Health Tips in HindiHealth Tips

గర్భ సమయంలో వచ్చే క్లిష్ట సమస్యలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 28, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భ సమయంలో సాధారణంగా చాలా రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి. వాటి గురించిన పూర్తి వివరాలు, సమస్యలు కలుగుటకు గల కారణాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    సమస్యలు

    గర్భ సమయంలో సాధారణంగా స్త్రీలు చాలా సమస్యలకు గురవుతుంటారు. ఈ సమస్యలను ముందుగానే తెలుసుకోవటం వలన తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చు. కొంత మందిలో వీటి పట్ల అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ సమయంలో కలిగే సమస్యలు చాలా ప్రమాదకరం మరియు వీటి వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.Image Courtesy@www.gettyimages.in

  • 2

    తీవ్రమైన డోకులు మరియు వాంతులు

    గర్భం ధరిచిన తరువాత డోకులు చాలా సాధారణం అని చెప్పవచ్చు. కానీ ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. వీటి వలన ప్రశాంతంగా తినలేరు, ద్రావనాలు తాగటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా ఎక్కువగా శరీరం డీ-హైడ్రేషన్'కి గురవుతుంది. ఇలా జరగటం వలన మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. తీవ్రమైన డోకులను కలిగి ఉంటె మాత్రం వెంటనే మీ వైద్యుడిని సంప్రదించి మంచి మందులను సలహా ఇవ్వమనండి లేదా మీ ఆహర నియమాలను మార్చమనండి. Image Courtesy@www.gettyimages.in

  • 3

    స్రావం

    స్రావాలు ఎక్కువగా జరుగుతున్నాయా! అంతేకాకుండా మొదటి త్రైమాసిక గర్భస్థ దశలో కడుపులో నొప్పి, తిమ్మిరులు వంటివి కలిగితే మాత్రం అది 'ఎక్టోపిక్ ప్రేగ్నేన్సి'గా చెప్పవచ్చు. గుడ్డు యోనిలో ఫలదీకరనం చెందకుండా వేరే స్థలంలో ఫలదీకరనం చెందటం వలన ఎక్టోపిక్ ప్రేగ్నేన్సి కలుగవచ్చు. తిమ్మిరులతో కూడిన అధిక స్రావాన్ని గర్భస్రావానికి ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఇలా మూడవ త్రైమాసిక దశలో జరిగితే 'ఎబార్షన్' చేయవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో అత్యవసర మందులు అవసరం. ఇలాంటిబి కలిగినట్లయితే వెంటనే వైద్యుడిని కలవటం చాలా మంచిది. Image Courtesy@www.gettyimages.in

  • 4

    శిశువు యొక్క చర్యలు నియంత్రించటం

    శిశువు కదలికలు కూడా క్రమంగా పరీక్షించటం అవసరం, ఒకవేళ మీ శిశువు కదలికలు తగ్గినట్లయితే, వాటి గురించి తెలుసుకోవటానికి చల్లటి ద్రావణాలను లేదా చల్లటి పదార్థాలను తినండి. ఒక పక్కగా పడుకోండి సాధారణం నియమం ప్రకారం రెండు గంటలలో 10 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు కదలికలు జరపాలి. ఒకవేళ ఎవైన సమస్యల తలెత్తితే వెంటనే వైద్యుడిని కలవండి. శిశువు పెరుగుదల సరిగా ఉందొ లేదో అన్ని అడిగి తెలుసుకోండి.Image Courtesy@www.gettyimages.in

  • 5

    మూడవ త్రైమాసికంలో ప్రారంభ కుదింపు

    కుదింపులను ప్రసవానికి సిద్దం అని తెలుపుటకు గుర్తులుగా చెబుతుంటారు, కొన్ని సార్లు కొంత మంది తప్పుడు కుదింపులను ప్రసవ కుదింపులుగా భావిస్తుంటారు. ప్రసవ కుదింపులు సాధారణంగా 10 నిమిషాలకు తక్కువ లేదా వేగంగా కలుగుతాయి. కానీ తప్పుడు కుదింపులలో కదలికలు తరచుగా కలుగవు. వీటిని బ్రాక్స్టన్-హిక్స్ కుదింపులు, నాన్- రిథమిక్ కుదింపులు అని కూడా అంటారు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలను కలిగి ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి.Image Courtesy@www.gettyimages.in

  • 6

    ఫ్లూ లక్షణాలు

    గర్భంతో ఉన్న ఆడవారు తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు మరియు ముఖ్యంగా ఫ్లూ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. గర్భం ధరించిన వారి ఫ్లూ వాక్సిన్ తీసుకోవటం చాలా అవసరం. ఒకవేళ మీరు ఫ్లూ వ్యాధిని కలిగి ఉన్నట్లయితే వైద్యుడిని కలవండి, వైద్యుడిని కలిసే సమయంలో జాగ్రత్త మీ వలన ఫ్లూ వ్యాధి ఇతర గర్భినులకు వ్యాప్తిచెందే అవకాశం ఉంది.Image Courtesy@www.gettyimages.in

  • 7

    నీరు చేరటం

    గర్భిణుల పాదాల వద్ద తడిగా కనిపించటం చాలా సాధారణం. కారణం గర్భ సమయంలో వారి మూత్ర సంచి నిండి ఒత్తిడిగా ఫీల్ అయి మూత్రం భయటకు వస్తుంటుంది. కొన్ని సమయాల్లో వారి శరీరంలో పొరలు ప్రమాదానికి గురవటం వలన ద్రావనాలు భయటకు వస్తుంటాయి. కావున లీక్ అయ్యే ద్రావనాలు మూత్రమా? వేరే ఇతర ద్రావణాల అని తెలుసుకోవాలి. ఎలాంటి సమస్యలు కలిగిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి.Image Courtesy@www.gettyimages.in

  • 8

    ప్రీ ఎక్లమ్ప్సియా

    తీవ్రమైన తలనొప్పి, కంటి చూపులో సమస్యలు, కడుపులో నొప్పి వంటివి మూడవ త్రైమాసిక దశలో కలుగుతాయి, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి మరియు ప్రాణాంతకరం అని చెప్పవచ్చు. అధిక రక్త పీడనం మరియు మూత్రంలో ఎక్కువ శాతం ప్రోటీన్ వంటివి ఉండటం వలన ఇలా జరగవచ్చు, సాధారణంగా ఇలా 20 వారంలో జరుతుంది. కావున క్రమంగా మీ రక్త పీడన్నాన్ని చెక్ చేపించుకోండి. Image Courtesy@www.gettyimages.in

    Tags:
  • గర్భ సమయంలో వచ్చే సమస్యలు
  • గర్భ సమయంలో వచ్చే సమస్యల పైన అవగాహన
  • Complications at Pregnancy Time in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ