Health Tips in HindiHealth Tips

పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామ కార్యకలాపాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 18, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రస్తుతకాలంలో, పిల్లలు ఎలాక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపటం వలన ఎలాంటి వ్యాయామాలు చేయటం లేదు. ఫలితంగా, భవిష్యత్తులో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ తెలిపిన వ్యాయామాలు పిల్లలను చైతన్యవంతంగా ఉంచటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
  • 1

    గెంతే తాడు

    గెంతే తాడు లేదా జంప్ రోప్ వలన పిల్లలకు మంచి కాలక్షేపం అవుతుంది. తక్కువ వేగంతో కూడిన ఈ రకమైన వ్యామమం క్షేమం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, మరింత ఉత్సాహవంతంగా ఉండటానికి గానూ, ఈ వ్యాయామం చేసే సమయంలో పాటలను పాడండి. Image Source : Getty Images

  • 2

    పెంపుడు జంతువుతో నడక

    మీ పిల్లలకు శరీరానికి కావల్సిన భౌతిక కార్యాలను పెంపుడు జంతువు లేదా కుక్క పిల్లలతో నడవటం ద్వారా పొందవచ్చు. కుక్క పిల్లలతో నడవటం, పరిగెత్తటం లేదా దానితో ఆడుకోవటం వలన మంచి వ్యాయామాన్ని పొందిన వారవుతారు. Image Source : Getty Images

  • 3

    సైక్లింగ్

    పిల్లలందరికి సైక్లింగ్ లేదా సైకిల్ తొక్కటం చాలా ఇష్టం. దీనితో మంచి ఉల్లాసమే కాకుండా, ఆరోగ్యంగా మరియు చైతన్యవంతంగా ఉంటారు. సైక్లింగ్ నేర్చుకోటానికి పిల్లలకు ఎక్కువ సమయం పట్టదు. కొన్ని రోజులు మీరు సహాయం చేస్తే చాలు, తరువాత వారే స్వతహాగా సైక్లింగ్ చేస్తారు. Image Source : Getty Images

  • 4

    డ్యాన్స్

    మంచి ఉల్లాసాన్ని ఇచ్చే ఈ రకం వ్యాయామం పిల్లలు తప్పక ఇష్టపడతారు. ఒకే సమయంలో శరీరంలోని వివిధ కండరాలు కదిలింపబడే, మంచి శక్తివంతమైన వ్యాయామంగా దీనిని పేర్కోనవచ్చు. పిల్లలతో పాటూ ఇష్టమైన పాటలను పెట్టికొని మీరు కూడా డ్యాన్స్ చేయండి. Image Source : Getty Images

  • 5

    కరాటే

    మీ పిల్లలను కరాటే వంటి యుద్ద కళ తరగతిలో చేర్పించండి. ఈ రకమైన తరగతులలో వార్మ్ అప్, కదలికల వలన శరీర భాగాలన్నీ కదలికలకు లోనవుతాయి. వీటితో పాటూగా పిల్లలకు క్రమ శిక్షణ, సామాజక నైపుణ్యం కూడా అలవరచుకుంటారు. Image Source : Getty Images

  • 6

    రన్నింగ్

    మీ పిల్లలతో దగ్గరిలో ఉన్న ఉద్యానవనం లేదా గ్రౌండ్ కి వెల్లటం వలన మంచి అనుభుతిని పొందుతారు. మంచి నియమితులను ఏర్పరచుకొని, పిల్లలతో రన్నింగ్ చేయటం వలన వారితో పాటుగా మీరు కూడా లాభపడతారు. Image Source : Getty Images

  • 7

    ఫ్రిస్బీ

    పిల్లలకు ఫ్రిస్బీ అనేది చాలా ప్రయోజనకర వ్యాయామంగా చెప్పవచ్చు. ఫ్లయింగ్ డిస్క్ ను విసరటం, జంపింగ్ మరియు దీనిని అందుకోవటం వలన కాళ్ళు, చేతులు మరియు నడుము కదలికలకు గురవుతాయి. గ్రౌండ్ కు వెళ్లి ఫ్రిస్బీని పిల్లలతో ఆడటం వలన మీరు కూడా మంచి అనుభూతికి లోనవుతారు. Image Source : Getty Images

  • 8

    ఆటలు

    పిల్లలకు రోజు మొత్తం కావలసిన భౌతిక కార్యాలు ఆటల నుండి తప్ప మరేతర పనుల ద్వారా పొందలేరని చెప్పవచ్చు. క్రికెట్, ఫుట్ బాల్ లేదా బాస్కెట్ బాల్ వంటి వాటిలో రన్నింగ్, కదలికలు మరియు అన్ని రకాలుగా శరీరం కదలికలకు గురవుతుంది.   Image Source : Getty Images

    Tags:
  • పిల్లల కోసం వ్యాయామాలు
  • పిల్లలు చేయవలసిన ఆరోగ్యకర వ్యాయామాలు
  • Pillala kosam vyamaalu
  • Exercise for kids in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ