Health Tips in HindiHealth Tips

నెలసరి తప్పిందా? ప్రేగ్నన్సీ కాకుండా ఈ కారణాలు కూడా కావచ్చు....

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నెలసరి రాలేదంటే మీలో మొదటగా కలిగే సందేహం "గర్భం కావచ్చని" అవునా! కానీ కొన్ని కారణాల కారణంగా కూడా నెలసరి తప్పవచ్చు. ఆ కారణాలేంటో దీని ద్వారా మీరే తెలుసుకోండి.
  • 1

    టెన్షన్ పడకండి; మీరు ప్రేగ్నంట్ కాదు

    చాలా మంది అమ్మాయిలు నెలసరి తప్పగానే గర్భం అని భావిస్తుంటారు అవునా! నెలసరి తప్పటానికి ఇదొకటే కాదు శరీరంలో హార్మోన్ ల స్థాయిలలో మార్పులు, ఒత్తిడి జీవనశైలిలో మార్పులు వంటివి కూడా కారణం కావచ్చు. అలాంటి కారణాల గురించి ఇక్కడ వివరించబడింది.

  • 2

    ఒత్తిడి

    పనిలో ఒత్తిడి లేదా ఇతర కారణాల వలన శరీరంలో ఉండే ఒత్తిడి హార్మోన్ ల పెరుగటం వలన శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలలో మార్పులు కలగవచ్చు. ఈ హార్మోన్ ల స్థాయిలు మారటం వలన రక్తప్రసరణలో మార్పుకు సంభవించటం వలన స్త్రీ రుతుక్రమంలో కూడా మార్పులు కలిగే అవకాశం పుష్కలంగా ఉంది.

  • 3

    డైట్

    అసమతుల్య ఆహరం, సరైన మోతాదులో పోషకాలన తీసుకోకపోవటం లేదా బరువు తగ్గటం కోసం సరిగా ఆహరం తీసుకోకపోవటం వలన రుతుక్రమం సమయానికి రాకపోవచ్చు. మీ శరీరంలో హార్మోన్ లు సరైన స్థాయిలో ఉండాలంటే, పోషకాలతో కూడిన భోజనాలను తప్పక తీసుకోవాలి.

  • 4

    వ్యాధులు మరియు మందులు

    దీర్ఘకాలిక వ్యాధులు మరియు శక్తివంతమైన యాంటీ బయాటిక్ లు కూడా పీరియడ్ లు సమయానికి రాకపోవటానికి కారణం కావచ్చు. ఇవి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలలో మార్పులను కలిగించి, అండోత్సర్గాన్ని ప్రభావిత పరుస్తాయి. తీవ్రమైన వ్యాధులను కలిగి ఉండి, పీరియడ్ మిస్ అయితే మాత్రం వెంటనే వైద్యుడిని కలవండి.

  • 5

    మితిమీరిన వ్యాయామాలు

    వ్యాయామాలను ఎక్కువగా చేయటం వలన నెలసరి సరైన సమయంలో కలిగేలా చేసే ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలలో మార్పులకు గురి చేస్తాయి. అధికంగా వ్యాయామాలను చేసినపుడు, ఈస్ట్రోజెన్ లో మార్పులు కలిగి, నెలసరిలో మార్పులకు కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • 6

    ఊబకాయం

    అధిక బరువు లేదా BMI విలువ కంటే ఎక్కువ బరువు గల స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు కూడా గణనీయంగా పెరిగి ఉంటాయి. హార్మోన్ స్థాయిలలో హెచ్చు తగ్గులు ఉంటే, రుతుక్రమం కూడా తప్పుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గించుకుంటే మీ నెలసరి కూడా సరైన సమయంలో కలుగుతుంది. Image source: Getty Images

    Tags:
  • నెలసరిలో మార్పులకు కారణాలు
  • నెలసరి తప్పటానికి గల కారణాలు
  • గర్భం కాకుండా నెలసరి తప్పుటకు గల కారణాలు
  • Nelasari tapputaku gala itara kaaranalu
  • Causes of irregular periods in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ