Health Tips in HindiHealth Tips

దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి 7 చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 26, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

దంతాలు ఆరోగ్యంగా ఉంటె, మాట్లాడేటపుడు, నవ్వినపుడు మంచి భావన కలుగుతుంది. క్యావిటి, పళ్ళ క్షయం వంటి వాటి నుండి దంతాలు ఆరోగ్యంగా ఉంచుకొనుటకు ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.
  • 1

    దంతాలను సంరక్షించుకోండి

    దంతాలు ఆరోగ్యంగా ఉంటె, మీరు సంతోషంగా ఉన్నారని అర్థం. దంతాలు ఆరోగ్యంగా ఉంటె, మాట్లాడేటపుడు, నవ్వినపుడు మంచి భావనను కలుగ చేస్తాయి. శరీరంతో పాటూ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మన భాద్యత. దంతాల పట్ల జాగ్రత్తలను తీసుకోవటమం వలన, దంతాలు ఉడిపోవటం, పంటి మరియు చిగుళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.Image Courtesy : Getty Images

  • 2

    మీ దంతాలకు ఏది సరైనది?

    సరైన విధంగా, ఉత్పత్తులను వాడి, దంతాల పట్ల జాగ్రత్త తీసుకున్నట్లయితే, ఎక్కువ కాలం పాటూ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యావిటి కలిగి ఉన్న వారు, ఇతరుల పోలిస్తే మంచి ఉత్పత్తులను వాడాలి. బలహీన దంతాలు, దంతాల ఆరోగ్యం లేదా క్యావిటిలను కలిగి ఉన్న వారు, వైద్యుడిని సంప్రదించి, దంతాలకు సరైన ఉత్పత్తులను వాడాలి.Image Courtesy : Getty Images

  • 3

    ఫ్లోరైడ్ చికిత్స

    పిల్లలు, ఎక్కువగా చక్కెరలు అధికంగా ఉన్న ఆహారలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి దంతాల పైన ఉన్న 'ఎనామిల్' పొరను పాడుచేసి, దంతాలలో క్యావిటిలను కలుగ చేసి వాటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ''ఫ్లోరైడ్ చికిత్స''ను చేపించుకోవటం వలన, ఎనామిల్ పొర తిరిగి ఏర్పడుతుంది. పిల్లలకు 15 సంవత్సరాలు వచ్చే వరకు, ప్రతి సంవత్సరం ఫ్లోరైడ్ చికిత్స చేపించటం మంచిది.Image Courtesy : Getty Images

  • 4

    పళ్ళ క్షయం నిరోధించటానికి

    పిల్లల దంతాల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం తల్లి-తండ్రుల బాధ్యత. మీ పిల్లల దంతాకు ఆరోగ్యంగా ఉండటానికి, పోషకాహారాన్ని అందించాలి మరియు రోజులో రెండు సార్లు బ్రెష్ చేపించాలి. రాత్రిళ్ళు పాలు లేదా తేనే వంటి ఆహర పదార్థాలను తీసుకున్న తరువాత అలానే పడుకోనివ్వకూడదు. ఫలితంగా, దంతాలు అనారోగ్యానికి గురవుతాయి.Image Courtesy : Getty Images

  • 5

    ఆరోగ్యకర ఆహారం

    కొవ్వు తక్కువగా ఉన్నా పాలు, యొగ్ హార్ట్, చీస్ వంటి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినిపించాలి. చక్కెరలేని చూయింగ్ గమ్స్ లను నమలటం వలన, లాలాజలం అధికంగా ఉత్పత్తి చెంది, ఆమ్ల గాడతలను తగ్గిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు మరియు టీ వంటివి చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.Image Courtesy : Getty Images

  • 6

    చక్కెర పదార్థాలను తిన్న తరువాత కడగండి

    దంతాలు, ఎక్కువ చక్కెర పదార్థాలకు బహిర్గతపరచటం వలన ఎనామిల్ పొర పాడవుతుంది. చక్కెర అధికంగా ఉన్న ఆహర పదార్థాలను తిన్న తరువాత, వెంటనే పళ్ళను నీటితో కడగండి. పళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, తిన్న తరువాత పళ్ళను కడగటం ఒక అలవాటుగా మార్చుకోండి.Image Courtesy : Getty Images

  • 7

    నాలుకను శుభ్రంగా ఉంచుకోండి

    నోటిలో మరొక ముఖ్య భాగం నాలుక. నాలుకను శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా లేని నాలుక వలన నోటి నుండి వాసనతో పాటూ, దంతాల ఆరోగ్యం కూడా పాడవుతుంది. కావున ఎప్పటికపుడు నాలుక శుభ్రం చేసుకుంటూ ఉండాలి.Image Courtesy : Getty Images

  • 8

    వైద్యుడి ఎంపిక

    దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మాత్రమె కాకుండా, సరైన దంత వైద్య నిపుణుల ఎంపిక కూడా ముఖ్యమే. మీ వైద్యుడు, మంచి అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి దంతాల సమస్య అయిన తీర్చేలా ఉండాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి కలవటం మంచిది.Image Courtesy : Getty Images

    Tags:
  • దంతాలు
  • దంతాల ఆరోగ్యం
  • క్యావిటీస్
  • పళ్ళ క్షయం
  • పళ్ళు వాటి ఆరోగ్యం
  • Take Care of Teeth in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • girl03 Apr 2015
    My Tooth gums are bleeding..what happened to my gums? if have any solution please tell me sir.

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ