Health Tips in HindiHealth Tips

వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 25, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. సహజంగా బరువు పెంచే మరియు ఎలాంటి హాని కలిగించని మూలికల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఆరోగ్యకరమైన బరువు

    చాలా మంది, స్థూలకాయత్వంచే భాదపడుతున్నారు, వీరితో సమానంగా, చాలా మంది వారి శరీర బరువును పెంచుకోవాలని చూస్తున్నారు! కొంతమందిలో జీవక్రియ రేటు వేగం అధికం, మరికొంత మందిలో సరైన స్థాయిలో ఆహారం తీసుకోకపోవటం వలన బరువు తక్కువగా ఉంటారని చెప్పవచ్చు. బరువు పెంచుకోవాలి అనుకునే వారి కోసం, వేగంగా బరువు పెంచే మూలికల గురించి ఇక్కడ తెలుపబడింది. ఈ మూలికలు ఆరోగ్యకర బరువు పెంచుటలో  ప్రోత్సహిస్తాయి.Image courtesy: Getty Images

  • 2

    చామోమిలే

    ఆకలిని పెంచే మంచి ఔషదంగా చామోమిలేని పేర్కొంటారు. రోజు ఈ ఔషదాన్ని తీసుకోవటం వలన ఆకలి పెరుగుతుంది మరియు తక్కువ సమయంలోనే మీలో కలిగే మార్పులను గమనించండి. ఆకలి పెరగటం వలన మీ ఆహార సేకరణ కూడా పెరుగుతుంది. తక్కువ బరువు ఉన్నవారు ఈ ఔషదాన్ని వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.Image courtesy: Getty Images

  • 3

    బ్లెస్డ్ థిస్టిల్

    బ్లెస్డ్ థిస్టిల్ కూడా ఆకలిని పెంచటమే కాకుండా, జీర్ణశక్తిని కూడా మెరుగుపరచి, శరీర బరువును పెంచుతుంది. బరువు పెరగటానికి వివిధ రకాలుగా ప్రయత్నించి, నిరాశ చెందిన వారు దీనిని వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు.Image courtesy: Getty Images

  • 4

    జెన్టియన్

    కొన్ని దశాబ్దాల నుండి జెన్టియన్ వేర్లను, ప్రత్యేక కారణం లేకుండా బరువు తగ్గేవారికి మరియు ఆకలి సమస్యలను కలిగి ఉన్న వారికి చికిత్స చేయటానికి ఈ మూలికను వాడుతున్నారు. ఈ మూలిక, జీర్ణాశయంలో ఉండే పోషకాలను గ్రహించుటను ప్రోత్సహించటమే కాకుండా, ఆకలిని కూడా పెంచుతుంది.Image courtesy: Getty Images

  • 5

    డాండెలైన్ వేరు

    వివిధ ఔషదాల తయారీలలో వాడే ఈ ఔషదం, స్త్రీలలో ఆకలని పెంచటమే కాకుండా, శరీర బరువును కూడా పెంచుతుంది. ఆకలిని పెంచి, ముఖ్యంగా గర్భవతులకు చాలా మంచిది అని చెప్పవచ్చు. శరీర బరువును పెంచే మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు వీటిలో ఉంటాయి.Image courtesy: Getty Images

  • 6

    చెన్ ఫై

    సిట్రస్ జాతికి చెందిన ఈ ఎండిన పండ్ల యొక్క తోలు, జీర్ణక్రియను మెరుగుపరచి, ఆకలిని పెంచుతుంది. అంతేకాకుండా, దీనిని అజీర్తిని తగ్గించుటకు గానూ, విరివిగా వాడుతుంటారు. ఇది శరీర సహజ స్రావాలను పెంచి, ఉదర భాగంలో కలిగే సమస్యలను తగ్గించి వేస్తుంది. Image courtesy: Getty Images

  • 7

    అల్లం

    వయసు పైబడిన వారికి, ఔషద గుణాలను కలిగిన అల్లం చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. సాధారణ జలుబు, దగ్గు మరియు పేగులలో కలిగే చిన్న చిన్న సమస్యలను తగ్గించే ఈ ఔషధ గుణాలను కలిగిన అల్లం, అందరి ఇళ్ళలో ఉంటుంది. ఇది ఆకలిని పెంచటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.Image courtesy: Getty Images

  • 8

    సీతాఫలం

    శరీర బరువును పెంచే వాటిలో ఇది ముఖ్యం అని చెప్పవచ్చు. సీతాఫలం, శరీరాన్ని విశ్రాంతి చెందించి, మరియు ఉష్ణోగ్రతలను తగ్గించి వేస్తుంది. ఇది అనోరెక్సియా తగ్గించటమే కాకుండా శరీర బరువు పెంచుటలో శక్తివంతంగా పని చేస్తుంది.Image courtesy: Getty Images

    Tags:
  • బరువు పెంచే మూలికలు
  • వేగంగా బరువు పెంచే పద్దతులు
  • సహజంగా బరువు పెంచే మార్గాలు
  • Herbs for Faster Weight Gain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు