Health Tips in HindiHealth Tips

స్టీమింగ్ వలన అందానికి కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 15, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నిజానికి స్టీమింగ్ అనేది, గాయంగా ఉన్న గొంతును మామూలు స్థితికి తీసుకురావటానికి ఉపయోగిస్తారు. కానీ, దీని వలన అందానికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి. స్టీమింగ్ వలన చర్మం మృదువుగా, శుభ్రంగా మరియు ప్రకాశావంతంగా మారుస్తుంది.
  • 1

    ముఖానికి స్టీమింగ్ ఎలా పని చేస్తుంది?

    స్టీమింగ్ అనేది, ఇంట్లోనే చేసుకోగల, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్దతిగా చెప్పవచ్చు. దీని కోసం, స్టవ్ పై నీటిని వేడి చేసి, శుభ్రమైన పాత్రలో తీసుకోండి. టవల్ తలపై కప్పుకొని, వేడి నీటి పాత్రకు దగ్గరగా, కాస్త సమయం పాటూ ఉంచండి. ఇలా వారానికి ఒకసారి, నెలలో నాలుగు సార్లు అనుసరించటం వలన చర్మం పునరుత్పత్తికి గురవుతుంది. దీని వలన మీ చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. స్టీమింగ్ వలన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది. Image Source: Getty

  • 2

    ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది

    స్టీమింగ్, రక్త ప్రసరణను మెరుగుపరచి, ముఖాన్ని వేడి చేస్తుంది. ముఖ చర్మంలో రక్త ప్రసరణ అధికమవటం వలన చర్మ కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాల సరఫారా కూడా అధికం అవుతుంది. ఫలితంగా, మీ ముఖ చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.  Image Source: Getty

  • 3

    మొటిమల కోసం స్టీమింగ్

    ముఖానికి స్టీమింగ్ అందించటం వలన నిర్జీవ కణాలు, బ్యాక్టీరియా, దుమ్ము మరియు మొటిమలకు కారణమయ్యే అధిక నూనెల ఉత్పత్తిని తొలగిస్తుంది. దుమ్ము మరియు బ్యాక్టీరియాలు చర్మ రంద్రాలలో చేరి మొటిమలు కలుగచేస్తాయి. స్టీమింగ్ వలన చర్మ ఉపరితలంపై ఉండే దుమ్ము, ధూళి కణాలను తొలగించి, మొటిమల ఏర్పాటును తగ్గించి వేస్తుంది.   Image Source: Getty

  • 4

    చెమట ఉత్పత్తి

    స్టీమింగ్ వలన అందానికి కలిగే మరొక ప్రయోజనం- ఇది చర్మంపై చెమటను ఉత్పత్తి చెందించి, నిర్జీవ కణాలను మరియు హానికర కారకాలను ముఖ చర్మ కణాల నుండి వేరు చేస్తుంది. అంతేకాకుండా, దీని వలన చర్మ ఇన్ఫెక్షన్ లను తగ్గించి, చర్మాన్ని తాజాగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. Image Source: Getty

  • 5

    నల్లటి & తెల్లటి చారలను తొలగిస్తుంది

    స్టీమింగ్ వలన చర్మ ముఖంపై ఉన్న నల్లటి వలయాలను తొలగిస్తుంది. నూనె ఆధారిత ఆహారాలను తినటం వలన చర్మ ఫాలికిల్ లో మార్పులు జరిగి, నల్లటి వలయాలు ఉత్పత్తి చేస్తాయి. స్టీమింగ్ వలన అన్ని రకాల హానికర కారకాలు తొలగించటం వలన నల్లటి మరియు తెల్లటి చారలు, వలయాలు తొలగిపోతాయి. స్టీమింగ్ వలన కలిగే మంచి ప్రయోజనంగా దీనిని పేర్కొనవచ్చు.  Image Source: Getty

  • 6

    చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది

    20 సంవత్సరాలు దాటిన తరువాత, చర్మం పునరుద్ధరణ ప్రక్రియ తగ్గటం వలన నిర్జీవ లేదా మృత కణాలు సులభంగా చర్మం నుండి తొలగించబడవు. ఫలితంగా ఉత్పత్తి చెందిన నూతన కణాలు చర్మ ఉపరితలంపైకి చేరలేవు. ఫలితంగా చర్మ ఉపరితలం నిర్జీవంగా, వలయాలను కలిగి ఉన్నట్టు కనబడుతుంది. స్టీమింగ్ వలన నిర్జీవ కణాలు తొలగించబడి, చర్మం పునరుద్దరణకు గురి చేయబడుతుంది. Image Source: Getty

  • 7

    స్పాట్స్ మరియు మార్క్స్ తొలగింపు

    స్టీమింగ్ వలన ముఖ చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడి, పోషకాల సరఫరా కూడా అధికమవటం వలన స్పాట్స్ మరియు మార్క్స్ తగ్గిపోతాయి. స్టీమింగ్ కూడా నూతన కణాల ఉత్పత్తిని ప్రోత్సహించి, పాత కణాలను చర్మం నుండి దూరం చేస్తుంది. ఈ విధానం ద్వారా ముఖ చర్మంపై ఉండే స్పాట్స్ మరియు మార్క్స్ తొలగించబడతాయి. Image Source: Getty

  • 8

    పిగ్మేంటేషన్ తొలగింపు

    చర్మం రంగు మారటాన్నిపిగ్మేంటేషన్ పేర్కొంటారు. స్టీమింగ్ వలన చర్మ కణాలలో, రంగు మార్చే వర్ణద్రవ్యాలను తొలగించి, పిగ్మేంటేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది. అంతేకాకుండా, ఇది కణ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. స్టీమింగ్ వలన చర్మానికి అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.Image Source: Getty

    Tags:
  • ఫేస్ స్టీమింగ్
  • అందాన్ని మెరుగుపరిచే చిట్కాలు
  • చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్దతులు
  • Steaming Valana Prayojanalu
  • Benefits of Face Steaming in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ