Health Tips in HindiHealth Tips

మసాజ్ (మర్దన) వలన కలిగే 7 అద్భుత ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 05, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మసాజ్ వలన ఒత్తిడి మరియు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందన్న విషయం అందరికి తెలిసిందే, అంతేకాకుండా, క్యాన్సర్, రూమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని పరిశోధనలలో కూడా వెల్లడైంది. వాటి గురించిన విషయాలు ఇక్కడ తెలుబడింది.
  • 1

    మసాజ్ (మర్దన)

    మీ భాగస్వామి లేదా శిక్షణ తీసుకున్న వ్యక్తి ద్వారా మసాజ్ వలన చాలానే లాభాలు ఉన్నాయి. మాసాజ్ వలన చాలానే ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలలో కూడా నిరూపించబడింది. వీటిలో కండరాల నొప్పి, గాయ నివారణలను తగ్గించుటకు, తీవ్రతరమైన నొప్పులకు, ఉద్రేకత వంటి రకాల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు, వీటితో పాటుగా మసాజ్ వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.Image Courtesy : Getty Images

  • 2

    వెన్నునొప్పి తగ్గుదల

    ఎక్కువ సమయం కూర్చోని పని చేయటం వలన వెన్నునొప్పి సమస్యలు కలుగే అవకాశం ఉంది. మసాజ్ వలన ఈ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది, వెన్నునొప్పులు తగ్గుటకు 'నాన్-స్టిరాయిడల్ యాంటీ-ఇన్ఫ్లమేటరి' మందులను వాడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 2014లో ''ఎడిషన్ ఆఫ్ సైంటిఫిక్ వరల్డ్ జర్నల్స్'' వారు వెన్నెముక నొప్పి గురించి పరిశోధనలు జరిపి, మసాజ్ వలన వెన్నునొప్పి తగ్గుతుంది అని కనుగొన్నారు.Image Courtesy : Getty Images

  • 3

    ఇన్ఫ్లమేషన్'ను తగ్గిస్తుంది

    కొత్త వ్యాయామాలను అనుసరించటం వలన లేదా కటిన వ్యాయామాలను చేసిన తరువాత కలిగే, ఇన్ఫ్లమేషన్'లను మసాజ్ ద్వారా తగ్గించుకోవచ్చు. ''హామిల్టన్''లోని ''బక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఆన్ ఏజింగ్ అండ్ మెక్ మాస్టర్'' వారు తెలిపిన దాని ప్రకారం, వ్యాయామాల కలిగిన ప్రమాదాలు లేదా కండరాల నొప్పులు మసాజ్ ద్వారా తగ్గుతాయి అని తెలిపారు Image Courtesy : Getty Images

  • 4

    రూమాటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గిస్తుంది

    మసాజ్'ను అనుసరించటం వలన రూమాటాయిడ్ ఆర్థరైటిస్ కలిగి ఉన్న పెద్దలలో మరియు కీళ్లలో కలిగే నొప్పులకుగానూ, తక్కిన స్థాయిలో ఒత్తిడితో కూడిన మసాజ్'ను వారంలో నాలుగు సార్లు చేపించటం వలన ఇలాంటివి తగ్గుతాయని ''జర్నల్ కాంప్లిమెంటరీ థెరపీ ఇన్ క్లినికల్ ప్రాక్టిస్''లో ప్రచురించారు.Image Courtesy : Getty Images

  • 5

    ఒస్టియో ఆర్థరైటిస్'ను తగ్గిస్తుంది

    ''నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ మరియు ఆల్టర్నేటివ్ మెడిసిన్'' (NCCAM) ప్రకారం, మోకాళ్ళలో ఒస్టియో ఆర్థరైటిస్ వలన నొప్పికి గురయ్యే వారు మరియు వీటి వలన ఇబ్బందులకు గురయ్యే వారు, వారానికి ఒకసారి 6 నిమిషాల పాటూ స్వీడిష్ మాసాజ్'ను అనుసరించటం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు అని తెలిపారు. Image Courtesy : Getty Images

  • 6

    పెద్దలకు ప్రయోజనాలు

    వయసు మీరిన వారికి 6 వారాల పాటూ రోజు మసాజ్ థెరపీని అందించటం వలన రక్త పీడనం తగ్గటమే కాకుండా, స్థిరంగా కూడా ఉంటుంది. వయసు మీరిన వారిలో, మసాజ్ వలన శరీరం విశ్రాంతి చేకూరటమే కాకుండా, రక్త పీడనం తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది మరియు శరీరాన్ని సమతుల్య పరుస్తుందని ''ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్'' మసాజ్ మరియు బాడీవర్క్ వారు ప్రచురించారు.  Image Courtesy : Getty Images

  • 7

    ఒత్తిడిని తగ్గిస్తుంది

    బ్రెయిన్ క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే వారిలో మసాజ్ చేయటం వలన కొద్ది వరకైన ఉపశమనం కలుగుతుంది. క్యాన్సర్ వ్యాధి తీవ్ర స్థాయిలో లేదా క్యాన్సర్ చివరి దశలో ఉన్న వారికీ మసాజ్ చేయించటం వలన మానసికంగా మరియు శారీరక పరంగా ఉపశమనానికి గురవుతారు. అంతేకాకుండా, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులలో, ఒత్తిడి, ఉద్రేకత, నొప్పి మరియు అలసటలను తగ్గించి వేస్తుంది.Image Courtesy : Getty Images

  • 8

    కీమోథెరపీ చికిత్సలో

    క్యాన్సర్ వ్యాధి చికిత్స అయినట్టి, కీమోథెరపీలో రోగి ఉద్రేకతలకు మరియు అలసటలకు గురవుంటారు, కానీ, మసాజ్'ను చేయటం వలన ఇలాంటి వ్యాధి గ్రస్తులును అలసట మరియు ఇతరేతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ''అప్లైడ్ నర్సింగ్ రిసెర్చ్ 5'' వారు తెలిపారు. అంతేకాకుండా, శారీరక మరియు మానసిక పరంగా సంతృప్తి భావనను కలుగ చేస్తుంది.Image Courtesy : Getty Images

    Tags:
  • మసాజ్
  • మసాజ్ వలన కలిగే లాభాలు
  • మసాజ్ వలన తగ్గే వ్యాధులు
  • Benefits of Massage in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • దోసకాయ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

    దోసకాయ వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే, కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమె కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజ