయిలను తగ్గించాలి. ఈ ఆసిడ్ ల ఉత్పత్తిని తగ్గించటంలో అల్లం గొప్పగా పని చేస్తుంది. సాయంత్రం తినే ఆహార పదార్థాలలో అల్లంను తప్పక కలుపుకోండి. Image source: Getty Images

    Tags:
  • అల్లం వలన గర్భిణులకు కలిగే ప్రయోజనాలు
  • అల్లం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • పిండాభివృద్దిని పెంచే అల్లం
  • Allam valana garbhinulaku kalige prayojanalu
  • Benefits of ginger during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు.

    రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్య
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు.

    రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్య