Health Tips in HindiHealth Tips

సన్ స్క్రీన్ లోషన్ కొనే ముందు గమనించాల్సిన ముఖ్య విషయాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 24, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సన్ స్క్రీన్ లోషన్ లు రోజు మొత్తం సూర్యుడి నుండి వచ్చే హానికర (UV) కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఏ రకమైన సన్ స్క్రీన్ లోషన్ ను వాడలో తేలియక సతమతం అవుతున్నారా! సన్ స్క్రీన్ లోషన్ ల ఎంపికలో మీ కోసం ఇక్కడ మంచి సూచనలు ఇవ్వబడ్డాయి.
  • 1

    చర్మ రకాన్ని బట్టి లోషన్ లు

    చాలా మేరకు సన్ స్క్రీన్ లోషన్ లు పొడి చర్మానికి లాభదాయకం. తేమను అందించే చాలా రకాల సహజ సమ్మేళనాలను వీటిలో వాడతారు. ముఖ్యంగా లానోలిన్, నూనెలు మరియు సిలికాన్ రకానికి చెందిన డైమెతికాన్ లను లోషన్ ల తయారీలో వాడతారు. జిడ్డు చర్మాన్ని లేదా మొటిమలతో సమస్యలు ఎదుర్కొంటున్నారా! అయితే నీటి ఆధారిత లోషన్ లను ఎంచుకోండి.   Image Source : Getty Images

  • 2

    అధిక గాడత గల లోషన్ లు

    ఎల్లపుడు అధిక గాడతలు గల సన్ స్క్రీన్ లోషన్ లను ఎంచుకోండి. ఇవి UV-A మరియు UV-B కిరణాల నుండి కాపాడతాయి. తక్కువ సమయం ఎండలో గడపాల్సి వస్తే సన్ ప్రోటేక్టివ్ ఫ్యాక్టర్ (SPF) 15 ఉన్న లోషన్ ను ఎంచుకోండి. ఒకవేళ ఎక్కువ సమయం పాటూ ఎండలో సమయం కేటాయించాల్సి వస్తే, సన్ ప్రోటేక్టివ్ ఫ్యాక్టర్ (SPF) 15 కన్నా ఎక్కువగా ఉన్న లోషన్ ను ఎంచుకోండి.Image Source : Getty Images

  • 3

    మీరేం ఆశిస్తున్నారు?

    మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బ్రాండ్ కు చెందిన సన్ స్క్రీన్ లోషన్ లను ఎంచుకోవచ్చు. ఒకవేళ చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుందా లేదా స్విమ్మింగ్ చేయటానికి వెళ్తే జలనిరోధిత సన్ స్క్రీన్ లోషన్ ను ఎంచుకోండి. మీ చర్మ రకానికి అనుగుణంగా, సన్ స్క్రీన్ లోషన్ లేబుల్ పై ఉండే వివరాలను బట్టి మంచి లోషన్ నుం ఎంచుకోండి. Image Source : Getty Images

  • 4

    అలర్జీ కలిగినట్టు అనిపిస్తే

    అన్ని రకాల లోషన్ లు ఒకేవిధమైన సమ్మేళనాలతో తయారు చేయబడవు. సన్ స్క్రీన్ లోషన్ ను వాడినపుడల్లా మీ చర్మం దుష్ప్రభావాలకు గురి అవుతుందా! అయితే వాటిలో వాడే కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలకు మీ చర్మం సున్నితత్వాన్ని కలిగి ఉందని అర్థం. కావున లేబుల్ లను గమనించి, అలర్జీలను కలుగచేయని లోషన్ లను ఎంపిక చేసుకోండి.Image Source : Getty Images

  • 5

    పిల్లల కోసం

    పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, వయోజన వయసులో ఉన్నవారు వాడే లోషన్ లలో ఉండే రసాయనాలతో పిల్లల చర్మం సులభంగా చర్యలను జరుపుతుంది. లేబుల్ పై పారా-అమైనోబెంజోయిక్ ఆసిడ్ (PABA) మరియు బెంజ్ ఫైనాన్స్ (డైఆక్సిబెంజీన్, ఆక్సిబెంజీన్) ఉన్న వాటిని పిల్లలకు వాడకండి. పిల్లలకు ప్రత్యేకమైనవి తయారు చేయబడి ఉంటాయి వాటిని వాడటం శ్రేయస్కరం.  Image Source : Getty Images

  • 6

    ప్రకటనలను చూసి వాడకండి

    మ్యాగజైన్స్ లేదా టి.వి ప్రసారాలలో వచ్చే లేదా మీ ఇష్టమైన నటుడిచే ప్రకటన చేయబడే వాటిని ఎప్పుడు ఎంచుకోవద్దు. ఎక్కువ ధర లేని వాటితో పోలిస్తే, ఖరీదైన ఉత్పత్తులు మంచి వాసనను మరియు మంచి భావనకు గురి చేస్తాయి. కానీ, సాధారణ వాటి కంటే ఎక్కువ ప్రభావితంగా ఉండకపోవచ్చు. Image Source : Getty Images

  • 7

    లేబుల్ లను చెక్ చేయండి

    సన్ స్క్రీన్ లోషన్ ల తయారీలో వాడే పదార్థాలు కాలక్రమేనా అధోకరణం చెంది ఉండవచ్చు. వీటిని వాడటం చర్మ ఆరోగ్యానికి మంచిది కాదనే చెప్పాలి. కావున లోషన్ లను ఖరీదు చేసే ముందు వాటి లేబుల్ లను శ్రద్దగా పరిశీలించండి. Image Source : Getty Images

  • 8

    లోషన్ ల వాడకం పూర్తి రక్షణ కాదు

    లోషన్ లు సూర్య కిరణాల నుండి కాపాడే ముఖ భాగం మాత్రమే. సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసినంత మాత్రాన, పూర్తిగా ఇదే మన చర్మాన్ని కాపడుతుందనుకోవద్దు. లోషన్ లతో పాటుగా సూర్య కిరణాల నుండి రక్షణ పొందుటకు దుస్తువులను, సన్ గ్లాసులను కూడా వాడండి. Image Source : Getty Images

    Tags:
  • సన్ స్క్రీన్ లోషన్
  • UV కిరణాల నుండి సంరక్షించుకోండి
  • సూర్య కిరణాల నుండి సంరక్షించే చిట్కాలు
  • Sunscreen gurinchina mukhya vishayalu
  • Sun Protection Tips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • యోగ అర్థం మరియు వాటి ప్రాధాన్యతలు

    యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన రూపం. యోగ చేయమని చాలా మంది సలహా ఇస్తారు. కానీ, కింద తెలిపిన విషయాలు ఎవరు చెప్పారు. అవేంటో మ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • యోగ అర్థం మరియు వాటి ప్రాధాన్యతలు

    యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన రూపం. యోగ చేయమని చాలా మంది సలహా ఇస్తారు. కానీ, కింద తెలిపిన విషయాలు ఎవరు చెప్పారు. అవేంటో మ