Health Tips in HindiHealth Tips

గర్భాన్ని ధరించాలి అనుకునేవారు పాటించాల్సిన 9 ఆహార నియామాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 13, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భ సమయంలో కలిగే ప్రమాదకర మార్పులు మరియు సమస్యల గురించి అందరికి తెలిసిందే. గర్భం ధరించటానికి ముందు ఇక్కడ తెలిపిన ఆహారాలను తినటం వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
  • 1

    పోషకాహారం

    రుతుక్రమంలో స్త్రీలలో అధిక రక్త స్రావం జరుగుతుంది కావున, కోల్పోయిన రక్తాన్ని తిరిగి పొందుటకు మంచి పోషకాహారాలను తీసుకోవాలి. దీని కోసం శుభ్రపరచిన మాంసం, చేప, గుడ్డు, బ్లాక్ బీన్స్, లేన్టిన్స్, పచ్చని ఆకుకూరలు, దుంపలు, బ్రోకలీ, చెర్రీలు, ఎరుపు ద్రాక్షలు, రాస్పెర్రీ వంటి వాటిని ఎక్కువగా తినాలి. మీ శరీర రక్తంలో పోషకాల స్థాయిలను అవసరమైన స్థాయిలో ఉంచాలి.Image Courtesy : Getty Images

  • 2

    విటమిన్ 'C'

    రుతుక్రమ రావటానికి వారం రోజుల ముందు నుండి విటమిన్ సేకరణను అధికం చేయటం చాలా అవసరం. ఇది చాలా ముఖ్యం కారణం, తినే ఆహర పదార్థాల నుండి ఐరన్, మీ శరీరం గ్రహించుటలో ముఖ్య పాత్ర పోషించేది విటమిన్ 'C'నే. విటమిన్ 'C' కోసం సిట్రస్ జాతికి చెందిన పండ్లు, మామిడి పండ్లు, చెర్రీలు, బంగాళదుంప, స్ట్రాబెర్రీలను అధికంగా తినండి. Image Courtesy : Getty Images

  • 3

    విటమిన్ 'E'

    విటమిన్ 'E' ఆరోగ్యానికి మంచిది, కానీ విటమిన్ సేకరణ అవసరమైన మోతాదులో మాత్రమే ఉండాలి, శరీరంలో వీటి స్థాయిలు అధికం అయినట్లయితే దుష్ప్రభావాలను కలుగ చేస్తాయి. విటమిన్ 'E' వలన ఫలదీకరణ స్థాయిలు రెట్టింపు అవుతాయి. అండం విడుదలకు ముందుగా విటమిన్ 'E' స్థాయిలను ఎక్కువగా తీసుకొటానికి ప్రయత్నించండి. గింజలు, విత్తనాలు, హోల్ గ్రైన్స్, చిలకడ దుంప, ఆకు కూరలు, మరియు అవకాడోలలో విటమిన్ 'E' అధికంగా ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 4

    విటమిన్ 'B'

    గర్భాన్ని ధరించాలి అనుకునే స్త్రీలకు విటమిన్ 'B' చాలా మంచిది కావున విటమిన్ 'B' పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోండి. విటమిన్ 'B' అండం విడుదలను, ఫలదీకరణను మరియు పిండస్థాపనను ప్రోత్సహిస్తుంది. విటమిన్ 'B' ఎక్కువగా పచ్చని ఆకుకూరలు, హోల్ గ్రైన్స్, గుడ్లు మరియు శుభ్రమైన మాంసం వంటివి మీ ఆహర ప్రణాళికలో కలుపుకోండి.Image Courtesy : Getty Images

  • 5

    జింక్

    మానవ శరీరంలో ముఖ్యమైన, జన్యు పదార్థం అయినట్టి 'DNA', దాని ఉత్పత్తికి, విధి నిర్వహణకు మరియు మరమ్మత్తుకు జింక్ మూలకం తప్పనిసరి అని చెప్పవచ్చు. గర్భ సమయంలో కణాల అభివృద్ధికి మరియు పెరుగుదలకు జింక్ తప్పనిసరి అవసరం. శుభ్రపరచిన మాంసం, చేపలు, కోడి మాంసం, గుడ్లు, హోల్ గ్రైన్స్, అత్తి పండ్లలో కావాల్సిన స్థాయిలో జింక్ లభిస్తుంది.Image Courtesy : Getty Images

  • 6

    వండిన ఆహరం

    గర్భాన్ని ధరించే ముందు లేదా రుతుక్రమ సమయంలో తాజాగా వండిన ఆహరం మాత్రమే తినండి. తాజాగా వండిన ఆహరం యోనిని వేడిగా ఉంచటం వలన ప్రోజేస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కూడా అధికం అవుతుంది.Image Courtesy : Getty Images

  • 7

    తినకూడని ఆహరం

    గర్భాన్ని ధరించాలని నిర్ణయించుకున్న తరువాత మరియు రుతుక్రమ సమయంలో వీలైనంత మేరకు కాఫీ, శుద్ధిచేసిన చక్కెరలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి. ముఖ్యంగా PMS లక్షణాలను కలిగి ఉన్న వారు వీటికి దూరంగా ఉండండి.Image Courtesy : Getty Images

  • 8

    నీరు మరియు ఫైబర్

    రుతుక్రమం వచ్చే వారం ముందు నీటిని మరియు ఫైబర్ సేకరణను అధికం చేయండి కారణం వీటి వలన కాలేయం ఈస్ట్రోజేన్ ఉత్పత్తి స్థాయిలను పెంచుతుంది. కావున నీటి సేకరణను మరియు ఫైబర్ అధికంగా ఉన్న ఆహర పదార్థాల సేకరణను అధికం చేయండి.Image Courtesy : Getty Images

  • 9

    అనాసపండు

    గర్భాన్ని ధరించాలి అనుకున్న వారు, అనాసపండు సేకరణను అధికం చేయండి, అనాస పండు అండం విడుదలను ప్రోత్సహిస్తుంది. అనాసపండు ''బ్రోమోలీన్''ను కలిగి ఉంటుంది ఇది యోని గోడలను మందపరచి మరియు పిండ స్థాపనను అధికం చేస్తుంది.Image Courtesy : Getty Images

    Tags:
  • గర్భ సమయంలో తినవలసిన ఆహరం
  • గర్భ సమయంలో కలిగే సమస్యలకు పరిష్కార
  • గర్భంతో ఉన్న వారికి ఆరోగ్యకర ఆహరం
  • Diet for Pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • best-anti-aging-treatments-in-telugu

    మీ చర్మం అందంగా మరియు కాపాడుకోటానికి పాటించాల్సిన సూచనలు.
  • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కల
  • best-anti-aging-treatments-in-telugu

    మీ చర్మం అందంగా మరియు కాపాడుకోటానికి పాటించాల్సిన సూచనలు.