Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధిని తగ్గించే 7 సహజ చికిత్సలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 27, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఒక్కసారి జీవితంలో మధుమేహ వ్యాధికి గురైతే జీవితాంతం మందులు వాడాలి. అంతేకాకుండా, ప్రతిరోజు శరీర రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలి. మధుమేహ వ్యాధిని సహజంగా తగ్గించే చికిత్సలు, వాటిలో వాడే మూలికలు మరియు ఔషదాల గురించి కింద తెలుపబడింది.
  • 1

    మధుమేహాన్ని తగ్గించే సహజ చికిత్సలు

    'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్' (WHO) ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 347 మిలియన్ల మంది ప్రజలు మధుమేహ వ్యాధిచే భాదపడుతున్నారు. ఇదొక తీవ్రమైన వ్యాధి మరియు శరీరంలో విడుదలైన ఇన్సులిన్ వినియోగించుకోకపోవటం లేదా శరీరానికి కావలసిన స్థాయిలో ప్లీహ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చెందకపోవటం వలన ఈ వ్యాధి కలుగుతుంది. పురాతన కాలం నుండి ఈ వ్యాధిచే చాలా మంది భాదపడుతున్నారు మరియు అందించే చికిత్సలో కూడా చాలా మెరుగుదలు జరుగుతాయి. ఈ వ్యాధిని సహజంగా తగ్గించే చికిత్సల గురించి కింద తెలుపబడింది.(Imagesource:Gettyimages.in)

  • 2

    న్యూట్రిషనల్ థెరపీ

    పోషకాహార థెరపీ (న్యూట్రిషనల్ థెరపీ) వలన టైప్-2 మధుమేహ వ్యాధిని అనగా రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యర స్థాయిలో నిర్వహించ వచ్చని పరిశోధనలలో తెలుపబడింది. 'బ్రిటీష్ సంస్థ' వారు తెలిపిన విధంగా రోజు 800 క్యాలోరీలను తీసుకోవటం వలన శరీరంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో నిర్వహించవచ్చని నిరూపించారు, కావున మధుమేహ వ్యాధి గ్రస్తులు పోషకాహారాన్ని తీసుకోవటం వలన వ్యాధి తీవ్రతలను తగ్గించవచ్చు.(Imagesource:Gettyimages.in)

  • 3

    యోగా థెరపీ

    రోజు యోగాసనాలను అనుసరించటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిదని నిరూపించబడింది. యోగాసనాలలో చిన్న చిన్న భంగిమలతో ప్రారంభించాలి, ఉదాహరణకు- ప్రాణాయామా, శవాసన వంటివి మధుమేహ వ్యాధి తీవ్రతలను తగ్గిస్తాయి. ఈ ఆసనాలలో ధ్యానం మరియు శ్వాస పద్దతులను అనుసరించటం వలన ప్లీహ గ్రంధి మరియు పియూష గ్రంధి (పిట్యూటరీ గ్లాండ్)లు శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలోకి తీసుకువస్తాయి.(Imagesource:Gettyimages.in)

  • 4

    ఆక్యుప్రేజర్

    ఆక్యుప్రేజర్, చాలా మంది మధుమేహ వ్యాధి గ్రస్తులలో మంచి ఫలితాలను కనబరిచింది. ఇందులో, వ్యాధిని ప్రోత్సహించే అంగంపై తన ప్రభావాన్ని చూపి, ఆక్యుప్రేజర్ ద్వారా వ్యాధి తీవ్రతలను తగ్గించి వేయవచ్చు. ఆక్యుప్రేజర్ చికిత్సలో స్థాయిలు, వివిధ అంగాలపై ఆధారపడి నిర్ణయించబడతాయి, ఉదాహరణకు- చిన్న పేగుకు మరియు పిత్తాశయంకు వేరేగా ఉంటాయి. (Imagesource:Gettyimages.in)

  • 5

    నేచురోపతి (ప్రకృతి వైద్యం)

    దీనినే నేచురోపతిక్ మెడిసిన్ (ప్రకృతిసిద్ధ ఔషధం)గా కూడా పేర్కొంటారు, ఈ చికిత్సలో విస్తృత పరిధి సహజ ఔషదాలను ఉపయోగించి చికిత్స అందిస్తారు. ఇందులో హోమియో థెరపీ, హెర్బల్ ట్రీట్మెంట్, ఆక్యుపంక్చర్, లైఫ్ స్టయిల్ కౌన్సిలింగ్ వంటి విభాగాలు కూడా ఉంటాయి. నేచురోపతి ద్వారా శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుటకు గానూ, ఇందులో ఆహర ప్రణాళిక, యోగా మరియు స్టీమ్ బాత్ వంటి చికిత్సలను ఉపయోగించి ప్లీహ గ్రంధిని చైతన్యవంత పరుస్తారు.(Imagesource:Gettyimages.in)

  • 6

    హోమియోపతీ

    మధుమేహ వ్యాధిని, వ్యాధి లక్షణాలను తగ్గించే సంపూర్ణ పద్దతిగా హోమియోపతీని పేర్కొంటారు. చాలా సంవత్సరాల నుండి ఈ పద్దతి అందుబాటులో ఉండటం వలన, మధుమేహ వ్యాధి తీవ్రతలను తగ్గించుటకు హోమియోపతీ వైద్యాన్ని వాడే సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.(Imagesource:Gettyimages.in)

  • 7

    రిఫ్లెక్సాలజీ (ప్రతిచర్య)

    టైప్-2 రకం మధుమేహ వ్యాధిలో రిఫ్లెక్సాలజీ (ప్రతిచర్య) చికిత్స ద్వారా, రక్త ప్రవాహంలో ఉహించదగ్గ మార్పులు కలిగాయని పరిశోధకులు వెల్లడించారు. రిఫ్లెక్సాలజీ (ప్రతిచర్య) చికిత్సను మధుమేహ వ్యాధి గ్రస్తులపై వాడటం వలన రక్త ప్రవాహంలో తగిన లాభదాయకమైన ప్రయోజనాలు కనబడ్డాయని తెలిపారు.(Imagesource:Gettyimages.in)

  • 8

    హెర్బల్ రెమిడీస్

    హెర్బల్ మెడిసిన్ అనేవి మధుమేహ వ్యాధి గ్రస్తుల వ్యాధి తీవ్రతలను తగ్గించే ప్రసిద్ధి చెందినా వైద్యంగా పేర్కొన్నారు. మధుమేహ వ్యాధి తీవ్రతలను తగ్గించే సాధారణ మరియు శక్తివంతమైన ఔషదాలు- ఇండియన్ గుస్బెర్రీ (ఉసిరి), కాకరకాయ (కరేలా), మెంతులు (మెంతి), కరివేపాకు మరియు బ్లాక్బెర్రీస్ వంటి వాటిని సాధారణంగా వాడే సహజ ఔషదాలుగా పేర్కొనవచ్చు.(Imagesource:Gettyimages.in)

    Tags:
  • మధుమేహం
  • డయాబెటిస్
  • మధుమేహ వ్యాధిని సహజంగా తగ్గించే చికిత్సలు
  • Natural Treatments for Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

    చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

    చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.