Health Tips in HindiHealth Tips

మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 05, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువును పెంచి, నడుము చుట్టూ కొవ్వు పదార్థాలు పెరుగుకుపోయేలా చేస్తాయి. ఆ అలవాట్ల గురించి కింద పేర్కొనబడింది.
  • 1

    పొట్ట చుట్టూ కొవ్వు

    మీ బరువు నిర్వహణలో విఫలం అవుతున్నారని తెలిపేది- పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వు. పొట్టను తగ్గించుకోవటానికి చాలా రకాల వ్యాయామాలను మరియు ఆహార ప్రణాలికలను మార్చినప్పటికీ, మీ పొట్ట తగ్గటం లేదా! దీనికి కారణం మీ అలవాట్లు అని చెప్పవచ్చు. పొట్ట పెరగానికి గల సాధారణ కారణాలు ఇక్కడ తెలుపబడ్డాయి.(Image source:Gettyimages.in)

  • 2

    దాహంగా ఉన్నపుడు సోడా

    చాలా మంది దాహంగా అనిపించినపుడు ఎక్కువ శాతం, చక్కెర ద్రావణాలను లేదా సోడా వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు వలన నడుము చుట్టూ కొవ్వు అలాగే ఉంటుంది. చాలా వరకు ఈ ద్రావణాలు చక్కెరలను కలిగి ఉండి, ఆకలిని పెంచి, అధిక ఆహార సేకరణను ప్రోత్సహిస్తాయి. దాహంగా అనిపించినపుడు పోషకాలు ఎక్కువగా ఉన్న ద్రావణాలను లేదా నీటిని తాగండి.(Image source:Gettyimages.in)

  • 3

    ప్లేట్ నిండా ఆహారం

    పొట్ట తగ్గకపోవటానికి ముఖ్య కారణం- ప్లేట్ నిండా ఆహారం అని చెప్పవచ్చు. ఇలా అధికంగా ఆహారం మీ ముందు ఉండటం వలన శరీరానికి కావలసిన దాని కంటే ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా, శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వ అధికం అవవచ్చు. కావున చిన్న ప్లేట్ లో మీకు కావలసిన మేరకు మాత్రమె పెట్టుకోండి.(Image source:Gettyimages.in)

  • 4

    రాత్రి సమయంలో ఆలస్యంగా తినటం

    నిద్రపోయిన సమయంలో, మన శరీరంలో కొవ్వు పదార్థాలు వినియోగించబడతాయి. రాత్రి సమయంలో ఆలస్యంగా తినటం వలన ఈ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడటమే కాకుండా, కొవ్వు పదార్థాల వినియోగానికి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా, ఆలస్యంగా పొట్టనిండా తినటం వలన ఆసిడ్ లు ఎక్కువ విడుదల అవటం లేదా అజీర్ణానికి దారి తీయవచ్చు. (Image source:Gettyimages.in)

  • 5

    అల్పాహారం మానటం

    మన శరీరానికి అల్పాహారం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. అల్పాహారాన్ని మరచినట్లయితే, మధ్యాన్న భోజనంలో ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో కొవ్వుపదార్థాలు అధికమై, పొట్ట చుట్టూ పేరుకుపోయే అవకాశం ఉంది. కావున ఎప్పటి ఆహారాన్ని అపుడే తినటానికి ప్రయత్నించండి.(Image source:Gettyimages.in)

  • 6

    భావోద్వేగాల సమయంలో ఆహారం

    భాద, సంతోషం లేదా కోపానికి గురైన సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవటం వలన మీ భాద్వేగాల నుండి భయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ దీని వలన పొట్ట చుట్టూ కొవ్వు చేరే అవకాశం ఉంది. ఇలా భావోద్వేగాలకు గురైన సమయంలో స్నేహితులతో మాట్లాడటం లేదా గ్లాసు నీటిని తాగటం వంటి వాటిని చేయండి.(Image source:Gettyimages.in)

  • 7

    రాత్రి ఆలస్యంగా పడుకోవటం

    నిద్రలోపం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్ర సరిపోకపోవటానికి కారణం, రోజు రాత్రి ఆలస్యంగా పడుకోవటం. నిద్రాలోపాల వలన శరీరంలో 'కార్టిసాల్' హార్మోన్ విడుదల అధికమై, ఆకలిని పెంచటం మూలంగా ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. 7 నుండి 9గంటల పాటూ నిద్ర తప్పని సరి అవసరం.(Image source:Gettyimages.in)

  • 8

    ఎక్కువగా తాగటం వలన

    అధికంగా ఆల్కహాల్ తాగటం వలన కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఆల్కహాల్ నుండి శరీరానికి అధిక మొత్తంలో క్యాలోరీలు అందించబడి, కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, శరీర బరువును పెంచుతాయి. కావున, తగిన స్థాయిలో మాత్రమె తాగటం మంచిది.(Image source:Gettyimages.in)

    Tags:
  • చెడు ఆలవాట్లు
  • నడుము చుట్టూ కొవ్వును పెంచే అలవాట్లు
  • కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచే అలవాట్లు
  • Reasons to get a Paunch in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • varma16 Mar 2015
    Good
  • varma16 Mar 2015
    Good

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల