Health Tips in HindiHealth Tips

జుట్టు జీవాన్ని తిరిగి తీసుకువచ్చే బీరు & కలిగే ఇతర 7 ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 07, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనలో చాలా మందికి బీరు ఇష్టమైన ద్రావణం అనే చెప్పవచ్చు. మీకు ఇష్టమైన ద్రావణం జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవండి.
 • 1

  బీర్ తో జుట్టు సంరక్షణ

  అలసిపోయిన సమయంలో చాలా మంది రీఫ్రెష్ కోసం, బీర్ తాగుతుంటారు. అంతేకాకుండా, మన వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన పోషకాలన్నీ బీర్ లో ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే బీర్ కు ఇతర పదార్థాలను కలపటం వలన జుట్టు కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. బీర్ వలన జుట్టుకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.  Image Source : Getty Images

 • 2

  జుట్టు అందంగా కనపడాలా?

  మీ జుట్టు రోజంతా తాజాదనంగా, వత్తుగా కనపడాలి అనుకుంటున్నారా! అయితే, బీరును జుట్టుపై పోయండి. జుట్టు బీరులో ఉండే పోషకాలతో నానపెట్టబడి, ఇందులో ఉండే ఈస్ట్ వెంట్రుకల మొదళ్లకు బలాన్ని చేకూర్చి, జుట్టును పటిష్టంగా మారుస్తుంది.Image Source : Getty Images

 • 3

  షాంపూ

  తలపై చర్మం మరియు జుట్టు శుభ్రంగా ఉండటానికి షాంపూ వాడకం తప్పని సరి. బీరును మనం రోజు వాడే షాంపూలో కలిపి, జుట్టుకు అప్లై చేసి, 5 నిమిషాల పాటూ అలానే వదిలేయండి. తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి. ఇలా చేయటం వలన జుట్టు ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడవచ్చు. కానీ బీరు వలన వచ్చే వాసన తొలగిపోవటానికి గానూ కండిషనర్ వాడకం తప్పని సరి.Image Source : Getty Images

 • 4

  కండిషనర్

  బీరు ను కండిషనర్ గా కూడా వాడవచ్చు. ఒక కప్పు బీరును వేడి చేసి, దీనికి ఒక చెంచా జోజోబ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి, కనీసం 10 నిమిషాల వరకు అలానే వదిలేయండి. తరువాత గమనించినట్లైతే మీ జుట్టు డల్ గా, గరుకుగా ఉండదు. Image Source : Getty Images

 • 5

  దుమ్ము-ధూళిలను తొలగిస్తుంది

  జుట్టలో ఇరుక్కుపోయే దుమ్ము-ధూళిలను బీర్- వెనిగర్ తొలగించినట్లుగా మరేతర ద్రావణాలు తొలగించలేవు. 1 ఔన్ల నీరు, 2 చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్, 1 ఔన్ బీర్ మరియు కొన్ని చుక్కల ఎస్సేన్శియాల్ నూనె (లావెండర్, రోజ్మేరీ లేదా T-త్రీ ఆయిల్) లను కలిపి, మీ జుట్టుకు అప్లై చేసి, నీటితో కడిగి వేయండి.Image Source : Getty Images

 • 6

  చుండ్రు

  చుండ్రు వలన కలిగే సమస్యలను సాధారణంగా ఉండవు. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన బయోటిన్ అనే విటమిన్ బీరులో ఉంటుంది. బీరులో ఉండే ఈ బయోటిన్, చుండ్రును నివారించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.Image Source : Getty Images

 • 7

  హెయిర్ మాస్క్

  బీరు, తేనె మరియు నిమ్మకాయ రసం కలిపి ఇంట్లోనే జుట్టు కోసం మాస్క్ తయారు చేసుకోవచ్చు. బీరును పాత్రలో తీసుకొని 1 నిమిషం పాటూ వేడి చేయండి మరియు దీనికి కొన్ని చుక్కల తేనె, నిమ్మకాయ రసాన్ని కలపండి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత, జుట్టు కు అప్లై చేయండి. 15 నిమిషాల పాటూ ఉంచిన తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి.  Image Source : Getty Images

 • 8

  పోషకాలు

  జుట్టు ఆరోగ్యాన్ని పెరుగుటకు కావలసిన పోషకాలన్నీ బీరు లో ఉన్నాయి. బీరులో ప్రోటీన్, విటమిన్ 'B', ఐరన్, కాల్షియం, ఫాస్పేట్ మరియు ఫైబర్ లను కలిగి ఉంటాయి. ఈ పోషకాలన్నీ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచి, ప్రమాదాలకు గురైన వాటిని మరమ్మత్తులకు గురి చేస్తుంది.Image Source : Getty Images

  Tags:
 • బీర్ తో జుట్టు సంరక్షణ
 • బీర్ వలన కలిగే ప్రయోజనాలు
 • బీర్ వలన అందానికి కలిగే ప్రయోజనాలు
 • Beer valana Juttuku Kalige Prayojanalu
 • Hair Care with Beer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

 • chitti29 May 2015
  very nice but this is very bad smell

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ