Health Tips in HindiHealth Tips

అందాన్ని మెరుగుపరిచే మూలకాలు వంటగదిలోనే ఉన్నాయి

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 26, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చాలా మంది చర్మంపై కలిగే సాధారణంగా సమస్యలకు, ఉదాహరణకు- నల్లటి వలయాలు, మొటిమలు మరియు మచ్చలని తొలగించటానికి ఖరీదైన ఉత్పత్తులను వాడుంటారు. వీటి వలన ఎక్కువ లాభాలను పొందలేము, కానీ మన వంటగదిలోనే ఉండే సుగంధ ద్రవ్యాల వలన శరీర చర్మం యొక్క సమస్యలు తగ్గటమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చర్మ సమస్యలను తగ్గించే వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    తేనె

    సున్నితమైన మరియు మచ్చలు గల చర్మానికి, ఒక చెంచా తేనెను ముఖానికి పూసి, కనీసం 8 నుండి 15 నిమిషాల పాటూ వదిలివేయండి. తేనెలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు, చర్మాన్ని తడిపి, తేమను అందించి, నల్లటి మచ్చలను కలుగచేసే బ్యాక్టీరియాను చంపివేస్తాయి.

  • 2

    కీరదోస

    కీరదోస లేదా దోసకాయ చర్మానికి ఉపయోగపడే ఔషదం మరియు చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలను, కంటి చుట్టూ ఏర్పడే వాపులను సులభంగా తగ్గిస్తుంది. దోసకాయ ముక్కలు కంటి యొక్క సహజ ప్యాడ్'ల వాలే పని చేస్తాయి. తాజాగా కత్తిరించిన దోసకాయ ముక్కలను కంటిపై ఉంచి, కనీసం 20 నిమిషాల పాటూ ఉంచండి.

  • 3

    గుడ్లు

    గుడ్డును ముఖానికి పూయటం వలన బిగుతుగా మరియు నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, గుడ్డు యొక్క తెల్ల సొనను తీసి, ముఖానికి మాస్క్ వాలే పూయండి. ఒక చిన్న గిన్నెలో గుడ్డు యొక్క తెల్లసొనను తీసుకొని, 10 నిమిషాల పాటూ కలిపి, చేతి వేళ్ళతో ముఖానికి పూయండి. ముఖానికి పూసి 30 నిమిషాల పాటూ వదిలేసి, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి.

  • 4

    బొప్పాయి పండు

    బొప్పాయి పండు, అధిక స్థాయిలో విటమిన్ 'A' కలిగి ఉండి మరియు చైతన్యరహిత ప్రోటీన్, నిర్జీవ చర్మ కణాలను, చర్మంపై ఉన్న మలినాలను తొలగించే ''పపైన్'' అనే ఎంజైమ్'ను కలిగి ఉంటుంది. గ్లాసు బొప్పాయి పండు రసం లేదా బొప్పాయి పండు గుజ్జును ముఖానికి రాయటం వలన ఆద్భుతమైన మార్పులను గమనిస్తారు. బొప్పాయి పండు తోలును ముఖానికి రాసి, 5 నిమిషాల పాటూ ఉంచి, చల్లటి నీటితో కడిగి వేయండి.

  • 5

    పసుపు

    భారతదేశంలో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం అని చెప్పవచ్చు. ఆహర పదార్థాలకు రంగు మరియు రుచిని కలిగించటమే కాకుండా కాస్మెటిక్'గా కూడా వాడవచ్చు. పసుపును దోసకాయ రసం లేదా నిమ్మరసంలో కలిపి, చర్మానికి పూయండి. దీనిని 15 నిమిషాల పాటూ అలానే వదిలేసి మరియు నీటితో కడిగి వేయండి. కానీ, ఈ పద్దతిని ప్రతి రోజు పాటిస్తూ, కలిగే మార్పులను గమనించండి.

  • 6

    నిమ్మపండు

    నిమ్మపండు ముఖంపై కలిగే మొటిమలను తగ్గిస్తుంది. దీనిని ముఖంపై ప్యాక్ లేదా నేరుగా పూసి, రంగు మారే వరకు వేచి ఉండండి. నిమ్మపండు సహజంగా శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది.

  • 7

    దాల్చీన చెక్క

    దాల్చిన చెక్క, పొడి చర్మాన్ని, మొటిమలను మరియు నిర్జీవతత్వాన్ని పోగొడుతుంది. ఇందులో, కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్కను కలిపి ముఖానికి వాడండి. దాల్చిన చెక్క చాలా గాడత గల సుగంధ ద్రవ్యం. కావున, కొద్ది మొత్తంలో మాత్రమె కలిపి ముఖానికి వాడండి.

  • 8

    కాఫీ

    రోజును కాఫీతో ప్రారంభినటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు అవునా! కాఫీ, ఎక్సోఫోలేట్ గుణాలను కలిగి ఉండటం వలన అలసిన మరియు నిర్జీవ కణాలను తొలగిస్తుంది. మీకిష్టమైన ఫేస్ వాష్'లో కొద్ది మొత్తంలో కాఫీ పొడిని కలిపి రోజు వాడటం వలన మంది ఫలితాలను పొందుతారు.

    Tags:
  • సుగంధ ద్రవ్యాలు
  • మెరుగైన చర్మానికి సహజ ఔషదాలు
  • సుగంధ ద్రవ్యాలు వాటి ప్రయోజనాలు
  • Beauty Tips from Your Kitchen in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ